శ్రీకాకుళం జిల్లా కళింగ సామ్రాజ్యంలో ఉండేది.శ్రీముఖలింగం రాజధానిగా చాలా కాలం ఉండేది. తరవాత రాజధాని భువనేశ్వర్కి మార్చబడిందని చరిత్ర చెపుతోంది.చాలాకాలం ఇక్కడ బౌద్ధమతం ప్రవర్తిల్లింది.అందువల్ల వైదిక, బౌద్ధ మత అవశేషాలు ఉన్నాయి .ఈ జిల్లాలొ దర్శనీయ స్థలాలలో కొన్ని ముఖ్యమైనవి.;-
1.అరసవల్లి- దేశంలో సూర్య దేవాలయాలు ఇంకా ఉన్నా పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇదొక్కటే. వెయ్యేళ్ళ చరిత్ర కలది.2.శ్రీకూర్మం - శ్రీ మహా విష్ణు కూర్మావతారానికి మన దేశంలో ఇది ఒక్కటే ఆలయం.శిల్ప సంపదకు, కుడ్య చిత్రకళకు ప్రసిద్ధి.రెండు ధ్వజ స్తంభాలూండడం ఒక విశేషం .ఇది కూడా వెయ్యేళ్ళ చరిత్ర కలది.3.శ్రీముఖలింగం -1200 యేళ్ళ చరిత్ర కలది.కళింగ శైలిలోగొప్ప శిల్ప సంపద తో విలసిల్లే పెద్ద శివాలయం.4.మిలియాపుట్టిలో ఒడిస్సా రీతిలో కట్టబడిన అందమైన జగన్నాధ ఆలయం.5.శాలిహుండంలోను, దంతవరపుకోటలోను, బౌద్ధ స్తూప అవశేషాలు ఉన్నాయి.6.మహేంద్రగిరి తూర్పుకనుమల్లో ఎత్తయిన శిఖరం. ఇవి కొన్ని మాత్రమే. ఇంకా.వున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి