ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి మరికొంత ;==ఆయన మాటలు ;=౧.ఒక ఫిలింనిడివి మనిషి మూత్రాశయం సహనాన్ని
మించకూడదు.౨.తన జీవితాశయం ప్రేక్షకుల్ని బాగా భయపెట్టడమే ౩.నిస్సారమైన ,స్తబ్ధమైన సమయాలని
తీసివేసిన జీవితమే నాటకం (డ్రామా) ౪.ఉత్కంతకు (సస్పెన్సు)ఉదాహరణ -- ఒక గదిలో బాంబుపేలడం
ఆశ్చర్యం. అది పేలుతుందని ప్రేక్షకులకు తెలిసి ,హీరోకి తెలియక పోవడం సస్పెన్సు.
ఒకసారి హిచ్కాక్ పై అంతస్తునుండి లిఫ్ట్లోఓ మిత్రులతో దిగుతూ చిన్న సస్పెన్సు కథ కొంచెం చెప్పి కిందికి
దిగగానేపూర్తీ చెయ్యకుండా వెళ్ళిపోయాడట. రెండు ,మూడు రోజులదాకా ఆ మిత్రులు కథ పూర్తీ చెయ్యమని
ఒకటే ఫోన్లు ! మరొక సినిమాలో వాయిద్య కచేరి జరుగుతుంటుంది.అందులో సిమ్బాల్స్ (పెద్ద తాళాలు )
వాయిన్చినప్పుడే హంతకుడు వి ఐ పీని చంపాలి.ఈ దృశ్యం గొప్పగా ఉంటుంది.
సైకో చిత్రంలో షవరుబాతు లో ఉన్న స్త్రీని సైకో హత్యచేస్తాడు. ఈ సినిమా చూసేక కొందరు స్త్రీలు షవర్ లో
స్నానం చెయ్యడానికి భయపడే వారట .
హిచ్కాక్ సినిమాలు చాలా, ప్రసిద్ధి పొందిన నవలలు, నాటకాలు మీద ఆధారంగా తీసినవి.కొన్నిటిలో ఆఖరి
క్లైమాక్స్ ప్రసిద్ధ స్థలాల్లో తీసాడు.లండన్ లో బిగ్బెన్ ,న్యూయార్క్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.రాష్మోర్ పర్వతంలో
బ్రహ్మాండమైన విగ్రహాల దగ్గర తీసాడు.
ఈ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ మీద చాలా పుస్తకాలు ,వ్యాసాలూ ,కొన్ని వ్యతిరేక విమర్శలు,ఉన్నాయి.ఇంకా
లోతుగా ,వివరంగా తెలుసుకో దలచినవారు చదవవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి