31, మే 2011, మంగళవారం

another poem

అపుడే మిహిరాంసుకము దాల్చి ,యవనతముఖి 
యగు లతాంగి బోల్ ససిబింబ మస్తమించే
ఎర్రనైన చీకటు లావరించే దిసల 
నెలత వ్రీడా కపోలారునిమము వోలె 
  ----------------------------------
అచ్చు తప్పులు తప్పలేదు.మన్నించాలి. 



టెలి ఫోన్ ... గల్పిక - 5


గల్పిక-5
---------  టెలిఫోన్
           ---------  అలెక్జాండర్ గ్రహాం బెల్ టెలిఫొన్ కనిపెట్టింది దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు సులభంగా మాట్లాడుకొడానికి .కాని ఆ టెలిఫొన్ యంత్రాంగం శాఖోప శాఖలుగావిస్తరించి  ఈనాడు పరిస్థితి ఎలా ఉందో ఊహించుకొండి. గ్రహాంబెల్ టెలిఫొన్ కనిపెట్టినప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు జరిగాయని ఊహించుకొండి. బెల్ పక్క గది లోకి వెళ్ళి అక్కడ పొరబాటున ఒంటిమీద యాసిడ్ వొలకగా ఆనొప్పితో ఇలా ఫొన్లో అంటాడు  "వాట్సన్,ఇలా రా ఒకసారి నీతో మాట్లాడాలి." వాట్సన్ నుంచి జవాబు బదులు ఒక మెషీన్ బదులు చెప్తుంది."మీకు కావలసిన డాక్టర్ పేరు తెలిస్తే నం.1 నొక్కండి.తెలియకపోతే నం.2 నొక్కుతే రిజిస్టర్ చేస్తారు.అండమాన్ దీవుల యాత్రకు వెళ్ళాలంటే నం.3 నొక్కండి.అత్యవసరమైన పరిస్థితి ఐతే మీ సోషల్ సెక్యూరిటీ నంబరు,మెడికల్ ఇన్స్యూరెన్స్ నంబరు కొట్టి ,తర్వాత నం.4 నొక్కండి.డాక్టర్ వాట్సన్ గారి తోనే మాట్లాడాలనుకొంటే మ్యూజిక్ సింఫనీ పూర్తయే దాకా ఆగి నం.5 నొక్కండి "
  ఆన్సరింగ్ మెషీన్ చెప్పినట్లు గ్రహాంబెల్ 5 నొక్కుతాడు.కాని జవాబురాదు.కనెక్షన్  తెగిపోతుంది. చివరకు  వాట్సన్ ఆ గదిలోకి ఏదో పని మీద వస్తాడు.గ్రహాంబెల్గారు అతనితో అంటాడు." ఇందాక యాసిడ్ పడినప్పుడు నిన్నుపిలుద్దామని ఫొన్ చేసినప్పుడు నంబర్  1 నొక్కడం  మరిచిపోయాను "
        ( ఆర్ట్ బుఖ్వాల్డ్ "బెల్ ఆన్ ది టెలిఫొన్ " ని అనుసరించి ) రమణారావు.ముద్దు   

30, మే 2011, సోమవారం

another poem

సెలవు
=====     నేను వీడిపోవునంతలోన =నెన్నిటికో ధన్యవాదములు 
                 స్వస్థాతకీ ,సౌర రస్మికీ సౌఖ్యానికి =చైతన్యానికి ,చల్లని గాలికి ,సౌరభానికి 
                 జీవానికి ,జీవితమాధుర్యానికి=జీవితపు వెతలకు ,ధన్యవాదములు 
                 సమరసభావానికి ,సంక్షోభానికి =స్పందనలకి ,స్నేహాలకి ,
                 అపరిచితులకు ,ఆదరించినవారికి =తీపి పల్కులకూ,తీవ్రభాషనలకు 
                 సంధ్యారుణ చిత్రరచనలకు ,=చంద్ర చారు శీతల సంస్పర్సకి
                      అన్నిటికీ ,ఎన్నటికీ ధన్యవాదాలు .--రమణారావు ---

సెసిల్.బి.డి.మిల్ గురించి మరి కొంత సమాచారం ...

vvసెసిల్.బి.డి.మిల్ -గురించి తెలుగు రత్న గారి బ్లాగు లొ కొంచెం రాశారు.దాని మీద నెను చిన్న కామెంట్ రాసాను.కాని తృప్తి కరంగాలేదు.ఒక తప్పు కూడా దొర్లింది.బెణర్ చిత్రం అతదు తీయలెదు
 డిమిల్ గురించి క్లుప్తంగా ;= హాలీవుడ్ స్థాపకుల్లొ ఒకనిగా పరిగణిస్తారు.జననం; 1881మరణం 1959
సినిమా నిర్మాత ,దర్శకుడు ,రచయిత .కొన్నిటిలో నటించ్ హాడు కూడా .మొదట్లో నాటకాలలో  పాల్గొనేవాడు.తరవాతనిశ్శబ్దచిత్రాలు(సైలంట్)చాలా తీసాడు.అందులో కొన్ని టాకీలు గా మళ్ళీ తీసాడు.అతడి చిత్రాలు చాలా ఖర్చు పెట్టి భారీగా తీసేవాడు. అందుకు.తగిన కథలను.దృశ్యాలను ఎంచుకొనేవాడు.అగ్ర తరాగణంతో ,గొప్ప సెట్టింగులతో ,ప్రొడక్షన్ వాల్యూస్తో తీసేవాడు. మనలో చాలామంది చూసివుండే చిత్రాలను మాత్రం పేర్కొంటాను.
  1.శాంసన్ అండ్ దెలీలా ==బైబిల్ లోని కథ .విక్టర్మెచుర్ ,హెడీ లామార్ శాంసన్.దెలీలాలుగా నటించారు.భీమబలుడైన శాంసన్ పాగన్ దేవాలయాన్ని కేవలం తన భుజబలం తోనే పడగొట్టడం గొప్పగా చిత్రీకరించాడు.(1949)
 2. (1952) గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్థ్ ==సర్కస్ దృస్యాలు బాగా చిత్రీకరించాడు.
3.టెన్ కమాండ్మెంట్స్ ; ( 1956 ) బైబిల్ లో ప్రవక్త మోజెస్ కథ.ఈజిప్టునుండి పారిపొతున్న యూదులకు ఎర్రసముద్రం  విడిపోయి దారి ఇచ్చే దృశ్యం గొప్పగా ఉంటుంది.అప్పటికన్నా టెక్నాలజీ ,కంప్యుటర్ గ్రాఫిక్స్ బాగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఆశ్చర్యం గా ఉంటాయి.ఈ సినిమాలో చార్ల్స్తన్ హెస్టన్ మోజెస్గా ,యూల్ బ్రిన్నర్ ఫారోగా అద్భుతంగా నటించారు.
  కాని సీరియస్ విమర్శకులు ఈయన సినిమాలని అంతగా మెచ్చుకొలేదు.ఆర్థికంగా విజయం సాధించాయి.ప్రజలు బాగా ఆదరించారు..
  సన్సెట్ బౌల్వార్ద్ అనె సినిమా బాలీవుడ్ చిత్రసీమ మీద వ్యంగ్యంగాతీసిన చిత్రం. ఇందులో దిమిల్ నటించాడు .
  సెసిల్ .బి. డిమిల్ పేరున నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన జీవితకాలపు అవార్డ్ 2011లో ప్రసిద్ధ నటుడు రాబర్ట్ డీ నీరో అందుకొన్నాడు.
మరొక్క సంగతి.ఎలిజబెత్ టైలర్ నటించిన క్లియో పాత్రా చాలామందిచూసే ఉంటారు.ఆకథనే డీమిల్ 1934 లో నిర్మించాడు,

 

29, మే 2011, ఆదివారం

credit card

క్రెడిట్ కార్డ్ -గల్పిక ౪.
-------------(ఆర్ట్ బుఖ్ వాల్డ్ 'చార్జ్ మీ 'ని అనుసరించి )
 ఈ మధ్య భారత్ లక్ష్మి అనే పెద్ద బాంక్ తన ఖాతాదార్లకు ఆకర్షణీయమైన ,సదుపాయాలతో క్రెడిట్ కార్డులని 
ఇస్తున్నట్లు తెలిసింది.నన్ను కూడా  ఒకటి తీసుకోమన్నారు .కాని వాళ్ళు ఇతర కంపెనీలకి మన వివరాలు 
అమ్ముతున్నట్లు చూచాయగా తెలిసింది.మన విషయాలు గోప్యంగా ఉండాలికదా. ఈ వ్యవహారాన్ని తలుచుకొంటే 
 ఒక దృశ్యం కనబడింది.దానిని మీ ముందు ఉంచుతున్నాను.కుటిల డిపార్ట్మెంట్ స్టోర్ వారు ,భారత లక్ష్మి బాంక్
 వారితో మాట్లాడే ఘట్టంగా ఊహించుకోండి.
 కు,డి.=హలో భారతలక్ష్మీ కుటిల నుంచి మాట్లాడుతున్నాను.పుల్లారావు గురించి మీకు తెలిసిన సమాచారం 
 కాస్త మాకు చెప్తారా .అఫ్కోర్సు ఫార్మాలిటీస్ మామూలే
.భా.ల.=ఒక నిముషం ఉండండి. డేటా చూసి  చెప్తాను.====ఆ .అతను చవకరకం జోళ్ళు కొంటాడు. 
 కు.డి.=అంకున్నాం .ఇంకా ఏమైనా ?
 భా.ల. =జింక శేవింగు క్రీము ,నీము టూత్ పేస్టుని కొంటాడు.దియోడరెంటుని,అరుదుగా కొంటాడు.పొదుపు
 మనిషి అనుకొంటాము. 
 "అతని ప్రేమ వ్యవహారాలూ సంగతి ఏమైనా చెప్పగలరా ?
 "డజను వాలెంటైను కార్డులు కొంటాడు.కొంచం గ్రంథ సాన్గుడు లాగే ఉన్నాడు.
 "మరి స్పోర్ట్సు సంగతి ?
 "చెప్పుకోదగినదేమీ లేదుఎప్పుడో .రెండు టెన్నిస్ బంతులు కొంటాడు."
 "అన్నట్టు అతని భోజనం ,అభిరుచుల సంగతి చెప్పండి "
 సుష్టుగానే నాన్వెజ్ తింటాడు.ఒక్కడే తింటాడు.ఎప్పడూ పార్టీలు ఇచ్చినట్లు లేదుపేమెంట్ క్రెడిట్ కార్డు తోనే 
.చేస్తాడు."
 కు.డి."చివరిగా ,అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది ?"
 భా.ల."అతను కొంచం స్థూల కాయుడు.కొంచం చెవుడు, డయాబిటీస్ ఉన్నట్లున్నాయి.వారం వారం రెండు 
 మూడు వందల మందులు కొంటూ ఉంటాడు. "
 కు.డి ."అయితే ఇంకేం .మాకు సరిపోయిన మనిషే.కాస్త అతని అన్లిస్తేడ్ఫోన్ నంబర్ ఇవ్వండి.మా ఫోన్ 
 డిపార్ట్మెంట్ కి ఇస్తాం .అతని వెంట పడతారు. చాలా థాంక్స్ . 

another poem

నా మరొక గేయం.
                             ప్రక్రుతి 
                          ------------
   సుమ సౌరభముల ,భ్రమర నాదమ్ముల 
   సాగినది వాసంత సాంధ్యసమీరమ్ము 
   గ్రీష్మ తాపోదగ్ర కీలావ్రుతములగుచు 
  వేసవి గాలులు విసరె  ధూళి 
  జలగర్భినుల  మోసి సలిల ధారల గురిసి 
  వరదానమిచ్చేను వానగాలి 
   హిమబిందువులు రాలి చేమంతి దండల
   చలిచిరుగాలుల పొలిచె సీతువున 
         ----------------------------

28, మే 2011, శనివారం


నా కొత్త గేయం.
-----------------
ఇచట పూసిన విరులు -ఏ చాన జడ మెరియునో
ఈ కొమ్మ కూయు కోయిల -ఏ తరువు దరి జేరునో
ఈ కోనలో పారు సెలయేరు-ఏ సీమలన్ ప్రవహించునో
ఈ నింగి లో తేలు ఆమొయిలు -ఎటు పయనించి వర్షించునో
ఈ సోగకనుల కన్నియ - ఏ పురుష పుంగవుని వరియించునో
ఇచట జన్మించిన మానవుడు -ఏ దేశములకేగునో
      ఏ జీవనము  సాగించునొ
       ఎట తుది శ్వాస విడుచునో
                                       ==రమణారావు .ముద్దు

27, మే 2011, శుక్రవారం

AlfredHitchcock--continued

ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి మరికొంత ;==ఆయన మాటలు ;=౧.ఒక ఫిలింనిడివి మనిషి మూత్రాశయం సహనాన్ని
మించకూడదు.౨.తన జీవితాశయం ప్రేక్షకుల్ని బాగా భయపెట్టడమే ౩.నిస్సారమైన ,స్తబ్ధమైన సమయాలని 
తీసివేసిన జీవితమే నాటకం (డ్రామా) ౪.ఉత్కంతకు (సస్పెన్సు)ఉదాహరణ -- ఒక   గదిలో బాంబుపేలడం 
ఆశ్చర్యం. అది పేలుతుందని ప్రేక్షకులకు తెలిసి ,హీరోకి తెలియక పోవడం సస్పెన్సు. 
ఒకసారి హిచ్కాక్ పై అంతస్తునుండి లిఫ్ట్లోఓ  మిత్రులతో దిగుతూ చిన్న సస్పెన్సు కథ కొంచెం చెప్పి కిందికి 
దిగగానేపూర్తీ చెయ్యకుండా వెళ్ళిపోయాడట. రెండు ,మూడు రోజులదాకా ఆ మిత్రులు కథ పూర్తీ చెయ్యమని 
ఒకటే ఫోన్లు !    మరొక సినిమాలో  వాయిద్య కచేరి   జరుగుతుంటుంది.అందులో సిమ్బాల్స్ (పెద్ద తాళాలు )
 వాయిన్చినప్పుడే హంతకుడు వి ఐ పీని చంపాలి.ఈ దృశ్యం గొప్పగా ఉంటుంది.
  సైకో చిత్రంలో షవరుబాతు లో ఉన్న స్త్రీని సైకో హత్యచేస్తాడు. ఈ సినిమా  చూసేక కొందరు స్త్రీలు షవర్ లో 
 స్నానం చెయ్యడానికి భయపడే వారట .
హిచ్కాక్ సినిమాలు చాలా, ప్రసిద్ధి పొందిన నవలలు, నాటకాలు మీద ఆధారంగా తీసినవి.కొన్నిటిలో ఆఖరి 
క్లైమాక్స్ ప్రసిద్ధ స్థలాల్లో తీసాడు.లండన్ లో బిగ్బెన్ ,న్యూయార్క్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.రాష్మోర్ పర్వతంలో 
బ్రహ్మాండమైన విగ్రహాల దగ్గర తీసాడు.
ఈ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ మీద చాలా పుస్తకాలు ,వ్యాసాలూ ,కొన్ని వ్యతిరేక విమర్శలు,ఉన్నాయి.ఇంకా 
 లోతుగా ,వివరంగా తెలుసుకో దలచినవారు చదవవచ్చును.

26, మే 2011, గురువారం

AlfredHitchcock--continued

ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ;==౧౯.సైకో --అతని చిత్రాలలో అత్యంత ప్రజాదరణ పొందినది.కసి,కోపం,డబ్బు,ఆస్తి 
వంటి కారణాలేమీ లేకుండా హత్యలు చేసే మానసిక రోగి ప్రధానపాత్రగా తీసినది.తర్వాత సైకోవంటి 
చిత్రాలు చాలా వచ్చాయి.౧౯౬౦లొ నలుపు-తెలుపు లో ,తక్కువ బద్జెట్లో తీసిన మూవీ. ఇందులో 
నార్మంబెత్స్ అనే మానసికరోగి పాత్రధారి నటన విలక్షణంగా ఉంటుంది.
౨౦. బర్డ్స్-ఇది ఒక నవల ఆధారంగాతీసినది.పక్షుల గుంపులు మనుష్యుల్ని ఎటాక్ చెయ్యడం కథాంశం. (౧౯౬౩) 
    ౨౧.౧౯౬౬టార్న కర్టెన్ -పాల్న్యూమన్ ఇందులో హీరో .అమెరికా ,సోవియెట్ యూనియన్ల మధ్య ప్రచ్చన్నయుద్ధం 
 నేపధ్యంలో తీసిన థ్రిల్లర్ .
1౨౨.టోపాజ్ --లియాన్ యూరిస్ నవల ఆధారం.ఇది కూడా కోల్డ్ వార్ నేపధ్యంలో గూఢచర్యల కథ. ౧౯౬౦లొ 
 సైకో తర్వాత ఆయన తీసిన సినిమాలు అంతగా విజయవంతం కాలేదు.విమర్సలనిఎదుర్కొన్నాయి. 
తర్వాత లండన్ వెళ్లి ఫ్రెంజీ అనే చిత్రం నిర్మించాడు.యిది ఒక హత్యా రహస్యం.కవలపిల్లలలో ఒకడు హంతకుడు. 
ఈ సినిమా ౧౯౭౨ లో తీసాడు.౨౪.-౧౯౭౬ లో ఆఖరి సినిమా పేరు.ఫ్యామిలీప్లాట్ =ఒక మోసకారి మంత్రగత్తె 
లేక స్పిరిత్యులిస్ట్ గురించి తీసినది.ఆ తర్వాత టెలివిజన్ సీరీస్ ,హిచ్ కాక్ ప్రెసెంత్స్అని అనితీసాడు.
                          చివరిభాగం తర్వాత --సెలవు. 

25, మే 2011, బుధవారం


అల్ఫ్రెడ్ హిచ్కాక్ ;-రెయర్ విండొ==1954)జేంస్ స్టీవార్ట్,గ్రేస్ కెల్లీ నటించినది.కథ అంతా ఒక అపార్ట్మెంట్బిల్డింగ్లో జరుగుతుంది.హీరొ కాలు విరిగి మంచ్తెలుస్తుంది.హం పట్టి ఉంటాడు.ఊసుపొకకు ఎదురుగాఉన్న అపార్ట్ మెంట్లని చూస్తూఉంటాడు. ఒక భర్త తన భార్యని హత్యచేసి ,శవాన్ని మాయం చేసినట్లు అనుమానిస్తాడు. చివరికి అతని అనుమానం నిజమని తెలుస్తుంది.హంతకుడి ఇంటిలొకి హీరొయిన్ పరిశొధించడానికివెళ్ళుతుంది.ఈలొగా అతడు తిరిగివస్తాడు. ఈ సీను చాలా ఉత్కంఠ కలిగిస్తుంది.
14.టు కేచ్ అ థీఫ్ =1955-కేరీగ్రాంట్ ,గ్రేస్ కెల్లీ,నటించినది.
 15.ద మాన్ హూ న్యూ టూ మచ్ 1956 )హిచ్ కాక్ మొదటిలొ నిర్మించిన చిత్రానికిరీమేక్
  జేంస్ స్టీవార్ట్ ,డొరిస్ డే నటించినది. డొరిస్ డే పాడిన ' కేసెరా,సెరా' అనేపాట బాగా  పాపులరయింది.ఒక ప్రముఖుడిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ముఠా ఈ దంపతుల కొడుకుని ఎత్తుకుపొతుంది.కాన్సెర్ట్ జరుగుతున్నప్పుడు విఫలమైన హత్యాప్రయత్నం ఒక హై లైట్ .
 16.ద =రాంగ్మాన్ = 1957) నిజమైన సంఘటనమీద ఆధారపడిన చిత్రం.నిరపరాధి పై తప్పుగా నేరారోపణ చేయబడుతుంది.
 17.వెర్టిగో 1958=జేంస్స్టీవార్ట్ , కిమ్నొవాక్ నటించినది. క్లాసిక్గా పరిగణించ బడినది.హీరో పోలీసు ఆఫీసరు ఎత్తయిన చోటులు అంటె భయం.( అచ్రోఫోబియా ) తాను పరిశోధిస్తున్న స్త్రీవ్యామోహంలొ పడి చివరలోభయాన్ని జయిస్తాడు.కానీఅస్త్రీ ఎత్తు గా ఉన్న చర్చి మీదనుంచికిందికి పడి మరణిస్తుంది.   .
 18.నార్త్ బై నార్త్ వెస్ట్ = 1959 = కేరీ గ్రాంట్ హీరో -పొరబాటున ప్రభుత్వ రహస్య గూఢచారి అనుకొని విలన్లు వెంటబడతారు.హెలికాప్టర్తొ వెంటపడిన శత్రువులనుండి హీరో తప్పించుకోడం అప్పట్ల్ ఒక ,
 ప్ప్రత్యేక ఆకర్షణ. (మిగిలినది మరొకసారి.  

24, మే 2011, మంగళవారం

AlfredHitchcock--continued

ఆల్ఫ్రెడ్హిచ్ కాక్; 
బ్రిటన్లో తీసిన టాకీలు:
 ౧.లాద్జర్ (హత్యారహస్యం కథ )
౨.బ్లాక్మెయిల్ 
౩.మాన్ హూ న్యూ టూమచ్
 ౪.39Steps  (ఒక నవల ఆధారంగా తీసిన అపరాధ పరిశోధక కథ )౫.లేడీ వానిషేస్  (ట్రైన్లోఒక స్త్రీ అదృశ్యం ,పరిశోధన గురించి ౧౯౪౦లొ అమెరికా వెళ్లి హాలీవుడ్లో చాలా సినిమాలు తీసాడు. అందులో నేను చూసినవీ ,ముఖ్యమైనవీ క్లుప్తంగా పరిచయం చేస్తాను.
౧.౧౯౪౦రెబెక్కా -డాఫ్నేదు మారియర్ అనే రచయిత్రి ప్రసిద్ధ నవల ఆధారం జమీందారుని పెళ్లి చేసుకొని కొత్తగా పెద్ద  హవేలీలో హీరొయిన్ కి కలిగిన విచిత్రమైన అనుభవాల గురించి .నవల లాగే బాగా పాపులర్ అయింది. 
౨.షాడో ఆఫ్ డౌట్. హిచ్ కాక్ కి తన చిత్రాల్లో బాగా ఇష్టమైనది. ౧౯౪౨లొ తీసినది 
౩.౧౯౪౨లొ సాబోటీర్,౧౯౪౩లొ ౪.లైఫ్బోటు. ఈ రెండూ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తీసినవి.
౫.స్పెల్బౌండ్ -౧౯౪౫-టాప్ స్టార్ గ్రిగారీపెక్ నటించినది. మతి మరుపు గురించి మనస్తత్వ విశ్లేషణ ప్రధానాంశం. ఇందులో ప్రసిద్ధ చిత్రకారుడు సాల్వడార్ దాలి చిత్రించిన స్వప్న దృశ్యాలు ఒక ప్రత్యేకత.
౬.నటోరియస్--౧౯౪౬=కెరీ గ్రాంట్, ఇంగ్రిడ్ బెర్గ్మన్ వంటిగొప్ప తారలు నటించినది. జర్మన్ నాజీలు యాటం బాంబు ని తయారు  చేయడానికి ప్రయత్నం చెయ్యడం  కథాంశం. పెద్ద బాక్సాఫీసు హిట్. 
౭.పారదిన్ కేసు -౧౯౪౭-కోర్టు లో నాటకీయ సంఘటనలు. ముఖ్యాంశం. 
 ౮. రోప్ =౧౯౪౮=టేక్నికలర్లో తీసినది. ఒకపెద్ద గదిలోనే కథ అంతా జరుగుతుంది. హత్యచేసి శవాన్ని ఆ గదిలోనే ఒక పెద్ద భోషాణంలో దాస్తారు. చివరకు రహస్యం తెలిసిపోతుంది. జేమ్స్ స్తీవార్ట్ నటించిన చిత్రం. విజయవంతమైనది. 
౯.౧౯౪౯ -అండర్ ద కేప్రికార్న్ కలర్లో ఆస్ట్రేలియా నేపధ్యంలో తీసినది.అంతగా పేరు గాంచ లేదు. 
౧౦.స్టేజ్ ఫ్రైట్-వార్నర్ బ్రదర్స్ వారితో కలిసి ఇంగ్లాండ్ నేపథ్యంతో తీసిన చిత్రం.  
౧౧.స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రైన్ప్ర. సిద్ధ డిటెక్టివ్ నవలా కారుడు రేమాండ్ శాండ్లర్ సంభాషణలు రాసాడు. చిత్రమైన కథ. ఇద్దరు అపరిచితులు రైల్లో తమకు అడ్డుగా ఉన్నవారిని తమ మీద అనుమానం రాకుండా రెండో వ్యక్తీ తొలగించాలని ఒప్పందం చేసుకొంటారు. మొదటివాడు.రెండోవాడి ప్రేయసిని చంపేస్తాడు. రెండో వాడు మాత్రం మొదటి వాడి తండ్రిని చంపడానికి 
వెనుకంజ వేస్తాడు. బ్లాక్మెయిల్, సస్పెన్సుతో, మలుపు తిరుగుతుంది. హిచ్ కాక్ టచెస్ ఇందులో చూడవచ్చ్చును. 
౧౨.డయల్-యమ్ఫర్ మర్డర్ ౧౯౫౪ గ్రేస్కెల్లీనటించినది. భర్త, తన భార్యను చంపడానికి కిరాయి హంతకుణ్ణి పంపిస్తాడు. భార్య ఆత్మరక్షణలో వాడిని చంపుతుంది. హత్యానేరం తో ఆమె అరెస్తావుతుంది. చివరకు పోలీసు ఆఫీసరు నిజం తెలుసుకొని ఆమెను రక్షిస్తాడు. ఇది కూడా ఉత్కంతతోకూడిన విజయవంతమైన చిత్రం. ప్రఖ్య శ్రీరామ మూర్తిగారు ఈ నాటకాన్ని తెలుగులో రాసారు.చాల పాపులర్ అయింది. dial  M  for Murder


మిగిలిన చిత్రాల గురించి మరొక సారి తెలియ చేస్తాను. 
సెలవు. 
రమణారావు.ముద్దు 

23, మే 2011, సోమవారం

AlfredHitchcock

ఆల్ఫ్రెద్హిచ్కాక్  .=సుప్రసిద్ధ సినిమా డైరెక్టర్ =జననం బ్రిటన్లో ౧౮౯౯సమ్;
కొన్నాళ్ళు జర్నలిస్టుగా పనిచేసాడు.కొన్ని సైలెంటు సినిమాల తర్వాత టాకీలు నిర్మించాడు. 
౧౯౪౦లొ అమెరికా వెళ్లి వివిధ నిర్మాతల సహాయంతో చాలా సినిమాలకు దర్సకత్వం వహించాడు.
చివరిలో టెలివిజన్ కథల సీరియల్సు నిర్వహించాడు.౧౯౮౦లొ మరణించాడు.ఆయన ప్రత్యేకత ఏమిటిఅంటే ఉట్కంత లేక -సస్పెన్సు .అనుకోని మలుపులు .విశేషమైన మనస్తత్వాల చిత్రీకరణ.బిగువైన కథా గమనం 
నేరము,హింస,ప్రధానమైనా అతిగా రక్తపాతం ,హింసా దృశ్యాలు ఉండవు.చాలా చిత్రాలలో 
అమాయకుడైన వ్యక్తీ చిక్కుల్లో పడి పోలీసుల చేత ,విలన్ల చేత తరమబడుతూ తప్పించుకొనడం 
ప్రదానామ్సంగా ఉంటుంది.ఆయన చిత్రాలు చాలా ఆస్కార్ అవార్డులకు ప్రతిపాదించగా ,కొన్ని 
అవార్డులుఅందుకొన్నాయి.అతనిని ఎందఱో అనుకరించి  చిత్రాలు నిర్మించారు.మాస్టర్ ఆఫ్ 
సస్పెన్స్ గా ప్రశంసలుఅందుకొన్నాడు.తన చిత్రాలలో చిన్న పాత్రలో (కేమియోరోల్) కనిపించడం 
ఆయనకు సరదా .ఆయన సినిమాల గురించి ఇంకా వచ్చే సారి రాస్తాను.అందాకా సెలవు.

21, మే 2011, శనివారం

కథా మంజరి: అవునా ? అదన్న మాట సంగతి !

కథా మంజరి: అవునా ? అదన్న మాట సంగతి !: "మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసు కోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని చూడండి: ముందుగా మనం తరుచ..."

కథా మంజరి: అవునా ? అదన్న మాట సంగతి !

కథా మంజరి: అవునా ? అదన్న మాట సంగతి !: "మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసు కోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని చూడండి: ముందుగా మనం తరుచ..."

19, మే 2011, గురువారం

best movies in telugu

ఈమధ్య హిందూ లో ప్రతివారం ఇంగ్లీష్ సినిమాల్లో పది ఉత్తమ మైనవని వారివారి అభిప్రాయాల్ని చాలా క్లుప్తంగా 
రాస్తున్నారు. అలాగే మన తెలుగు సినిమాల్లో ఉత్తమమైనవాటినినా అభిప్రాయం ప్రకారం రాస్తున్నాను. దీనిపై తప్పక 
భిన్నాభిప్రాయాలు ఉంటాయి. లోకో భిన్నరుచి. ఐతే ఇంగ్లీష్ సినిమాలకి భారతీయ సినిమాలకీ ఒకే ప్రమాణాలు 
పాటించకూడదు.మన మూవీస్లో పాటలు, నృత్యాలు తప్పకవుంటాయి. వాటికి మార్జిన్ వదిలేయాలి. మంచి సంగీతం 
మన సినిమాలకి ఒక అలంకారం కూడా. మరొక సంగతి. ఇటీవలి చిత్రాలగురించి నాకు అవగాహన లేదు. గత ఇరవై 
సం/చిత్రాలగురించి యువతరంలో ఎవరైనా పూనుకొని రాస్తే సంతోషిస్తాను. అభిరుచులు వేరైనా అన్నికలలనీ  
బెరీజువేయ్యడానికి ప్రమాణాలు, కొలబద్దలు, ఉంటాయి. సినిమాలకు సంబంధించినంతవరకు అవి == (౧ బలమైన 
కథా, ఇతివ్రిత్తము. (౨) అనవసరమైన దృశ్యాలు, సంభాషణలు లేకుండా ఉండుట. (౩) వాస్తవికతను ప్రతిబింబించడం. (౪) ప్రతిభావన్తమైన నటన ౫ వీలైతే సందేశం అంతర్లీనంగా ఉండడం (౬) హాస్యం సున్నితంగా ఉండాలి. (౭) టెక్నికల్గా ఉన్నత ప్రమాణాలు ఉండాలి. (౮)మన సినిమాలకు సంగీతం మధురంగా ఉండాలి.అంతేకాక .సాంఘిక, పౌరాణిక  చారిత్రిక, హాస్య చిత్రాలను వేరే కేటగిరీల్లోచూడాలి. ఈ  సూత్రాలప్రకారం నా ఎన్నిక.====

సాంఘికం. ౧.దేవదాసు   (నాగేశ్వరరావు ,సావిత్రి. (౨) మూగ మనసులు  (౩) సాక్షి బాపు (౪) శంకరాభరణం (౫) సాగరసంగమం.  (౬) మాభూమి (౭) నిరేక్శణ (భానుచందర్ ,అర్చన ) (౮) మేఘ సందేశం (నాగేశ్వర రావు). 

హాస్యప్రదానచిత్రాలు: (౧) గుండమ్మ katha (౨) శ్రీవారికిప్రేమలేఖ 

పౌరాణికాలు. (౧) మాయాబజార్ (౨) నర్తనశాల (౩) లవకుశ  (౪) సీతాకల్యాణం. (బాపు)

చారిత్రకాలు, లేక ఆ నేపథ్యం కలవి: (౧) మల్లీశ్వరి (భానుమతి) (౨) పల్నాటి యుద్ధమ్ (కన్నాంబ)
(౩) యోగి వేమన (నాగయ్య) (౪) బొబ్బిలి యుద్ధం (౫).తెనాలిరామకృష్ణ  (౬) అన్నమయ్య 
                                                                                                                         
జానపదాలు: (౧) పాతాళభైరవి. (౨) భైరవద్వీపం.

__ రమణారావు.ముద్దు

18, మే 2011, బుధవారం

అలంపురం

ఎన్నాళ్ళగానో అనుకుంటున్నా, ఇటీవలే  అలంపురం క్షేత్రాన్ని దర్శించే అవకాశం కలిగింది. ఇది మహబూబ్ నగర్ జిల్లా లో ఉంది.  హైదరాబాద్ కి రమారమి ౨౦౦ కే.మీ. దూరం లోను, కర్నూల్ పట్టణానికి ౩౦ కి.మీ. దూరం లోను తుంగభద్రా నదీ తీరంలో ఉంది.

ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుంచి ప్రసిద్దమయినది అనడానికి ఏన్నో ఆధారాలు, అవశేషాలూ ఉన్నాయి. చారిత్రికముగా వరుసగా మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాదంబులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు ఈ ప్రాంతాని పరిపాలించినారు.  తరువాత బహామబి సుల్తానులు, విజయనగర రాజుల మధ్య యుద్ధాలలో చేతులు మారి చివరగా అసఫ్ జహి (నిజాం ప్రభువులు) పరిపాలనలో వుంది, ౧౯౪౮ లో స్వతంత్ర భారత దేశం లో లీన మయింది.

కృష్ణా-తుంగభద్రా ల మధ్య సారవంతమైన ప్రదేశం (doab) కాబట్టి, ఈ ప్రదేశం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. అలంపురం లోనే గాక దగ్గరగా ఇతర ప్రదేశాల్లో కూడా చారిత్రిక అవశేషాలెన్నో ఉన్నాయి.

అలంపురం క్షేత్రం నవ బ్రహ్మ ఆలయాలకి ప్రసిద్ధి.  వరుసగా వీటి పేర్లు బాల బ్రహ్మ, కుమారా బ్రహ్మ, అర్క బ్రహ్మ వీర బ్రహ్మ, విశ్వా బర్హమ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ.  ఇవన్నీ బ్రహ్మ ప్రతిశ్తితాలు అని స్థల పురాణం.  కాని ఇవన్నీ శివాలయాలే కాని బ్రహ్మ దేవుడి ఆలయాలు కావు. అయితే, ఇతర దేవాలయాల కన్నా ఇక్కడ బ్రహ్మ దేవుడి శిల్పాలు ఏక్కువగా కనబడతాయి.

చారిత్రికముగా ఈ దేవాలయాలు ౮ నుండి ౧౦ శతాబ్దాల వరకు పాలించిన బాదామి చాలుక్య్ల పరిపాలన లో వేర్వేరు కాలములో నిర్మింపబడ్డాయి.  కొన్ని దేవాలయాలు బాగానే వున్నా కొన్ని శిధిలావస్థలో వున్నాయి.  ఇక్కడ రాష్ట్ర కూటుల కాలములో మహా ద్వారం నిర్మించబడింది.  ఈ మహాద్వారం ద్వారా ప్రవేశించి వరుసగా ఈ ఆలయాలని సందర్శించాలి. అన్నిటిలోకి బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం  ప్రముఖ మైనది. దీనికి ప్రదక్షిణ పథము, మంటపము, గోపురం (విమానం) తో కూడిన గర్భాలయం వున్నాయి.  గణపతి, దుర్గ దేవి, నరసింహ స్వామీ, ద్వారా పాలకుల విగ్రహాలలో శిల్పకారుల ప్రతిభ చూడదగినది.

విశేషం ఏవిటంటే కొన్ని విగ్రహాల క్రింద వాటిని చెక్కిన శిల్పుల పేర్లు కూడా చేక్కబదివున్నవి.  దేవాలయాలు చాళుక్య శిల్ప రీతిలో నిర్మించాబ్దడినది.  ప్రతి ఆలయం మీద అష్ట దిక్పాలకులు, గాంధర్వ కిన్నేరుల మూర్తులు మనోహరముగా చెక్కబడినది.

శివాలయాలు గాక ప్రాచీన చాళుక్య యుగంలోనే కట్టబడిన యోగ నరసింహ సుర్యనారాయాన్ మూర్తుల దేవాలయాలు కూడా వున్నాయి.  నార సిమ్హుని గుడి దగ్గరే ఏత్తైన ఆంజనేయ విగ్రహం వున్నది.  ఇంకా రంగనాయకులు, ఆళ్వారులు, దిక్పాలకులు, గుతమ బుద్ధుడు, సప్త మాతృకలు, పరశు రాముడు మొదలైన విగ్రహాలు అందముగా గుడుల స్తంభాల పైన, గోడల పైన, పై కప్పుల పైన చెక్కబడినవి.  కొన్ని శిల్పాలు, కట్టడాలు, విజయ నగర రాజుల కాలం (౧౪ - ౧౬ శతాబ్దాలు) నాటివని తెలుస్తున్నది.  ఇంకా ఏన్నో శాసనాలను కూడా చూడ వచ్చును.  వాటిని పండితులు పరిష్కరించి ప్రకటించి వున్నారు.

ఏక్కువ మంది సందర్హ్స్కులు ఇక్కడే ఉన్న ప్రసిద్ధ మైన జోగులాంబ దేవాలయానికి పూజలు చేయడానికి వస్తుంటారు. ఈ అమ్మ వారి గుడి అష్టా దశ శక్తీ పీఠాల లో ఒకటి గా ప్రసిద్ధి చెందినది.  ఈ గుడి ని తురుష్కులు ధ్వంసం చేయగా, పూజారులు మూల విగ్రహాన్ని మాత్రం కాపాడి మరొక చోటికి తరలించారుట.  మిగిలిన దేవాలాయ్లుకూడా అన్నీ ధ్వంసం అయ్యేవే కాని, ఆలోగా విజయ నగర చక్రవర్తి రెండవ హరిహర రాయల కుమారుడు మొదటి దేవరాయలు సైన్యంతో వెళ్లి తురుష్కులను తరిమివేసి వాటిని కాపాడుడు. ధ్వంసమైన దేవాలయం వుండిన ప్రదేశం లోనే ఇటీవలే క్రొత్త దేవాలయాన్ని పూర్వ శిల్ప నిర్మాణ పద్ధతిలో అదే విధముగా మళ్ళీ నిర్మించి, పాత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిష్టించారు. అందువల్ల ఈ దేవాలయం కొత్తగా, ఎర్ర ఇసుక రాయి నిర్మాణంలో మెరుస్తూ అందముగా కనిపిస్తుంది. చుట్టూ తొలినాటి వలెనే ఒక కందకాన్ని కూడా నిర్మించారు. ఈ గుడి స్తంభాల పైన అష్టా  దశ శక్తులలో మిగిలిన ౧౭ శక్తుల రూపాలు, వాటి పేర్లతో సహా చెక్కబడి వున్నవి.

అప్పటి యుద్ధంలో చనిపోయిన శః అలిసమది (దర్గా) కూడా ఈ సముదాయంలో వుంది.  దర్గా లో ప్రతి సంవత్సరం ఉరుసు (ఉత్సవం) జరుగుతుందట. 

క్రీ. శ. ౧౫౨౧ లో శ్రీ కృష్ణ దేవ రాయలు రాయలు రైచు యుద్ధం లో గెలిచిన తరువాత ఇక్కడకు వచ్చి నరసింహ స్వామికి, బాల బ్రహ్మేశ్వర స్వామి కి కొన్ని దానాలు ఇచ్చినట్లు శాసనాలు తెలుపుతున్నవి. shanmaathallo aedo oka devatha మూర్తికే నిర్మించిన దేవాలయాలు చాల చోటల్ వుంటాయి. ఇక్కడ మాత్రం శంమాతల దేవాలయాలు (శైవ, వైష్ణవ, శాక్తేయ, గానపత్య, స్కాంద) వుండ్డ్డం ఈ క్షేతం యొక్క ప్రత్యేకత.  మరో విశేసహం ఏమిటంటే, కేవలం దేవాలయాలు మాత్రమే కాకుండా ఈ స్థలంలో శైవ విద్యా పీతములు  కూడా ఉండేవని, విద్యా నిలయంగా ప్రసిద్ధి పొందిందని తెలుస్తున్నది.

ఇక్కడ ఒక చిన్న ముసెఉం కూడా వున్నది కాని, మేము వెళ్ళే సరికి అది మూయబడి వున్నది.  అందువల్ల అందులో భద్రపరచిన వాటిని చూడటానికి వీలు లేక పోయింది.

కూడలి సంగమేశ్వరాలయం:
శ్రీ శైలం ప్రాజెక్ట్ ముంపునకు గురి కాకుండా అక్కడి కూడలి సంగామేస్వరాలయాన్ని విడగొట్టి మళ్ళీ యధాతథంగా అలంపురం ఊరికి ముందు, కర్నూల్ కి వెళ్ళే రోడ్ పక్కన మళ్ళీ నిర్మించారు. పురాతత్వ శాఖ వారిని ఈ engineering  ఫెఅట్ కి అభినందించాలి.  ఈ గుడి గోడలపైన చుట్టూ అపూర్వమైన దేవతా విగ్రహాలు, ఇతర శిల్ప సంపద వున్నాయి.  ఇది కూడా చాళుక్య శిల్ప సాంప్రదాయ పధ్ధతి లోనే నిర్మించబడినది. ఇక్కడ నేను చూసిన దేవాలయాలలో అన్నిటికన్నా బాగా నచ్చినది కూడలి సంగమేశ్వర స్వామీ దేవాలయమే.

కర్నూల్, హైదరాబాద్ లనుండి వెళ్ళి చూడటానికి రవాణా సౌకర్యం వున్నా, ఎంతమంది ఈ క్షేత్రాని దర్శించి ఉంటారో తెలియదు. యాత్రికులకు, పర్యాటకులకు అంత బాగా ప్రాచుర్యం చెందలేదని అనిపిస్తుంది.

నేను గమనించిన కొన్ని విషయాలు, అభివృద్ధి కి సూచనలు పొందు పరుస్తున్నాను:
౧) చాల శిల్పాలు విరిగినవి చెల్లా చెదురుగా పది వున్నాయి.  ప్రదశానశాల (museum)  ఇంకా పెద్దది కట్టి అందులో ఈ శిలపాలన్నిటిని భాద్రపరచ వలసి వుంది.
౨) guide (మార్గదర్శి) సుకర్యం లేదు.  ఇక్కడి విశేషాలు అన్నీ వివరించగల తర్ఫీదు పొందిన guides అవసరం వుంది.
౩) ఇంకా ప్రాచుర్యం (పుబ్లిసిటీ) జరగవలసి వుంది.  చాల మందికి ఈ క్షేత్రం గురించి తెలియదేమో అని అనిపిస్తుంది.
౪) ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి shelters నిర్మంచవలసి వుంది.
౫) మంచి hotel ఒక్కటి కూడా లేదు.  సందర్శకుల సౌకర్యార్థం పరిశుద్ధమైన మంచి canteens , కులాయిలు, toilets ఏర్పాటు చయవలసి వుంది.
౬) చుటూ నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు (లవ్న్స్) పెంచితే బాగుంటుంది.

ఈ క్షేత్రాని ఇంకా ఆకర్షణీయంగా చేయడానికి, పురా వస్తు శాఖ, దేవాదాయ శాఖ,, private సంస్థలు, పర్యాటక సంస్థలు కలసి కృషి చేస్తాయని ఆశిద్దాం.




















17, మే 2011, మంగళవారం

ప్రచురిత మయిన నా పుస్తకాలు




















16, మే 2011, సోమవారం

surendramuddu-twitters

I have seen your twitters.My reaction to them. 1.western countries were also maledominated till recently.(20th century).Women's liberation is taking place in Eastern countries.so,that factor will not obstruct their progress. 2.We cannot goback to age of bullock carts.that is impossible.But we can preserve carts drawn by bullocks 
and  horses for ossasional and ceremonial uses.3.Steel and cemant shares will goup due to change of  Govt.in Bengal, you said.yes,but Mamata govt.has to follow 
realistic policies and hard and honestly to lift Bengal from stagnation.==ramanarao.muddu      

surendramuddu-twitters

I have seen your twitters.My reaction to them. 1.western countries were also maledominated till recently.(20th century).Women's liberation is taking place in Eastern countries.so,that factor will not obstruct their progress. 2.We cannot goback to age of bullock carts.that is impossible.But we can preserve carts drawn by bullocks 
and  horses for ossasional and ceremonial uses.3.Steel and cemant shares will goup due to change of  Govt.in Bengal, you said.yes,but Mamata govt.has to follow 
realistic policies and hard and honestly to lift Bengal from stagnation.==ramanarao.muddu      

14, మే 2011, శనివారం

తెలుగులో మంచి సినిమాలు

ఈ మధ్య "హిందూ"లో ఉత్తమ ఇంగ్లీష్ మూవీస్ గురించిరా  స్తున్నారు. వారం వారం రాస్తున్నారు. అలాగే తెలుగులో ఉత్తమ చిత్రాల జాబితా రాయదల్చుకోన్నాను. మనచిత్రాలకిపాటలు, న్రిత్యాలు, ముఖ్యం .వాటిని ఇంగ్లిష్ సినిమాలతో పోల్చలేము.కేటగిరీల ప్రకారం పరిగణిస్తే బాగుంటుంది.
ఈ జాబితాతో తప్పక భిన్నాభిప్రాయాలు ఉంటాయి.కొంత ఏకాభిప్రాయం కూడా ఉండ వచ్చును. గత ఇరవై సం: లోని చిత్రాల గురించి నాకు 
అవగాహనలేదు.వాటిగురించి యువతరంలో ఎవరైనా రాస్తే బాగుంటుంది. 
౧.పౌరాణికం ==౧.మాయాబజార్  ౨.నర్తనశాల ౩.లవకుశ ౪.సీతాకల్యాణం (బాపు) 
చారిత్రకం =లేక చారిత్రకనేపధ్యం  కల చిత్రం. ==౧.మల్లీశ్వరి (భానుమతి)౨.పల్నాటి యుద్ధం (కన్నాంబ)౩.యోగివేమన (నాగయ్య )౪.
బొబ్బిలియుద్ధం౫. అమరశిల్పి జక్కన ౬.మహామంత్రి తిమ్మరుసు ౭.విప్రనారాయణ 
జానపదం.===౧.పాతాళభైరవి ౨.బాలనాగమ్మ 
(కాంచనమాల )౩.భైరవద్వీపం 
సాంఘికం ==౧.స్వర్గసీమ ౨.బంగారుపాప ౩.మూగమనసులు.౩.పునర్జన్మ ౪.సాక్షి ౫.శంకరాభరణం౬..సాగరసంగమం ౭.మాభూమి.౮నిరేక్శణ 
(భానుచందర్, అర్చన )౯.దేవదాసు.(నాగేశ్వరరావు. సావిత్రి )౧0.గోరింటాకు 
  హాస్యచిత్రాలు.===౧.మిస్సమ్మ ౨.గుండమ్మకథ ౩.శ్రీవారికి ప్రేమలేఖ        ---రమణారావు .ముద్దు    

11, మే 2011, బుధవారం

chalamandhiswritings--cntd.

ప్రవీన్సర్మగారూ,సంఘం  మారలేదని చెప్పలేము.౧.స్త్రీ విద్య బాగా ఎక్కువైంది. ౨.అమ్మాయిలుఇష్టమైతేనే పెళ్ళికి 
ఒప్పుకొంటున్నారు.౩.విడాకులు బాగా ఎక్కువైనవి.౪.నాకు తెలిసి కొందరు సహవాసం కూడా ,(పెళ్లి లేకుండా )
చేస్తున్నారు. ౪.సమాజం పూర్తిగా ఎప్పుడూ మారదు ౫.ఇప్పటికీ మెజారిటీకి స్వేచ్చా ప్రణయంఅంటే ఇష్టము ఉండదు.
. .          రమణారావు.ముద్దు 

chalamandhiswritings--cntd.

ప్రవీన్సర్మగారూ,సంఘం  మారలేదని చెప్పలేము.౧.స్త్రీ విద్య బాగా ఎక్కువైంది. ౨.అమ్మాయిలుఇష్టమైతేనే పెళ్ళికి 
ఒప్పుకొంటున్నారు.౩.విడాకులు బాగా ఎక్కువైనవి.౪.నాకు తెలిసి కొందరు సహవాసం కూడా ,(పెళ్లి లేకుండా )
చేస్తున్నారు. ౪.సమాజం పూర్తిగా ఎప్పుడూ మారదు ౫.ఇప్పటికీ మెజారిటీకి స్వేచ్చా ప్రణయంఅంటే ఇష్టము ఉండదు.
. .          రమణారావు.ముద్దు 

10, మే 2011, మంగళవారం

చలం నవలలు , దృక్పథాలు

చలం నవలల గురించి చాలామంది రాసేవున్నారు. అయినా మళ్ళీ ఎవరైనా రాయవచ్చును. మెహెర్, సంహిత ,అనేవారు ఇప్పుడు బాగా విశ్లేషించి రాస్తున్నారు.నేను నా పుస్తకాల్లో శశిరేఖ, మైదానం నవలల గురించి వ్యాఖ్యానించాను .ససిరేఖలో ఆయన శైలి పరిణత పొందలేదు. గ్రాంధికానికి దగ్గరలో ఉంటుందిచలం నాయికల జీవితం 
మామూలుగా విషాదాంతంగా ముగుస్తుంది.వీల్లెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని కోపం వస్తుంది.స్త్రీవాదం ,అలాంటి 
రచనలు తెలుగులో రాకముందే ,ఎనభై సం /ముందే చలం విప్లవాత్మక రచనలు చేసి మధ్య తరగతి ఆలోచనలను 
ప్రభావితం చేసాడుఆయన పెళ్లి,బడి, వ్యవస్థలకు . వ్యతిరేకి.మనం ఇప్పుడా భావాలను వ్యతిరేకిన్చావచ్చునుచలం
నవలలు,కథలు, ద్వారా పరోక్షంగా కాకుండా ,ఆయన రాసిన  స్త్రీ అనే వ్యాససంపుటి చదివితే తెలుస్తుంది. స్త్రీల
జీవితాలూ,సమస్యలగురించి చర్చించాడు.ఆర్ధిక, సాంఘిక, వైవాహిక ,సెక్సు,విషయాలన్నిటి మీదా స్పష్టంగా తన 
అభిప్రాయాలన్నీ విసదీకరించాడు. కొన్ని పరిష్కారాలు సూచించాడు. ------రమణారావు.ముద్దు 

9, మే 2011, సోమవారం

కాశ్మీర్

ఇండియన్ మినర్వాగారు, కాస్మీరుని మనం ఎట్టి పరిస్థితుల్లోను వదలకూడదు.౧చారిత్రక కారణాలు.౨.దేశవిభజన 
సమయంలో కాశ్మీర్ అప్పటి శరతులప్రకారం చట్టబద్ధంగా భారత్లో చేరింది. ౩ప్రజాస్వామికమ్గా ఎన్నికలు,పరిపాలన, 
కొనసాగుతున్నవి.౪.స్త్రాటేజిక్గాకాశ్మీరు చాలా ముఖ్యమైనది. ౫.ఆర్టికల౭౭ ఇంకా కొంతకాలం కొనసాగిన్చాలిసివుంది. 
౬మన మిలిటరీని అవసరమైనంతకాలంఅక్కడ మొహరించివుంచాలిసిందే౭.కాశ్మీరీ పండిత్స్ని మంచి భద్రతతో అక్కడికి .   పునరావాసం
 కల్పించాలి. ౮.అరున్ధతీరాయి వంటివారిని దేసద్రోహనేరం కింద ప్రసేక్యూట్ చెయ్యాలి. ఇవి నా అభిప్రాయాలు. 
రమణారావు.ముద్దు (కమనీయం)

3, మే 2011, మంగళవారం

మెడి కేర్ ( గల్పిక)

గల్పికనం.౩==మెడికేర్ ----
                                      ఈ వైద్యరంగంలో ఎప్పుడూ ,ఎవరో ఒకరు ఒక కొత్త పరికరాన్నో ,పద్ధతినో కనిపెట్టుతూవుంటారు.మీకు ఆరోగ్యబీమా ఉంటె ఈ మెషీన్లను డాక్టర్లు వాడకున్దావుందరు. 
          ఈ మధ్య మిసెస్రత్నం  కడుపునొప్పితో మినర్వా హాస్పటల్కి వెళ్ళింది.ఏదో అసిదితీయో ,అజీర్నమో, సింపుల్గా బాగావుతున్దనుకొని వెళ్ళింది. ఇంచార్జి సీనియర్ డాక్టర్ మామూలుగా పరీక్షచేసి యాన్తాసిడ్ మాత్రలు 
          రాసిడ్డామనుకోనేసరికి ,జూనియర్ డాక్టర్ ,సార్మనహాస్పతల్కి దిన్గోమేషీన్వచ్చిన్దికదా ,దాన్ని వాడి చూస్తె మంచిదికదాఅని చెవిలో ఊదింది.
          "అవును,బాగా గుర్తుచేసావు .కడుపులో గ్యాసు వుంటే దానితో తెలిసిపోతుంది కదా .పెషేన్తుని ప్రేపేరు చేయడానికి ఎంత సమయం  పట్టుతుంది/"i
            
గంట పడుతుంది. రెడ్డిసార్ రాలేదు. డాక్టర్ మిశ్రాని అడిగితె రేపు రమ్మన్నారు." స్పెషల్ రిక్వెస్టు చేసి ఇవాళ ఎకామిదేట్ చెయ్యమని అడుగు.'
          దాక్తర్గారూ ఈపరీక్ష ఎందుకండీ నాకు మాత్రలు రాసివ్వండిచాలుఅంది మిసెస్ రత్నం.'''.అలా అనకమ్మా, మాడరన్ ఎక్విప్మెంట్ వాడడం నాధర్మం.లేకపోతె ఏ తుంటరి లాయరో కేసుపట్టవచ్చును. " 
         ఎలాగైతేనేమి రెండు గంటల తర్వాత మిసెస్ రత్నమ్కి దిన్గోస్కోపు పరీక్ష జరిగింది.ఆవిడకడుపు భాగం గుహలాంటి మేశీనులోకి దూర్చి ,కాళ్ళుచేతులు కట్టేశారు.నోరు తెరచి గాలి పీల్చమన్నారు. 
           ముక్కమన్నారు.పదిహేను నిమిషాలలో పూర్తయింది.దానితోబాటు రక్తపరీక్షలు అవీ చేసారు."నా ఇన్సూరెన్సు ఈ ఏడాదికి దీనితోనే పూర్తయిపోఎట్లు   వుంది"అని ఆవిడ గోల. పక్కనవున్న 
           నర్సు "ఊరుకోమ్మా, నీమంచికేకదా"అని మందలించేసరికిఆవిడ మారు మాతలాదలేకపోయింది 
            సీనియర్డాక్తర్చివరికి యాన్తాసిడ్ మాత్రలే రాసిచ్చాడువాటి ధర ౭౫రోపాయలె .కాని అన్ని పరీక్షలకి  ౨౦ వేలరూపాయలైంది.!

2, మే 2011, సోమవారం

telugu transliteration

ఇప్పుడు బ్లాగర్ లో transliteration సదుపాయం వచ్చింది. దీని వలన నా లాంటి వారికి చాల సులువుగా తెలుగు లో రాయడం కుడురుతింది. 

సాయి బాబా - 3

సత్యసాయిబాబా == నిరుడు ౨౦౧౦లొ బెంగుళూరులో ఉన్నప్పుడు ఎందుకో పుట్టపర్తికి వెళ్ళాలనిపించింది.మా అబ్బాయి వాళ్లతో కలిసి ,ముందు లేపాక్షి చూసి దగ్గరలోవున్న పుట్టపర్తి వెళ్ళాము. ప్రశాంతినిలయం ,అక్కడి వాతావరణం నచ్చాయి.హాస్పటల్ ,యూనివర్సిటీ బాగున్నవి.సాయంత్రం బాబా దర్సనం అయింది.అప్పటికే ఆయనకు పక్షవాతం వచ్చుటచేత వీల్చైర్లో చుట్టూ తిప్పి తీసుకోనివేల్లారు.ఆయన ఏమీ మాట్లాడలేదు. నా అభిప్రాయమేమంటే సత్యసాయిబాబా మహిమలు ,భగవంతుని అవతారమని నమ్మినా ,నమ్మకపోయినా ,ఆయన చేసిన,చేయించిన ప్రజోపయోగమైన అనేక ఘనకార్యాలను మనం ప్రసంసించాలి.ఆయనది సామాన్యకుటుంబంఆయన స్వంతడబ్బుతో కాకపోయినా కోట్లకొద్దీ ధనంఆయన ప్రభావంవలననే భక్తులు ఇచ్చారుఅందరికీ ఇస్తారా ?ఆయన నిర్యాణం తరవాత కూడా ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తామని ట్రస్టు .వారుచెప్పారుకదా.వారు చెయ్యకపోతేనేప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వేచిచూద్దాముఅంతేకాని కొందరు.చేస్తున్నట్లు నిందించడం తప్పు.నేను చూసినంతవరకూ సాయిసంఘాలు ప్రజాసేవ చేస్తున్నారు.నేను నిర్వహించిన నేత్రవైద్య శిబిరాల్లో సత్యసాయి సేవకులు స్వచ్చందంగా వచ్చి రోగులకు సేవచేసేవారు.==రమణారావు.ముద్దు .