గగన హర్మ్యముల గంధర్వ నగరం ==కోట్లకు పడగెత్తిన కుబేర పురం
దరిద్ర దేవత అనుంగు బిడ్డల=కుచేల వాటిక
తిమిరలోకపు వికృత రూపం =చీకటి దారుల గజిబిజి లోకం
విపర్యయాల వ్యత్యాసాల =విపరీతాల పద్మ వ్యూహం
చిత్ర జగతి నేలె =విచిత్ర జీవుల కేళీ వినోదం
చీమల బారుల శ్రామిక జీవుల =పుట్టలలో పాముల ఆక్రమణ
క్షణము విరామమెరుగక =పరిభ్రమించు జనయంత్రం
సకల సంపదల సంసోభితం=స ర్వ జాతుల సమాహారంm ra
క్వీన్స్ నెక్లెస్
మనిదీపాల సుందరహారం =శక్రచాపపు సప్త వర్ణములు
మురిపించే మనోహర దృశ్యం
ది సిటీ దట్ నెవెర్ స్లీప్స్
వలసకు వచ్చే ప్రజలకు =బతుకు తెరువగు ఆశా దీపం
అందరికీ అన్నీ అగుచును
లక్షలాది ప్రజలకు =భిక్ష నొసంగుచు
గర్భంలో దాచుకొనే =కామిత దాయని
కరుణా హృదయిని
కాదిట పొమ్మను =కఠిన చిత్త కూడా
------------------
1 కామెంట్:
సప్త వర్ణాల బొంబాయిని చక్కగాచిత్రించారు.నాకు ఆఖరులైను అర్థం కాలేదు. టైపింగ్ దోషమేమయినా ఉందేమో?
కామెంట్‌ను పోస్ట్ చేయండి