29, జులై 2011, శుక్రవారం

javali, padam

జావళి,పదం:
పూర్వం సినిమాల్లో జావళీలు, పదాలు ఉండేవి.
1.జావళి నృత్యానికి అనువైనదని,సాహిత్యం (చరణాలు)తక్కువగా ఉంటుందని,పరకీయనాయికసంబంధి2.పదంలొ సాహిత్యం(చరణాలు)ఎక్కువగా ఉంటుంది,స్వకీయనాయికసంబంధి  అని ప్రసిద్ధసంగీతవేత్త సంగీతరావుగారు నాకు చెప్పారు.
వీటిలో  శృంగారం ,మధురభక్తి,సమ్మిళితమైవుంటాయి.రసజ్ఞులు,అభిజ్ఞులు వీటి అందాన్ని,మాధుర్యాన్ని ఆస్వాదించగలరు.పాత సినిమాలలో సంగీతదర్శకులు వీటిని కంపోజ్ చేసేవారు.ఇందులో కొన్ని సంప్రదాయంగా వస్తున్నవి,మరికొన్ని సినిమాకోసం రచించినవి.
నాకు గుర్తున్నవి,ఇష్టమైనవి కొన్ని ఉదహరిస్తాను.ఈరకంపాటలని భానుమతిగారు ఎక్కువగా పాడినట్లున్నది.ఎందుకంటే ఆమె వేశ్య,దేవదాసి పాత్రలు
వేసి మెప్పించారు.ఐనా ఆమె హీరొయిన్ ఇమేజ్ చెక్కుచెదరలేదు.భానుమతి జావళీలు.
   1."మంచిదినము నేడే" స్వర్గసీమ చిత్రం
   2. "మల్లీశ్వరి"లో  "పిలచిన బిగువటరా"
   3."రారా నా సామి రారా" విప్రనారాయణ చిత్రం
   4."మేలాయె నీవేళ" చింతామణి లోది.
   పై పాత లన్నిటినీ పాడటమేగాక భానుమతి నృత్యం కూడా చేయడం విశేషం.
   5.భక్త పోతనలో "ఇది మంచి సమయము రారా",మరొక చిత్రంలో
  6. (పేరు గుర్తు లేదు) చెలియా మనకేలనే"-అనే బెజవాడ రాజరత్నం ప్లే బాక్ ,పాటలు.
  7. జయసిమ్హ చిత్రంలో "నడిరేయి గడిచెనే చెలియా"అని వహీదా నృత్యానికి సుశీల పాదిన పాటలు కూడా చాలా బాగా ఉంటాయి.
    తుకారాంలో కాంచన నృత్యానికి,ముత్యాలముగ్గులో హలం నృత్యానికి ప్లేబాక్ పాటలు కూడా ఈ కోవకే చెందుతాయికాని అవి కొంచెం మోడరంగా ఉంటాయి.
'క్షేత్రయ్య' సినిమాలో ఆయన పదాలని రామకృష్ణ పాడితే నాగేశ్వరరావు చక్కగా అభినయించేరు.

28, జులై 2011, గురువారం

chaalu

చాలు 
-----   సందెవేళలలోన చల్లనిచిరుగాలి చాలు -శీతలీకృత హర్మ్యశ్రేణులేల 
        స్వఛ్ఛమగు జలధార యొక్కటి చాలు-మత్త మణిమయ మధు పాత్రమేల    
        తాపముదీర్చ చిక్కటి తరుఛాయయే చాలు -సౌమ్య తూలికా తల్ప శయనమేల 
        ఆకలి తీరంగ తీయని ఫలములున్నను చాలు -పంచభక్ష్యములతో పరమాన్నమేల 
        మదిసేదదీర్చు మంచిమాటలు చాలు -కపటవాగ్ధాటి ప్రవాహమేల 
        నెత్తావి విరజిమ్ము విరజాజి  మాలలు చాలు - చిత్రరత్న విభూషజాలమేల 
        శారదశర్వరీ చంద్రకాంతియె చాలు -కోటివిద్యుత్ప్రభా పుంజమేల 
        అలలపై కదలాడు మురళీరవము చాలు - శతవాద్య సంకుల మహా ఘోష యేల 
                            

javali,padam.

పూర్వం సినిమాల్లో జావళీలు, పదాలు ఉండేవి.

javali,padam.

పూర్వం సినిమాల్లో జావళీలు, పదాలు ఉండేవి.

javali,padam.


26, జులై 2011, మంగళవారం

AmericanVidwan

హిగ్గిన్స్ భాగవతార్ --ఆయన ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాడా?అమెరికన్ తెల్లజాతీయుడు.మన  దేశంలో కర్నాటక సంగీతం బాగా అభ్యసించాడు.దురదృష్ట వశాత్తు అమెరికాలో కారుప్రమాదంలో మరణించాడు. ఆయన పాడిన "ఎందరో మహానుభావులు",కృష్ణా నీ బేగనె బారో",మన విద్వాంసులు పాడిన కన్నా బాగుంటాయి.సాహిత్యం ఉచ్చారణ కూడా నిర్దుష్టంగా ఉంటుంది.కంఠ స్వరం కూడా "రిచ్"గా బాగుండేది.  

25, జులై 2011, సోమవారం

gayatri kaundinya


గాయత్రికౌండిన్య  ;      మా మిత్రులు శ్రీ గంటివెంకటరావుగారి మనమరాలు.మంచి గాయని.అమెరికాలో ఉంటుంది.అక్కడే హిందుస్తాని సంగీతం అభ్యసించింది.14సం:కే నిష్ణాతురాలై సంగీత గాత్ర కచేరి చేసింది.మధురమైన కంఠ స్వరంతో బాటు విద్వత్ కూడా ఉండి బంగారానికి తావి అబ్బినట్లు ఉంటుంది. పంచమస్వరంలో పర్వీన్ సుల్తానా, సుశీల,కంఠస్వరాలకు కొంచెం దగ్గరలో ఉంటుంది.ఈ అమ్మాయి 2008లో అమెరికాలో చేసిన గాత్రకచేరి సీ.డీ.నా దగ్గర ఉంది.జయజయవంతి,ఖమాచ్ రా గాల్లో పాడింది.రాగప్రస్తారం,గమకాలు ,అద్భుతంగా ఉన్నాయి.ఇక్కడ తెలియకపోవచ్చుగాని ,అమెరికాలో కొంతమందైనా వినివుంటారు.
  చి.గాయత్రికి ఉజ్వల భవిష్యత్తు ఉందని,ఇంకా ఉన్నత శిఖరాలని సంగీతప్రపంచంలో అధిరోహించగలదని ఆశిద్దాము.

24, జులై 2011, ఆదివారం

My poems


  నిలిచె హిమాంబువుల్ కుసుమ నేత్రములందు సరోజమాలికా
  కలితజలాశయంబులును కళ్ళములందున ధాన్యరాశులున్
  దళితవిశీర్ణపత్రముల దాకుచు వీచెడి శీతవాతమున్
  చలిచలి యంచు నిల్వెడల నోపని మానవాళియున్
             ----------------
  ప్రాభాతోజ్జ్వల రేఖలున్ సమయగా ప్రాలేయ చేలావృతిన్
  లోభావించి హిమాంశుడయ్యె నినుడున్ రొచిష్మతిన్ గోల్పడన్
   శోభావంతపు స్వర్ణకాంతి వరలెన్ సుక్షేత్రముల్ నల్గడన్
  సౌభాగ్యాతిశయమ్ము  దక్కికృశతన్ సాగెన్ నదీ,కుల్యలున్
              ----------------
  అలరుల క్రొమ్ముడిన్ దురిమి యంగణమందున రంగవల్లులన్
  లలితముగా నలంకరణలన్ బచరించు విలాసినీమణుల్
  కలుషవిదూరవాహినులు ,కల్యలు శుభ్రవిరాజచంద్రికల్
  ఫలభర నమ్ర భూజములు ,పంచెడినింపుగ తేనెవాకలన్. ( నా హేమంతము కవిత నుండి )

23, జులై 2011, శనివారం

Angina-contd.


ఏంజైనా;=పరీక్షలు --1.ప్రాధమికపరీక్షలు-ఆ.రక్తపోటు కొలుచుట  భ్.మధుమేహం ,రక్తహీనతకు రక్తపరీక్ష.ఛ్.మూత్రపరీక్ష డ్. కొలెస్తెరాల్ మొ;కొవ్వుపదార్ధాల గణనకు రక్తపరీక్ష (lipid profile)
  ఇ.సి.జి.(E.C.G.)=గుందె నుండి వెలువడే విద్యుత్ తరంగాల పటమును పరిశీలించుట
  దీనిని విశ్రాంతిగా ఉన్నప్పుడు,ట్రెడ్మిల్ మీద పరిగెత్తినప్పుడు వేరు వేరుగా పరిశీలిస్తారు.
  ఎఖో కార్డియో గ్రాం -అధిశబ్ద తరంగాలకు (ultrasoundwaves)గుండె ప్రతిధ్వనులను రికార్డు చేసి పరిశీలించుట.
  ఏంజిఒగ్రఫి (angiography) -తొడ,లేక చేయి ధమని ద్వారా సన్నని గొట్టమును గుండెలోకి ఎక్కించి ఒక రంగు పదార్థం తో కొరోనరీ ధమనుల పరిస్థితి పరిశీలించుట .
  జాగ్రతలు, చికిత్స '=1.తగిన వ్యాయామము.2.తగిన ఆహార నియమాలు. 3.తగిన జీవన
  సరళి.వ్యసనములను విడిచిపెట్టుట ( change of life style) క్రొవ్వు పదార్థములు తగ్గించి ,పీచుపదార్థములు కల పండ్లు,కూరలు అధికముగా తీసుకొనుట
  చికిత్స;= 1.మందులు .చిరకాలము నిపుణుల సలహాతో తీసుకోవలెను.
  శస్త్రచికిత్స ;=ఏంజియొప్లాస్టీ-ఇందులో మూసుకుపోయిన కొరొనరీ నాళములను చిన్న బెలూన్లచే తెరపించి అవసరమైతే స్టెంటుని పెట్టి రక్తప్రవాహాన్ని సుగమం చేస్తారు.
  కొరొనరీ బైపాస్ సర్జెరీ;స్= (coronary bypass graft.CABG) ఇందులో చాతీని కోసి మూసుకుపోయిన రక్తనాళములచోట వేరే చోట నుంచి తీసిన ధమని భాగాలను అతికిస్తారు.మూడు,లేక ఎక్కువచోట్ల  మూసుకొన్నప్పుడే ఈ సర్జెరీ చేస్తారు.
   అన్ని కేసులకీ చికిత్స ఒకే విధంగా ఉండదు.వయస్సు,శరీరపరిస్థితి, రోగలక్షణాలు ,ఇతరజబ్బులు,చేసిన పరీక్షల ఫలితాలు, వంటి అనేక అంశాలను గుర్తించి నిపుణులు వైద్యవిధానాన్ని నిర్ణయిస్తారు.ప్రారంభ దశలోనే సరి అయిన జాగ్రతలు ,చికిత్స పాటిస్తే ఈ రోజుల్లో చిరకాలం బ్రతికి ఉండటమే కాక ప్రయొజన కరమైన జీవితం గడపుటకు బాగా అవకాశం ఉన్నది.  

22, జులై 2011, శుక్రవారం

Angina


ఏంజైనా పెచ్టొరిస్ ;=అనగా చాతీలొ నొప్పి అని అర్థం.గుండెకి తగినంత రక్త ప్రవాహం అందనప్పుడు కలిగే నొప్పి.శరీరానికంతకు రక్తాన్ని సరఫరా చేసే గుండె సరిగా పనిచేయాలంటే దానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేసేవి కొరోనరీ ధమనులు.ఈ ధమనులు ,వాటి శాఖలు ఇరుకైనా ,అడ్డు ఏర్పడినా ,తాత్కాలికంగా ప్రాణ వాయువు అందక కలిగే నొప్పి ఏంజైనా .ఇది అథెరొ- స్క్లెరొసిస్ అనే మార్పు వలన కలుగును.
   ఇది రెండు రకములు ;=1.నిలకడ ఏంజైనా - ప్రయాస,మానసికమైన ఒత్తిడి, పరిగెత్తుటవంటి వాటి వలన వస్తుంది.ముందు ఊహించవచ్చును.విశ్రాంతితో త్వరగా తగ్గుతుంది. 2.నిలకడలేని ( unstable angina) అనుకొకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు వస్తుంది. ఎక్కువసేపు ఉంటుంది.
 కారణాలు;= 1.పొగతాగుట 2.అధిక రక్త పోటు 3.మధుమేహం 4.ఊబకాయం 5.అధిక మద్యపానం 6.వ్యాయామం  లేక పోవడం 7.వంశ పారంపర్యం 8.మానసిక ఒత్తిడి 9.వృద్ధాప్యంలో కలిగే మార్పులు .
  లక్షణలు ;=1చాతీనొప్పి 2.చెమటలుపట్టుట 3.కడుపులోబాధ4.కళ్ళు తిరుగుట  5.ఊపిరిబిగియుట 6.వాంతి  అగునట్లు వికారము
   ఏంజైనా ,గుందెపోటు (heart attack) ఒకటేనా? --కాదు.గుందె పోటులో దానికండరంలో  కొంత భాగం శాశ్వతంగా  చచ్చిపోతుంది. ఏంజైనాలో తాత్కాలిక బాధ ,ఇబ్బంది కలుగును.కాని,అశ్రద్ధ చేస్తే గుండెపోటుకి దారితీస్తుంది.

21, జులై 2011, గురువారం

naatyakala


ప్రస్తుతం నేను కీ.శే. నటరాజరామకృష్ణగారు రచించిన 'దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర"చదువుతున్నను.ఇది పాత పుస్తకమే.1987లో విశాలాంధ్రవారు ప్రచ్రించారు.సాధికారమైన,ప్రామాణికమైన,గొప్ప నాట్యాచార్యుని రచన .
 వెల : రూ .60. ఇప్పుడు మార్కెట్లో దొరకకపోవచ్చును.అనేక చిత్రాలతో ( illustrations) 350 పేజీల గ్రంథం.

Aneamia

anemia   =అనేమియా లేక రక్తహీనత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.పత్రికల్లో ఆరోగ్య శీర్షికలలో రాస్తుంటారు .
అయినా ఎందుకు రాస్తున్నానంటే --మా అమ్మాయి దగ్గరకు వచ్చే కేసుల్లో కొంతమంది స్త్రీలకూ unTunnaadi. అందుకు 
కారణం కేవలం పేదరికం కాదు.ఇతర కారణాలు ఉండవచ్చును.
   మనదేశంలో రక్తహీనత పిల్లలలో  డెబ్బై శాతం ,గర్భిణీ స్త్రీలలో అరవై శాతం ఉన్నది.దీనివల్ల ప్రసవ సమయంలో తల్లికి ,శిశువుకి ప్రమాదం కలగవచ్చును. 
   ఆరోగ్యవంతులైన స్త్రీలకు హీమోగ్లోబిన్ రక్తంలో ౧౨-౧౪ గ్రాములు \౧౦౦ఎమ్ .ఎల్ ఉండాలి.రక్తంలో  ఎర్రకనాలు కనీసం నలబై లక్షలు (క్యూ. మీ మీ.కి )ఉండాలి.కొందరు ఇంతకన్నా బాగా తక్కువ కలిగి ఉంటారు.
   కారణాలు.--౧.పోషకఆహారలోపం ,ముఖ్యంగా ఇనుము ధాతువులోపం వల్ల.౨.బహిష్టు సమయంలో  ఎక్కువ రక్త స్రావం వలన.    లక్షణాలు =అలసట, నీరసము,పాలిపోవుట ,కళ్ళు తిరుగుట.
జాగ్రతలు, చికిత్స ==పోషకాహారం తీసుకొనుట (ఆకుకూరలు ,గ్రుడ్లు, చిక్కుళ్ళు ,చేపలు మో- )    
          నెల నెల ,రక్తపరీక్ష,    థైరాయిడ్ పరీక్ష    
     ఐరన్ ,ఫోలిక్ యాసిడ్ ,బీ ౧౨ మాత్రలు.
  కొన్ని కేసుల్లో సరిఐన గ్రూపు రక్తం ఎక్కించుట. 

19, జులై 2011, మంగళవారం

Temple treasure

అనంతపద్మనాభస్వామి దేవాలయంలోబయలుపడిన అపార,అమూల్య  సంపద గురించి అంతర్జాలంలోను, టీ.వీ.లోను చర్చలు జరుగుతున్నవి.అత్యధికుల అభిప్రాయం (నా అభిప్రాయం కూడా)ఇలా వుంది.  1.ఆ  సంపద ఆలయంలోనే తరతరాలుగా దానిని దాచి కాపాడిన రాజవంశం అధీనం లోనే ధర్మకర్తలుగా ఉండాలి.2.ప్రభుత్వం గట్టి భద్రత కల్పించాలి. (electronic surveilance) తో సహా .3.సంపదలో కొంతభాగం భక్తుల సౌకర్యాలకి ,ఆలయ అభివృద్ధికి ,అన్నదానం ఇత్యాదులకి ఉపయోగించవచ్చును. 4.అపురూపమైన కొన్ని  వస్తువులను తగిన రక్షణతో ఆలయ ఆవరణలోనే ప్రజలు దర్శించుకొనే యేర్పాటు చేయవచ్చును.కేరళ ముఖ్యమంత్రి ఇందుకు అంగీకరించడంచాలా ముదావహం.సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి కదా !ఏమైనా కేరళ Gods own country  అని రుజువు చేసుకున్నది.

16, జులై 2011, శనివారం

jogarao kathalu -contd.

12.పట్టు పరికిణీ ;=ఇతరులకు బట్టలు కుట్టి జీవిస్తూ తన కూతురు పట్టుపరికిణీ కావాలనే కొరిక తీర్చలేని పేదరాలి కథ.మనసుని కలచివేస్తుంది.
13.ఇంటింటిబూరి ;=అసహాయురాలైన స్త్రీకి సహాయం చెయ్యగలిగినా సకాలంలో అందించకస్వార్ధపరుడై ,ఆమె పాప జబ్బుతో చనిపోడానికి కారకుడైన ఒక గుమస్తా కథ.హృదయ విదారకమైన కథ. మధ్యతరగతి స్వార్థ పరత్వాన్ని ,అవినీతిని ఎండగట్టుతుంది.
     జొగారావు గారి కథల్లో "గుండెతడి" ఉంటుంది.మధ్యతరగతి మనస్తత్వాన్ని వారి కష్టాలని ,సుగుణాలని, అవగుణాలని కూడా ప్రతిఫలిస్తాయి.ఎక్కువ కథలు విషాదాంతాలే. కొన్ని మాత్రం సరదాగా, చిన్న కొసమెరుపులతో అలరిస్తాయి.ప్రసిద్ధ కథారచయిత పంతుల జోగారావు రచించిన ఈ గుండెతడి కథాసంపుటి పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.

jogarao kathalu -contd.

7.గురుదక్షిణ;=తన గురువుగారి కుమార్తె పెళ్ళి జరిపించడానికి అబద్ధంతో వరుణ్ణి ఒప్పించిన ఒక శిష్యుడి కథ.మంచికోసం "వైవాహికములందు బొంకవచ్చును"కదా!
8.వేడుక;=చిన్నతనంలో ఆడిన గుర్రంబండి ఆట మనమలకి నేర్పించి ఆడాలని ఆ ప్రయత్నంలో మరణించిన ఒక వృద్ధుడి కథ.కొంచెం విపరీతమనిపించింది.ఈ కథాంశమే ముఖచిత్రంగా వుంది.
9.ధిక్కారస్వరం ;= పిరికి వాడు,అల్పజీవి,ఐన తండ్రికి తన ధైర్యమైన ప్రవర్తనతో
దారిచూపిన కూతురు కథ."మౌనపోరాటం" సినిమా ప్రభావం కనిపిస్తుంది.
10 .షరతులు వర్తిస్తాయి.;= కట్నం తీసుకోకపోయినా ,పెళ్ళి ఘనంగా జరిపించాలనే షరతులతో మగపెళ్ళి వారు వియ్యంకుణ్ణి అప్పులపాలు చేస్తారు.ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అత్తవారికి ఇవ్వకుండా తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉపయోగించుకొంటుంది.
11. నిలబడు ;=;=బస్సులో ప్రయాణికులందరి తరఫున న్యాయానికి నిలబడ్డ యువకుడి కథ.
12.కలహించుకొన్న దంపతులకు వారి మిత్రుడు జీవితంలో నిజంగా ఏది అపురూపమో అనే గుణపాఠం నేర్పుతాడు.(తాతగారి పెళ్ళిగొడుగే  ఆ అపురూపమైనది.)  
             

15, జులై 2011, శుక్రవారం

గుండె తడి ... పంతుల జోగారావు కథలు



గుండెతడి.
    పంతులజొగారావు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథారచయిత.  మంచి కథారచయిత.ఎక్కువగా కింది మధ్య తరగతి వారి జీవితాలు,వారి సమస్యలు ,కష్టాలు,సరదాల గురించి రాస్తారు.ఇంతకు ముందు అపురూపం అనే పేరుతో కథల సంపుటి ప్రచురించారు.అందులో 12 కథలు ఇందులో చోటు చేసుకొన్నాయి.అందు వల్ల మిగిలిన 12 కథల గురించి క్లుప్తంగా రాస్తాను.
  ఆయన కథా రచన,శైలి ,భాష,ఆడంబరం లేకుండా simple గా సరళంగా ఉంటుంది.విజయ నగరం జిల్లా మాండలీకం లో సహజం గా సాగిపోతుంది. దీర్ఘ సంభాషణలు, వర్ణనలు ఉండవు. కొన్ని కథల్లో చిన్న twist (మలుపు)  ఉంటుంది. సామాన్యుల కష్టాలు,ఆర్థిక ఇబ్బందులు,తరాల అంతరాలు బాగా వర్ణిస్తారు.ఇతని కథల్లో విషాదం,నిర్వేదం ,ఆర్ధ్రత గూడు కట్టుకొని ఉంటాయి. 30.40,యేళ్ళ క్రితం సామాజిక జీవనం,ప్రధానంగా ఉత్తరాంధ్ర లో lowermiddleclass( కిందిమధ్య తరగతి) ,పేదవారి జీవన సరళిని ప్రతిఫలిస్తుంటాయి. అందుకే ఈయనను ఉత్తరాంధ్ర కొ.కు.(కొడవటిగంటికుటుంబరావు) అంటారు.
      1.అల్లుడోడు-   ఒరిస్సా నుండి రైల్లో దొంగ సారా రవాణా గురించిన కథ.
      2,ఉదయం నుంచీ వాన - సంపన్నుల ఇంట్ళో బేబీ పుట్టిన రోజు పండగకి ,అదే రోజు ఆ ఇంటి పనిమనిషి కూతురు పుట్టినరోజుకి తేడాను చిత్రించిన ,మనసుకి హత్తుకు పోయే కథ..
      3,శరణు ,శరణు -  తండ్రి అపు రూపంగా దాచుకొన్న పుస్తకాలని వృధా అని తమతో తీసుకు పోడానికి వద్దన్నా,ఉపాయంగా మనమరాలు వాటిని తాతగారికి అప్పజెప్పడం కథాంశం.
      4.ఊరికి నిప్పంటుకొంది - చలివేంద్రంలో తగాదాతో ఒక పల్లెలో ముఠా కక్షలు పెరగడం  ఇతివృత్తం.
      5.ఎర్రజీరల కళ్ళు -  మనిషి  బాహ్య స్వరూపం,మాటల కరుకుదనంవల్ల ,తప్పు అంచనా వెయ్యకూడదని గుణపాఠం నేర్పుతుంది,
      6.అభ్యంతరం లేదు  -  పెళ్ళికూతురు శారీరక లోపం ఉన్న వరుడిని  పెళ్ళి చేసుకుందుకు అంగీకరిస్తుంది.తన చెల్లెలకి కూడా అంగవైకల్యం ఉన్న సంగతి తల్లి దండ్రులకు గుర్తు చేస్తుంది.

8, జులై 2011, శుక్రవారం

tourist places in srikakulam district

శ్రీకాకుళం జిల్లా కళింగ సామ్రాజ్యంలో ఉండేది.శ్రీముఖలింగం రాజధానిగా చాలా కాలం ఉండేది. తరవాత రాజధాని భువనేశ్వర్కి మార్చబడిందని చరిత్ర చెపుతోంది.చాలాకాలం ఇక్కడ బౌద్ధమతం ప్రవర్తిల్లింది.అందువల్ల వైదిక, బౌద్ధ మత అవశేషాలు ఉన్నాయి .ఈ జిల్లాలొ దర్శనీయ స్థలాలలో కొన్ని ముఖ్యమైనవి.;-
 1.అరసవల్లి- దేశంలో సూర్య దేవాలయాలు ఇంకా ఉన్నా పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇదొక్కటే. వెయ్యేళ్ళ చరిత్ర కలది.2.శ్రీకూర్మం - శ్రీ మహా విష్ణు కూర్మావతారానికి మన దేశంలో ఇది ఒక్కటే ఆలయం.శిల్ప సంపదకు, కుడ్య చిత్రకళకు ప్రసిద్ధి.రెండు ధ్వజ స్తంభాలూండడం  ఒక విశేషం .ఇది కూడా వెయ్యేళ్ళ చరిత్ర కలది.3.శ్రీముఖలింగం -1200 యేళ్ళ చరిత్ర కలది.కళింగ శైలిలోగొప్ప  శిల్ప సంపద తో విలసిల్లే పెద్ద శివాలయం.4.మిలియాపుట్టిలో ఒడిస్సా  రీతిలో కట్టబడిన అందమైన జగన్నాధ ఆలయం.5.శాలిహుండంలోను, దంతవరపుకోటలోను, బౌద్ధ స్తూప అవశేషాలు ఉన్నాయి.6.మహేంద్రగిరి తూర్పుకనుమల్లో ఎత్తయిన శిఖరం. ఇవి  కొన్ని మాత్రమే. ఇంకా.వున్నాయి.

7, జులై 2011, గురువారం

visakha


విశాఖ
--------;పసిప్రాయంలో నీ వడిలో పరుండితి
         నీలతరంగ హస్తాల నిమిరావు నన్ను
         ఎలజవ్వనములోన వలచాను నిన్ను
         తరులతా కుంతలముల మురిపించినావు
             సుందర విశాఖా ! విలాసరేఖా !
         శైలకందరాలలో సానుప్రదేశాలలో
         సైకత చుంబి ఫేన రాశులలో ంధ్యా
         సంధ్యా మారుత సౌరభాలలో
         చంద్రోదయ సువర్ణ రోచులలో
         అలలపై జలతారుదారుల్లో
         ఉదయారుణజలద పంక్తులలో
         ఆడియాడి అలసి నిదురించాను
             సుందర విశాఖా!విలాసరేఖా!  
         సుదూరాన నౌకోపరి తలముపై
         నీహార దుకూలావృత మైన
         నీ తీర సౌభాగ్యమును
         నే తిలకించినాను ,పరవశించాను
              సుందర విశాఖా! విలాసరేఖా !

4, జులై 2011, సోమవారం

old age homes

వృద్ధాశ్రమం : శ్రీకాకుళం వృద్ధాశ్రమానికి ముఖ్య అతిధిగావెళ్లాను.సంస్థ 1996 నుండి పని చేస్తున్నాది. బి.కృష్ణ మూర్తి గారనే రిటైర్డు ఇంకం టాక్స్ కమిషనర్ కృషి ,దీక్ష వలన స్థాపించబడినది.కొందరు దాతల విరాళాలతో ,కొంత ప్రభుత్వ సాయంతో నడుస్తున్నది. 70mandi ఇందులో   ఉచితంగావసతి ,భోజన సౌకర్యం పొందుతున్నారు.నెలకు లక్ష రూఖర్చు ; ఆవుతున్నది.నాకు వీలయిన ఉడతా సాయం చేస్తున్నాను.
  వయోదికుల ఆశ్రమాల ఆవశ్యకత.;-౧.సగటు ఆయుప్రమానం పెరిగి వృద్ధుల సంక్య పెరుగుతున్నది.౨.వారిలో పేదవారు ఎక్కువ.౩.ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై వృద్ధులు ఒంటరిగా జీవించ వలసి వస్తున్నది.౪.వారికి ఆలనా ,పాలనా చూసేవారు ఉండరు
 పెద్దనగరాలలో డబ్బు తీసికొని అన్ని సౌకర్యాలతో ఆశ్రయ మిచ్చే రిటైర్మెంట్ హోమ్స్ ఉన్నాయికాని అవి పేదవారికి ఉపయోగ పడవు.ఇటువంటి .ఉచిత ఆశ్రమాలు కొన్ని మాత్రమె కొన్ని చోట్లలో మాత్రమె ఉన్నాయి..
ప్రజలు.,ప్రభుత్వమూ,ఇంకా ఎక్కువ ఆస్రమాలని స్థాపించవలసిన అవసరం ఎంతయినా ఉన్నది.పెదవారయిన వృద్ధులకు ఇప్పుడిస్తున్న 200roo .పెన్షన్ రూ.౫౦౦కయినా పెంచాలి.        

3, జులై 2011, ఆదివారం

ghantasala early days

ఘంటసాల గురించి  కొత్తగా చెప్పేదేముందని అనుకోవచ్చును .నిజమేకాని రెండు మాటలు చెప్తాను.తొలిసారిగా ఆయన 'స్వర్గసీమ"లో ఒక కోరస్లో పాడినట్లు అందరు రాస్తారు (౧౯౪౫)తర్వాత గ్రిహప్రవేసం సినిమాలో (ప్రఖ్యాత దర్శకుడు యల్. వి .ప్రసాద్ హీరో )హాలాహలమేగయునో అనే పాట పాడారు.ఆయన యిచ్చిన ప్రైవేటు రికార్డులు "కరుణశ్రీ పద్యాలు,బహుదూరపు బాటసారి ,"వంటి తోలిరోజులవి తెలిసినవే .కాని "గాలిలో నా బతుకు "ప్రైవేటు రికార్డుతెలియక   పోవచ్చును .నాకు జ్ఞాపక   మున్నంత వరకు ఆయన తొలిసినిమా పాటలు౧.కీలుగుర్రంలో "కాదుసుమా కలకాదు ",లైలా మజునూ "లో పయనమయే,ప్రియతమా " సాహుకారు  లో "పలుకరాదటేచిలుకా  ".తర్వాత ఘంటసాలవారు  సినీ సంగీత ఆకాసంలో ఎలా దూసుకు పోయారో తెలిసిన విషయమే. ౧౯౫౦కి ముందు ఎక్కువగా యం.యస్.రామారావు ప్లే బాక్ పాడుతుందే వారు. 

1, జులై 2011, శుక్రవారం

charcha

అమేయ విశ్వంలో అనంతకాలంలో --మనమొక త్రసరేనువులంఅ  
జగత్కదా మహా రేఖల్లో --మనమొక బిన్డుమాత్రులం 
క్షణ భంగుర మీ జీవితం --క్షీనించును అనవరతం 
ఇహసుఖమొక ఎండమావి --ఎందులకిక నీ ఆరాటం 
మర్మమ్మెరిగి సద్ధర్మ రీతిని --పరమపద ప్రాప్తికి పాటుపాడమని
తరతరాలుగా రుషివర్యులు తరచి తరచి  బోధించిరి 
             కాని 
సమాంతరముగాచార్వాకాదులు --పక్షి వలె నెగిరి పోవు 
ప్రాణ మున్నంత వరకు --సౌఖ్యంతో జీవించు 
ఉన్నదో లేదో తెలియని పరమునకై --ఉన్నది విలువగు జీవిత కాలము 
వ్యర్ధము చేయనేల --బాధల బొందనేల 
అని వాక్రుచ్చిరి --నాస్తిక వాదులు 
అంతము లేదీ వివాదమునకు              
      __-----___