ఏంజైనా;=పరీక్షలు --1.ప్రాధమికపరీక్షలు-ఆ.రక్తపోటు కొలుచుట భ్.మధుమేహం ,రక్తహీనతకు రక్తపరీక్ష.ఛ్.మూత్రపరీక్ష డ్. కొలెస్తెరాల్ మొ;కొవ్వుపదార్ధాల గణనకు రక్తపరీక్ష (lipid profile)
ఇ.సి.జి.(E.C.G.)=గుందె నుండి వెలువడే విద్యుత్ తరంగాల పటమును పరిశీలించుట
దీనిని విశ్రాంతిగా ఉన్నప్పుడు,ట్రెడ్మిల్ మీద పరిగెత్తినప్పుడు వేరు వేరుగా పరిశీలిస్తారు.
ఎఖో కార్డియో గ్రాం -అధిశబ్ద తరంగాలకు (ultrasoundwaves)గుండె ప్రతిధ్వనులను రికార్డు చేసి పరిశీలించుట.
ఏంజిఒగ్రఫి (angiography) -తొడ,లేక చేయి ధమని ద్వారా సన్నని గొట్టమును గుండెలోకి ఎక్కించి ఒక రంగు పదార్థం తో కొరోనరీ ధమనుల పరిస్థితి పరిశీలించుట .
జాగ్రతలు, చికిత్స '=1.తగిన వ్యాయామము.2.తగిన ఆహార నియమాలు. 3.తగిన జీవన
సరళి.వ్యసనములను విడిచిపెట్టుట ( change of life style) క్రొవ్వు పదార్థములు తగ్గించి ,పీచుపదార్థములు కల పండ్లు,కూరలు అధికముగా తీసుకొనుట
చికిత్స;= 1.మందులు .చిరకాలము నిపుణుల సలహాతో తీసుకోవలెను.
శస్త్రచికిత్స ;=ఏంజియొప్లాస్టీ-ఇందులో మూసుకుపోయిన కొరొనరీ నాళములను చిన్న బెలూన్లచే తెరపించి అవసరమైతే స్టెంటుని పెట్టి రక్తప్రవాహాన్ని సుగమం చేస్తారు.
కొరొనరీ బైపాస్ సర్జెరీ;స్= (coronary bypass graft.CABG) ఇందులో చాతీని కోసి మూసుకుపోయిన రక్తనాళములచోట వేరే చోట నుంచి తీసిన ధమని భాగాలను అతికిస్తారు.మూడు,లేక ఎక్కువచోట్ల మూసుకొన్నప్పుడే ఈ సర్జెరీ చేస్తారు.
అన్ని కేసులకీ చికిత్స ఒకే విధంగా ఉండదు.వయస్సు,శరీరపరిస్థితి, రోగలక్షణాలు ,ఇతరజబ్బులు,చేసిన పరీక్షల ఫలితాలు, వంటి అనేక అంశాలను గుర్తించి నిపుణులు వైద్యవిధానాన్ని నిర్ణయిస్తారు.ప్రారంభ దశలోనే సరి అయిన జాగ్రతలు ,చికిత్స పాటిస్తే ఈ రోజుల్లో చిరకాలం బ్రతికి ఉండటమే కాక ప్రయొజన కరమైన జీవితం గడపుటకు బాగా అవకాశం ఉన్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి