నా మరొక గేయం.
ప్రక్రుతి
------------
సుమ సౌరభముల ,భ్రమర నాదమ్ముల
సాగినది వాసంత సాంధ్యసమీరమ్ము
గ్రీష్మ తాపోదగ్ర కీలావ్రుతములగుచు
వేసవి గాలులు విసరె ధూళి
జలగర్భినుల మోసి సలిల ధారల గురిసి
వరదానమిచ్చేను వానగాలి
హిమబిందువులు రాలి చేమంతి దండల
చలిచిరుగాలుల పొలిచె సీతువున
----------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి