చలం నవలల గురించి చాలామంది రాసేవున్నారు. అయినా మళ్ళీ ఎవరైనా రాయవచ్చును. మెహెర్, సంహిత ,అనేవారు ఇప్పుడు బాగా విశ్లేషించి రాస్తున్నారు.నేను నా పుస్తకాల్లో శశిరేఖ, మైదానం నవలల గురించి వ్యాఖ్యానించాను .ససిరేఖలో ఆయన శైలి పరిణత పొందలేదు. గ్రాంధికానికి దగ్గరలో ఉంటుందిచలం నాయికల జీవితం
మామూలుగా విషాదాంతంగా ముగుస్తుంది.వీల్లెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని కోపం వస్తుంది.స్త్రీవాదం ,అలాంటి
రచనలు తెలుగులో రాకముందే ,ఎనభై సం /ముందే చలం విప్లవాత్మక రచనలు చేసి మధ్య తరగతి ఆలోచనలను
ప్రభావితం చేసాడుఆయన పెళ్లి,బడి, వ్యవస్థలకు . వ్యతిరేకి.మనం ఇప్పుడా భావాలను వ్యతిరేకిన్చావచ్చునుచలం
నవలలు,కథలు, ద్వారా పరోక్షంగా కాకుండా ,ఆయన రాసిన స్త్రీ అనే వ్యాససంపుటి చదివితే తెలుస్తుంది. స్త్రీల
జీవితాలూ,సమస్యలగురించి చర్చించాడు.ఆర్ధిక, సాంఘిక, వైవాహిక ,సెక్సు,విషయాలన్నిటి మీదా స్పష్టంగా తన
అభిప్రాయాలన్నీ విసదీకరించాడు. కొన్ని పరిష్కారాలు సూచించాడు. ------రమణారావు.ముద్దు
1 కామెంట్:
చలం సాహిత్యం గురించి కబుర్లు చెప్పడం సులభమే కానీ ఆచరణ విషయానికొచ్చినప్పుడే దాట వేస్తారు. ఎందుకు అని అడిగితే కాలం మారిపోయిందనీ, స్త్రీల జీవితాలు మారిపోయాయనీ అంటారు. నిజానికి స్త్రీల జీవితాలు పెద్దగా మారలేదు. అప్పట్లో ఆడవాళ్ళని చదువుకోనివ్వలేదు, ఇప్పుడు చదివించినా స్వతంత్రంగా ఆలోచించనివ్వరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి