19, మే 2011, గురువారం

best movies in telugu

ఈమధ్య హిందూ లో ప్రతివారం ఇంగ్లీష్ సినిమాల్లో పది ఉత్తమ మైనవని వారివారి అభిప్రాయాల్ని చాలా క్లుప్తంగా 
రాస్తున్నారు. అలాగే మన తెలుగు సినిమాల్లో ఉత్తమమైనవాటినినా అభిప్రాయం ప్రకారం రాస్తున్నాను. దీనిపై తప్పక 
భిన్నాభిప్రాయాలు ఉంటాయి. లోకో భిన్నరుచి. ఐతే ఇంగ్లీష్ సినిమాలకి భారతీయ సినిమాలకీ ఒకే ప్రమాణాలు 
పాటించకూడదు.మన మూవీస్లో పాటలు, నృత్యాలు తప్పకవుంటాయి. వాటికి మార్జిన్ వదిలేయాలి. మంచి సంగీతం 
మన సినిమాలకి ఒక అలంకారం కూడా. మరొక సంగతి. ఇటీవలి చిత్రాలగురించి నాకు అవగాహన లేదు. గత ఇరవై 
సం/చిత్రాలగురించి యువతరంలో ఎవరైనా పూనుకొని రాస్తే సంతోషిస్తాను. అభిరుచులు వేరైనా అన్నికలలనీ  
బెరీజువేయ్యడానికి ప్రమాణాలు, కొలబద్దలు, ఉంటాయి. సినిమాలకు సంబంధించినంతవరకు అవి == (౧ బలమైన 
కథా, ఇతివ్రిత్తము. (౨) అనవసరమైన దృశ్యాలు, సంభాషణలు లేకుండా ఉండుట. (౩) వాస్తవికతను ప్రతిబింబించడం. (౪) ప్రతిభావన్తమైన నటన ౫ వీలైతే సందేశం అంతర్లీనంగా ఉండడం (౬) హాస్యం సున్నితంగా ఉండాలి. (౭) టెక్నికల్గా ఉన్నత ప్రమాణాలు ఉండాలి. (౮)మన సినిమాలకు సంగీతం మధురంగా ఉండాలి.అంతేకాక .సాంఘిక, పౌరాణిక  చారిత్రిక, హాస్య చిత్రాలను వేరే కేటగిరీల్లోచూడాలి. ఈ  సూత్రాలప్రకారం నా ఎన్నిక.====

సాంఘికం. ౧.దేవదాసు   (నాగేశ్వరరావు ,సావిత్రి. (౨) మూగ మనసులు  (౩) సాక్షి బాపు (౪) శంకరాభరణం (౫) సాగరసంగమం.  (౬) మాభూమి (౭) నిరేక్శణ (భానుచందర్ ,అర్చన ) (౮) మేఘ సందేశం (నాగేశ్వర రావు). 

హాస్యప్రదానచిత్రాలు: (౧) గుండమ్మ katha (౨) శ్రీవారికిప్రేమలేఖ 

పౌరాణికాలు. (౧) మాయాబజార్ (౨) నర్తనశాల (౩) లవకుశ  (౪) సీతాకల్యాణం. (బాపు)

చారిత్రకాలు, లేక ఆ నేపథ్యం కలవి: (౧) మల్లీశ్వరి (భానుమతి) (౨) పల్నాటి యుద్ధమ్ (కన్నాంబ)
(౩) యోగి వేమన (నాగయ్య) (౪) బొబ్బిలి యుద్ధం (౫).తెనాలిరామకృష్ణ  (౬) అన్నమయ్య 
                                                                                                                         
జానపదాలు: (౧) పాతాళభైరవి. (౨) భైరవద్వీపం.

__ రమణారావు.ముద్దు

కామెంట్‌లు లేవు: