పద్యమొ గద్యమో,గేయమొ,
హృద్యము గా నుండ వలయు ,హేవాకము రస సం
వేద్యము గా నుండి మధుర
వాద్యము మ్రోగించి నటుల వర్ధిలవలయున్
-------------
నన్నయ ,తిక్కన ,పోతన
చెన్నుగ నా భట్టుమూర్తి ,శ్రీ నాదా దుల్ ,
ఎన్నాల్లయినను రసికుల
మన్ననలను పొందు చుండు మహనీయ గుణుల్ .
--------------
1 కామెంట్:
ఈ రెండు పద్యాలూ చాలా చక్కగా ఉన్నాయి.అభినందనలు.మొదటి పద్యంలో గద్యమో లో మోకి దీర్ఘంఉండకూడదు. అచ్చుతప్పనుకుంటాను. రెండవ పాదంలో 8 వ గణం కుదర లేదు.సరి చూసుకోండి.రెండవ పద్యంలో ఎన్నాళ్లయినను బదులు ఎన్నాల్లయినను అన్నది అచ్చుతప్పే. నాల్గవ పాదంలో పొందుచుండు బదులు పొందచుంద్రు అంటే సరి పోతుంది.ఇటువంటి కమ్మటి పద్యాలు మీనుంచి చాలా చాలా రావాలని ఆశిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి