6, డిసెంబర్ 2011, మంగళవారం

devanand



 సుప్రసిద్ధ సినిమా నటుడు దేవానంద్ తన 88వ ఏట లండన్లో మరణించిన వార్త అందరూ చదివే ఉంటారు.1948నుండి దాదాపు 1968 వరకూ ముగ్గురు నటులు ఒక వెలుగు వెలిగారు.రాజ్కపూర్,దిలీప్కుమార్, దేవానంద్ త్రిమూర్తులు.రాజ్ కపూర్ మంచి దర్శక నిర్మాత,షోమన్ గా,కూడా పేరు పొందేడు.దిలీప్ కుమార్,ముగ్గురిలోకీ గొప్ప నటునిగా ,ట్రాజెడీ కింగ్ గా పేరు పొందాడు.దేవానంద్ లైట్ కామెడీ చిత్రాలకీ ,సిటీ స్లికెర్ గా పేరు గాంచాడు.అందగాడు.handsome hero ఇండియన్ గ్రెగరీ పెక్ అని బిరుదు పొందేడు. అతని హెయిర్  స్టైల్  ,పఫ్ తో యువకులు అనుకరించే వాళ్ళు. ప్రసిద్ధనటి గాయని  సురయా ,అతను ప్రేమించుకొన్నారు.కాని ఇద్దరి మతాలూ, వేరవడం చేత పెళ్ళి చేసు కో లేక పోయారు. తర్వాత దేవానంద్ ఇంకొ నటి కల్పనా కార్తిక్ ని వివాహం  చేసుకొన్నాడు.పాపంసురయాజీవితాంతం  అవివాహితగానే ఉండి పోయింది.దేవానంద్  నవకేతన్ సంస్థ స్థాపించి గైడ్ వంటి కొన్ని మంచి చిత్రాలు కూడా తీసాడు. 1970 తర్వాత కూడా చాలా సినిమాలు తీసి,నటించాడు కాని అవి అంత విజయం సాధించలేదు.అతని heyday అయిపోయింది.రాజేష్ ఖన్నా ,అమితాభ్ శకం ప్రారంభమయింది. dadasahebphalke award,filmfare lifetime achievement awardలతో సత్కారం పొందేడు. 'గాతా రహే మెరా దిల్ '  

  

30, నవంబర్ 2011, బుధవారం

kandam.contd.


   విందగు జవ్వనమును కడు
   నందముగా గడుప వలయు  నా పిమ్మట నీ
   కుం దగు ,తామరపై జల
   బిందువు వలె జీవితమ్ము వెచ్చింప దగున్
                  --------------

    ఎందో,ఏమో అటు  జరి
    గిందని తబ్బిబ్బగు ప్రజ ,కేలకున ఘోరా
    క్రందన లం దీన జనులు
    క్రున్దుట జూచియును సరకు గొనరది ఏమో .
                ---------------

27, నవంబర్ 2011, ఆదివారం

rendu kandalu.


  పస లేని వంటకమ్మును
  రసహీన మయిన కవితయు ,రాగము తాళం
  బెసగని సంగీత పటిమ
  వెస కరుణ రహిత మతమును  విడువంగ దగున్ .
                 --------------------                            
   వృత్తులలో వ్యవసాయము ,
  పుత్తడి లోహముల యందు ,పువ్వుల పద్మం
   బత్తారు లందున జాస్మిన్
   అత్తరు ణుల యందు పత్ని అధికము సుమ్మీ.
                     ---------------                

21, నవంబర్ 2011, సోమవారం

ghantasala


   ఓ ఘంటసాలా , మధుర సంగీత లోలా , గంధర్వ లోక వాసీ  భూతలప్రవాసీ,
  జనరంజనము చేయ  చనుదెంచి  మరలావు, మా గుండెలో నిలిచి రాగమై మ్రోగావు,
  నీలాల గగనాన నిండిన వెన్నెలలో ,నీలిమేఘాలలో గాలికేరటాలలో
  కొండగాలి తిరిగితే  గుండె వూసులాడితే ,నీవు పాడిన పాట వినిపించు నేవేళ ,=ఓ ఘంటసాలా =
   మది శారదాదేవి మందిరమే నీకు  ,మధు మురళీగాన మాధుర్యమే నీవు,
  శివ శంకరీమంత్ర చింతనను చేసావు ,ఆలపించితివి గీతా సుధా బోధనలు నీవు ,=ఓ ఘంటసాలా =
   మోహనము పాడితే మోహనాస్త్రముగాదె ,కల్యాణి నీ నోట కళ్యాణ శుభకారి ,
   పాడుతా తీయగా అని పాడేవు అద్భుతముగా ,మరువ లేని మనీషీ ,మరలి రాని మహతీ .=ఓ ఘంటసాలా =

      డిసెంబర్ నాలుగో తేదీ ఘంటసాల జయంతి లో పాడుటకు నేను రచించిన పాట.
 
 .

17, నవంబర్ 2011, గురువారం

hevakamu


  పద్యమొ గద్యమో,గేయమొ,
  హృద్యము గా నుండ  వలయు ,హేవాకము రస సం
  వేద్యము గా నుండి మధుర
  వాద్యము మ్రోగించి నటుల  వర్ధిలవలయున్
   
              -------------
   నన్నయ ,తిక్కన ,పోతన
   చెన్నుగ నా భట్టుమూర్తి ,శ్రీ నాదా దుల్ ,
   ఎన్నాల్లయినను  రసికుల
   మన్ననలను  పొందు చుండు  మహనీయ గుణుల్ .
               --------------        
      

16, నవంబర్ 2011, బుధవారం

kandam


 కందము మాకందము,మా
 కంద తరుఫల సుమధుర మరందము ,విందౌ
 డెందము ,కందలితమ్మౌ
 నందపు కందమ్మే వ్రాయ నభిమతమౌ గా .
                  ------------      
 వాద్యముల వీణ శ్రేష్టము
 పద్యము లన్నింట కంద పద్యము మేలౌ
 మద్యమ్ములలో  వైనును
 విద్యలలో వైద్య విద్య  అద్యంబగుగా
               ------------

14, నవంబర్ 2011, సోమవారం

bombay


  గగన హర్మ్యముల గంధర్వ నగరం ==కోట్లకు పడగెత్తిన కుబేర పురం
  దరిద్ర దేవత అనుంగు బిడ్డల=కుచేల వాటిక
  తిమిరలోకపు వికృత  రూపం =చీకటి దారుల గజిబిజి లోకం
  విపర్యయాల వ్యత్యాసాల =విపరీతాల పద్మ వ్యూహం
  చిత్ర జగతి నేలె =విచిత్ర జీవుల కేళీ వినోదం
  చీమల బారుల శ్రామిక జీవుల =పుట్టలలో  పాముల ఆక్రమణ
  క్షణము విరామమెరుగక =పరిభ్రమించు జనయంత్రం
  సకల సంపదల సంసోభితం=స ర్వ జాతుల సమాహారంm ra
                      క్వీన్స్ నెక్లెస్
  మనిదీపాల సుందరహారం =శక్రచాపపు సప్త వర్ణములు
     మురిపించే మనోహర దృశ్యం
       ది సిటీ దట్ నెవెర్ స్లీప్స్
  వలసకు వచ్చే ప్రజలకు =బతుకు తెరువగు ఆశా దీపం
       అందరికీ అన్నీ అగుచును
  లక్షలాది ప్రజలకు =భిక్ష నొసంగుచు
  గర్భంలో దాచుకొనే =కామిత దాయని
         కరుణా హృదయిని
  కాదిట పొమ్మను =కఠిన చిత్త కూడా
            ------------------