ఆల్ఫ్రెద్హిచ్కాక్ .=సుప్రసిద్ధ సినిమా డైరెక్టర్ =జననం బ్రిటన్లో ౧౮౯౯సమ్;
కొన్నాళ్ళు జర్నలిస్టుగా పనిచేసాడు.కొన్ని సైలెంటు సినిమాల తర్వాత టాకీలు నిర్మించాడు.
౧౯౪౦లొ అమెరికా వెళ్లి వివిధ నిర్మాతల సహాయంతో చాలా సినిమాలకు దర్సకత్వం వహించాడు.
చివరిలో టెలివిజన్ కథల సీరియల్సు నిర్వహించాడు.౧౯౮౦లొ మరణించాడు.ఆయన ప్రత్యేకత ఏమిటిఅంటే ఉట్కంత లేక -సస్పెన్సు .అనుకోని మలుపులు .విశేషమైన మనస్తత్వాల చిత్రీకరణ.బిగువైన కథా గమనం
నేరము,హింస,ప్రధానమైనా అతిగా రక్తపాతం ,హింసా దృశ్యాలు ఉండవు.చాలా చిత్రాలలో
అమాయకుడైన వ్యక్తీ చిక్కుల్లో పడి పోలీసుల చేత ,విలన్ల చేత తరమబడుతూ తప్పించుకొనడం
ప్రదానామ్సంగా ఉంటుంది.ఆయన చిత్రాలు చాలా ఆస్కార్ అవార్డులకు ప్రతిపాదించగా ,కొన్ని
అవార్డులుఅందుకొన్నాయి.అతనిని ఎందఱో అనుకరించి చిత్రాలు నిర్మించారు.మాస్టర్ ఆఫ్
సస్పెన్స్ గా ప్రశంసలుఅందుకొన్నాడు.తన చిత్రాలలో చిన్న పాత్రలో (కేమియోరోల్) కనిపించడం
ఆయనకు సరదా .ఆయన సినిమాల గురించి ఇంకా వచ్చే సారి రాస్తాను.అందాకా సెలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి