ఎన్నాళ్ళగానో అనుకుంటున్నా, ఇటీవలే అలంపురం క్షేత్రాన్ని దర్శించే అవకాశం కలిగింది. ఇది మహబూబ్ నగర్ జిల్లా లో ఉంది. హైదరాబాద్ కి రమారమి ౨౦౦ కే.మీ. దూరం లోను, కర్నూల్ పట్టణానికి ౩౦ కి.మీ. దూరం లోను తుంగభద్రా నదీ తీరంలో ఉంది.
ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుంచి ప్రసిద్దమయినది అనడానికి ఏన్నో ఆధారాలు, అవశేషాలూ ఉన్నాయి. చారిత్రికముగా వరుసగా మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాదంబులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు ఈ ప్రాంతాని పరిపాలించినారు. తరువాత బహామబి సుల్తానులు, విజయనగర రాజుల మధ్య యుద్ధాలలో చేతులు మారి చివరగా అసఫ్ జహి (నిజాం ప్రభువులు) పరిపాలనలో వుంది, ౧౯౪౮ లో స్వతంత్ర భారత దేశం లో లీన మయింది.
కృష్ణా-తుంగభద్రా ల మధ్య సారవంతమైన ప్రదేశం (doab) కాబట్టి, ఈ ప్రదేశం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. అలంపురం లోనే గాక దగ్గరగా ఇతర ప్రదేశాల్లో కూడా చారిత్రిక అవశేషాలెన్నో ఉన్నాయి.
చారిత్రికముగా ఈ దేవాలయాలు ౮ నుండి ౧౦ శతాబ్దాల వరకు పాలించిన బాదామి చాలుక్య్ల పరిపాలన లో వేర్వేరు కాలములో నిర్మింపబడ్డాయి. కొన్ని దేవాలయాలు బాగానే వున్నా కొన్ని శిధిలావస్థలో వున్నాయి. ఇక్కడ రాష్ట్ర కూటుల కాలములో మహా ద్వారం నిర్మించబడింది. ఈ మహాద్వారం ద్వారా ప్రవేశించి వరుసగా ఈ ఆలయాలని సందర్శించాలి. అన్నిటిలోకి బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ప్రముఖ మైనది. దీనికి ప్రదక్షిణ పథము, మంటపము, గోపురం (విమానం) తో కూడిన గర్భాలయం వున్నాయి. గణపతి, దుర్గ దేవి, నరసింహ స్వామీ, ద్వారా పాలకుల విగ్రహాలలో శిల్పకారుల ప్రతిభ చూడదగినది.
శివాలయాలు గాక ప్రాచీన చాళుక్య యుగంలోనే కట్టబడిన యోగ నరసింహ సుర్యనారాయాన్ మూర్తుల దేవాలయాలు కూడా వున్నాయి. నార సిమ్హుని గుడి దగ్గరే ఏత్తైన ఆంజనేయ విగ్రహం వున్నది. ఇంకా రంగనాయకులు, ఆళ్వారులు, దిక్పాలకులు, గుతమ బుద్ధుడు, సప్త మాతృకలు, పరశు రాముడు మొదలైన విగ్రహాలు అందముగా గుడుల స్తంభాల పైన, గోడల పైన, పై కప్పుల పైన చెక్కబడినవి. కొన్ని శిల్పాలు, కట్టడాలు, విజయ నగర రాజుల కాలం (౧౪ - ౧౬ శతాబ్దాలు) నాటివని తెలుస్తున్నది. ఇంకా ఏన్నో శాసనాలను కూడా చూడ వచ్చును. వాటిని పండితులు పరిష్కరించి ప్రకటించి వున్నారు.
ఏక్కువ మంది సందర్హ్స్కులు ఇక్కడే ఉన్న ప్రసిద్ధ మైన జోగులాంబ దేవాలయానికి పూజలు చేయడానికి వస్తుంటారు. ఈ అమ్మ వారి గుడి అష్టా దశ శక్తీ పీఠాల లో ఒకటి గా ప్రసిద్ధి చెందినది. ఈ గుడి ని తురుష్కులు ధ్వంసం చేయగా, పూజారులు మూల విగ్రహాన్ని మాత్రం కాపాడి మరొక చోటికి తరలించారుట. మిగిలిన దేవాలాయ్లుకూడా అన్నీ ధ్వంసం అయ్యేవే కాని, ఆలోగా విజయ నగర చక్రవర్తి రెండవ హరిహర రాయల కుమారుడు మొదటి దేవరాయలు సైన్యంతో వెళ్లి తురుష్కులను తరిమివేసి వాటిని కాపాడుడు. ధ్వంసమైన దేవాలయం వుండిన ప్రదేశం లోనే ఇటీవలే క్రొత్త దేవాలయాన్ని పూర్వ శిల్ప నిర్మాణ పద్ధతిలో అదే విధముగా మళ్ళీ నిర్మించి, పాత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిష్టించారు. అందువల్ల ఈ దేవాలయం కొత్తగా, ఎర్ర ఇసుక రాయి నిర్మాణంలో మెరుస్తూ అందముగా కనిపిస్తుంది. చుట్టూ తొలినాటి వలెనే ఒక కందకాన్ని కూడా నిర్మించారు. ఈ గుడి స్తంభాల పైన అష్టా దశ శక్తులలో మిగిలిన ౧౭ శక్తుల రూపాలు, వాటి పేర్లతో సహా చెక్కబడి వున్నవి.
ఇక్కడ ఒక చిన్న ముసెఉం కూడా వున్నది కాని, మేము వెళ్ళే సరికి అది మూయబడి వున్నది. అందువల్ల అందులో భద్రపరచిన వాటిని చూడటానికి వీలు లేక పోయింది.
కూడలి సంగమేశ్వరాలయం:
శ్రీ శైలం ప్రాజెక్ట్ ముంపునకు గురి కాకుండా అక్కడి కూడలి సంగామేస్వరాలయాన్ని విడగొట్టి మళ్ళీ యధాతథంగా అలంపురం ఊరికి ముందు, కర్నూల్ కి వెళ్ళే రోడ్ పక్కన మళ్ళీ నిర్మించారు. పురాతత్వ శాఖ వారిని ఈ engineering ఫెఅట్ కి అభినందించాలి. ఈ గుడి గోడలపైన చుట్టూ అపూర్వమైన దేవతా విగ్రహాలు, ఇతర శిల్ప సంపద వున్నాయి. ఇది కూడా చాళుక్య శిల్ప సాంప్రదాయ పధ్ధతి లోనే నిర్మించబడినది. ఇక్కడ నేను చూసిన దేవాలయాలలో అన్నిటికన్నా బాగా నచ్చినది కూడలి సంగమేశ్వర స్వామీ దేవాలయమే.
అలంపురం క్షేత్రం నవ బ్రహ్మ ఆలయాలకి ప్రసిద్ధి. వరుసగా వీటి పేర్లు బాల బ్రహ్మ, కుమారా బ్రహ్మ, అర్క బ్రహ్మ వీర బ్రహ్మ, విశ్వా బర్హమ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ. ఇవన్నీ బ్రహ్మ ప్రతిశ్తితాలు అని స్థల పురాణం. కాని ఇవన్నీ శివాలయాలే కాని బ్రహ్మ దేవుడి ఆలయాలు కావు. అయితే, ఇతర దేవాలయాల కన్నా ఇక్కడ బ్రహ్మ దేవుడి శిల్పాలు ఏక్కువగా కనబడతాయి.
చారిత్రికముగా ఈ దేవాలయాలు ౮ నుండి ౧౦ శతాబ్దాల వరకు పాలించిన బాదామి చాలుక్య్ల పరిపాలన లో వేర్వేరు కాలములో నిర్మింపబడ్డాయి. కొన్ని దేవాలయాలు బాగానే వున్నా కొన్ని శిధిలావస్థలో వున్నాయి. ఇక్కడ రాష్ట్ర కూటుల కాలములో మహా ద్వారం నిర్మించబడింది. ఈ మహాద్వారం ద్వారా ప్రవేశించి వరుసగా ఈ ఆలయాలని సందర్శించాలి. అన్నిటిలోకి బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ప్రముఖ మైనది. దీనికి ప్రదక్షిణ పథము, మంటపము, గోపురం (విమానం) తో కూడిన గర్భాలయం వున్నాయి. గణపతి, దుర్గ దేవి, నరసింహ స్వామీ, ద్వారా పాలకుల విగ్రహాలలో శిల్పకారుల ప్రతిభ చూడదగినది.
విశేషం ఏవిటంటే కొన్ని విగ్రహాల క్రింద వాటిని చెక్కిన శిల్పుల పేర్లు కూడా చేక్కబదివున్నవి. దేవాలయాలు చాళుక్య శిల్ప రీతిలో నిర్మించాబ్దడినది. ప్రతి ఆలయం మీద అష్ట దిక్పాలకులు, గాంధర్వ కిన్నేరుల మూర్తులు మనోహరముగా చెక్కబడినది.
శివాలయాలు గాక ప్రాచీన చాళుక్య యుగంలోనే కట్టబడిన యోగ నరసింహ సుర్యనారాయాన్ మూర్తుల దేవాలయాలు కూడా వున్నాయి. నార సిమ్హుని గుడి దగ్గరే ఏత్తైన ఆంజనేయ విగ్రహం వున్నది. ఇంకా రంగనాయకులు, ఆళ్వారులు, దిక్పాలకులు, గుతమ బుద్ధుడు, సప్త మాతృకలు, పరశు రాముడు మొదలైన విగ్రహాలు అందముగా గుడుల స్తంభాల పైన, గోడల పైన, పై కప్పుల పైన చెక్కబడినవి. కొన్ని శిల్పాలు, కట్టడాలు, విజయ నగర రాజుల కాలం (౧౪ - ౧౬ శతాబ్దాలు) నాటివని తెలుస్తున్నది. ఇంకా ఏన్నో శాసనాలను కూడా చూడ వచ్చును. వాటిని పండితులు పరిష్కరించి ప్రకటించి వున్నారు.
ఏక్కువ మంది సందర్హ్స్కులు ఇక్కడే ఉన్న ప్రసిద్ధ మైన జోగులాంబ దేవాలయానికి పూజలు చేయడానికి వస్తుంటారు. ఈ అమ్మ వారి గుడి అష్టా దశ శక్తీ పీఠాల లో ఒకటి గా ప్రసిద్ధి చెందినది. ఈ గుడి ని తురుష్కులు ధ్వంసం చేయగా, పూజారులు మూల విగ్రహాన్ని మాత్రం కాపాడి మరొక చోటికి తరలించారుట. మిగిలిన దేవాలాయ్లుకూడా అన్నీ ధ్వంసం అయ్యేవే కాని, ఆలోగా విజయ నగర చక్రవర్తి రెండవ హరిహర రాయల కుమారుడు మొదటి దేవరాయలు సైన్యంతో వెళ్లి తురుష్కులను తరిమివేసి వాటిని కాపాడుడు. ధ్వంసమైన దేవాలయం వుండిన ప్రదేశం లోనే ఇటీవలే క్రొత్త దేవాలయాన్ని పూర్వ శిల్ప నిర్మాణ పద్ధతిలో అదే విధముగా మళ్ళీ నిర్మించి, పాత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిష్టించారు. అందువల్ల ఈ దేవాలయం కొత్తగా, ఎర్ర ఇసుక రాయి నిర్మాణంలో మెరుస్తూ అందముగా కనిపిస్తుంది. చుట్టూ తొలినాటి వలెనే ఒక కందకాన్ని కూడా నిర్మించారు. ఈ గుడి స్తంభాల పైన అష్టా దశ శక్తులలో మిగిలిన ౧౭ శక్తుల రూపాలు, వాటి పేర్లతో సహా చెక్కబడి వున్నవి.
అప్పటి యుద్ధంలో చనిపోయిన శః అలిసమది (దర్గా) కూడా ఈ సముదాయంలో వుంది. దర్గా లో ప్రతి సంవత్సరం ఉరుసు (ఉత్సవం) జరుగుతుందట.
క్రీ. శ. ౧౫౨౧ లో శ్రీ కృష్ణ దేవ రాయలు రాయలు రైచు యుద్ధం లో గెలిచిన తరువాత ఇక్కడకు వచ్చి నరసింహ స్వామికి, బాల బ్రహ్మేశ్వర స్వామి కి కొన్ని దానాలు ఇచ్చినట్లు శాసనాలు తెలుపుతున్నవి. shanmaathallo aedo oka devatha మూర్తికే నిర్మించిన దేవాలయాలు చాల చోటల్ వుంటాయి. ఇక్కడ మాత్రం శంమాతల దేవాలయాలు (శైవ, వైష్ణవ, శాక్తేయ, గానపత్య, స్కాంద) వుండ్డ్డం ఈ క్షేతం యొక్క ప్రత్యేకత. మరో విశేసహం ఏమిటంటే, కేవలం దేవాలయాలు మాత్రమే కాకుండా ఈ స్థలంలో శైవ విద్యా పీతములు కూడా ఉండేవని, విద్యా నిలయంగా ప్రసిద్ధి పొందిందని తెలుస్తున్నది.
ఇక్కడ ఒక చిన్న ముసెఉం కూడా వున్నది కాని, మేము వెళ్ళే సరికి అది మూయబడి వున్నది. అందువల్ల అందులో భద్రపరచిన వాటిని చూడటానికి వీలు లేక పోయింది.
కూడలి సంగమేశ్వరాలయం:
శ్రీ శైలం ప్రాజెక్ట్ ముంపునకు గురి కాకుండా అక్కడి కూడలి సంగామేస్వరాలయాన్ని విడగొట్టి మళ్ళీ యధాతథంగా అలంపురం ఊరికి ముందు, కర్నూల్ కి వెళ్ళే రోడ్ పక్కన మళ్ళీ నిర్మించారు. పురాతత్వ శాఖ వారిని ఈ engineering ఫెఅట్ కి అభినందించాలి. ఈ గుడి గోడలపైన చుట్టూ అపూర్వమైన దేవతా విగ్రహాలు, ఇతర శిల్ప సంపద వున్నాయి. ఇది కూడా చాళుక్య శిల్ప సాంప్రదాయ పధ్ధతి లోనే నిర్మించబడినది. ఇక్కడ నేను చూసిన దేవాలయాలలో అన్నిటికన్నా బాగా నచ్చినది కూడలి సంగమేశ్వర స్వామీ దేవాలయమే.
కర్నూల్, హైదరాబాద్ లనుండి వెళ్ళి చూడటానికి రవాణా సౌకర్యం వున్నా, ఎంతమంది ఈ క్షేత్రాని దర్శించి ఉంటారో తెలియదు. యాత్రికులకు, పర్యాటకులకు అంత బాగా ప్రాచుర్యం చెందలేదని అనిపిస్తుంది.
నేను గమనించిన కొన్ని విషయాలు, అభివృద్ధి కి సూచనలు పొందు పరుస్తున్నాను:
౧) చాల శిల్పాలు విరిగినవి చెల్లా చెదురుగా పది వున్నాయి. ప్రదశానశాల (museum) ఇంకా పెద్దది కట్టి అందులో ఈ శిలపాలన్నిటిని భాద్రపరచ వలసి వుంది.
౨) guide (మార్గదర్శి) సుకర్యం లేదు. ఇక్కడి విశేషాలు అన్నీ వివరించగల తర్ఫీదు పొందిన guides అవసరం వుంది.
౩) ఇంకా ప్రాచుర్యం (పుబ్లిసిటీ) జరగవలసి వుంది. చాల మందికి ఈ క్షేత్రం గురించి తెలియదేమో అని అనిపిస్తుంది.
౪) ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి shelters నిర్మంచవలసి వుంది.
౫) మంచి hotel ఒక్కటి కూడా లేదు. సందర్శకుల సౌకర్యార్థం పరిశుద్ధమైన మంచి canteens , కులాయిలు, toilets ఏర్పాటు చయవలసి వుంది.
౬) చుటూ నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు (లవ్న్స్) పెంచితే బాగుంటుంది.
ఈ క్షేత్రాని ఇంకా ఆకర్షణీయంగా చేయడానికి, పురా వస్తు శాఖ, దేవాదాయ శాఖ,, private సంస్థలు, పర్యాటక సంస్థలు కలసి కృషి చేస్తాయని ఆశిద్దాం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి