30, నవంబర్ 2011, బుధవారం

kandam.contd.


   విందగు జవ్వనమును కడు
   నందముగా గడుప వలయు  నా పిమ్మట నీ
   కుం దగు ,తామరపై జల
   బిందువు వలె జీవితమ్ము వెచ్చింప దగున్
                  --------------

    ఎందో,ఏమో అటు  జరి
    గిందని తబ్బిబ్బగు ప్రజ ,కేలకున ఘోరా
    క్రందన లం దీన జనులు
    క్రున్దుట జూచియును సరకు గొనరది ఏమో .
                ---------------

4 కామెంట్‌లు:

www.apuroopam.blogspot.com చెప్పారు...

మొదటి పద్యం చాలా చాలా బాగుంది. రెండోది నాకర్థం కాలేదు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

నేను రాసింది kandam.contd.లో రెండవ పద్యం గురించి.మొదటి పద్యంలో కూడా నీకుందగు అని ప్రారంభించి చివరలో మళ్లా వెచ్చింప దగున్ అని వచ్చింది.అన్వయంకుదరదు.అందు చేత చివరలో వెచ్చింపంగా అంటే సరిపోతుంది.చాలా చక్కటి పద్యం.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! కమనీయము గారూ ! కందము గురించి అందముగా కమనీయముగా చెప్పినారు.

కం: పందెము నొడ్డని యాటలు
అందము లేనట్టి యెట్టి యాడుదియైనన్
చందురుడు లేని రాత్రియు
కందము మరి వ్రాయనట్టి కవి వ్యర్ధమెగా!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

అయ్యా ! ఒక మనవి.నాబ్లాగు లోని సమస్యను శంకరాభరణం లో గోలి హనుమచ్చాస్త్రి గారి సమస్యకు పూరణ అని వ్రాయుచున్నారు.నేను శంకరాభరణం లో గతం లో ఇచ్చిన సమస్యలను పూరించిన వాటిని నా బ్లాగు నందుంచున్నాను. కనుక నేను బ్లాగులో సూచించిన తేది ప్రకారము ......తేదిన శంకరాభరణం లో ఇచ్చిన సమస్యకు పూరణ అని వ్రాయగలరు. నేను ఇచ్చిన సమస్య కానందున నాపేరు వ్రాయవలదని మనవి.
ధన్యవాదములు.