ఈ మధ్య తాజ్ మహల్ గురించి ఒక బి.జె.పి.నాయకుడు; దానిని విదేశీ దురాక్రమణదారు,దుర్మార్గుడు కట్టించాడు .మన సంస్కృతికి విరుద్ధమని ఇంకా ఏదో సెలవిచ్చాడు.సరే అతని వాదనని ఒప్పుకుందామనుకొండి.ఇప్పుడా తాజ్ మహల్ని ఏంచెయ్యాలి?దేశవిదేశాలనుంచి లక్షలాది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ,కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సంపాదిస్తున్న ఈ అందమైన కట్టడాన్ని,కూల్చేయాలని అతని ఉద్దేశమా?మరి ఆగ్రాకోట,ధిల్లీ లో ఎర్రకోట ,కుతుబ్ మినార్ ,వీటి సంగతేమిటి?ఎర్రకోట మీదనుంచి ప్రధాని జాతీయ జెండా ఎగరవేస్తారే?మన హైదరాబాదుకే iconic building ఐన చార్ మినార్ సంగతేమిటి?ఒక్క ముస్లిం ప్రభువులు కట్టించిన వాటికేనా యీ రూలు వర్తించేది లేక విదేశీ పాలకులు కట్టించిన వాటికన్నిటికీ వర్తిస్తుందా?బ్రిటిష్ పాలకులు కట్టించిన వందలాది కట్టడాల సంగతి అలాఉంచండి.మనరాజధాని కొత్త ధిల్లీ కట్టింది వాళ్ళే కదా.దేశాధినేత నివసించే భవనాల్లోకల్ల ప్రపంచంలోనే పెద్దది ,grandest ఐనది రాష్ట్రపతిభవన్ విదేశీ సామ్రాజ్యవాదులు కట్టించారుకదా. రష్యాలో కమ్మ్యూనిస్టులు పరిపాలించినప్పుడు కూడా తాము ద్వేషించే జారు చక్రవర్తులు కట్టించిన క్రెం లిన్ ని ఉపయోగించుకొన్నారుకాని పడగొట్టలేదు.మన కిష్టమున్నా లేకపోయినా ఇటువంటి కట్టడాలు మన వారసత్వంheritage గా ఉంటాయి.వాటిని పరిరక్షించుకోవడం నాగరకతా లక్షణం.పాడు చేయడం అనాగరకతా లక్షణం(barbrrism..)
16, అక్టోబర్ 2017, సోమవారం

19, జనవరి 2016, మంగళవారం
#Medical checkup
ఈ మధ్య బొంబయి పోలీస్ ఫోర్స్ లో నలభై శాతం ఫిట్ గా లేరని తెలిసింది.మన రాష్ట్రంలో కూడా పోలీసులందరికీ,ఆఫీసర్లకూ మెడికల్ పరీక్ష నిర్వహిస్తే చాలామంది ఫిట్ గా లేరని తెలుస్తుంది.అలాగే ఇతర డిపార్ట్ మెంట్ల లో కూడా, మధుమేహం,రక్తపోట్ల తో ,అధిక బరువు,గుండె,ఉదర,శ్వాసకోశ జబ్బులతో కొంతమంది బాధపడుతున్నట్లు తెలుస్తుంది.అలా తెలుసుకోవడం వలన సకాలంలో ట్రీట్ మెంట్ తీసుకోడానికి వీలవుతుంది.40 సం; నుంచి ఇటువంటి జాగ్రతలు తీసుకొంటే మంచిది.ఈ సంగతి అందరికీ తెలిసినా చాలామంది అశ్రద్ధ చేస్తారు.అలా చెయ్యవద్దని నా హితవు.
12, జనవరి 2016, మంగళవారం
some misconceptions
కండ్ల గురించి,వాటి కొన్ని జబ్బుల గురించి ,తప్పు అభిప్రాయలను తొలగించి,సదవగాహన కలిగించుటకై ఇది వ్రాస్తున్నాను.
1.పెద్దలకేగాని చిన్నపిల్లలకి కంటి అద్దాలు అవసరములేదనుకొనుట తప్పు.కొంతమంది పిల్లలలో హ్రస్వ దృష్టి,చెదిరిన చూపు,myopia,astigmatism ఉండవచ్చును.వాటిని అద్దాలతో సవరించవచ్చును.
2.కొంతకాలము వాడినతర్వాత అద్దాలు తీసిపారవేయవచ్చుననుకొనుట తప్పు.డాక్టర్ చెప్పినంతకాలము వాటిని వాడవలసిందే.ఏడాది కొకసారి పరీక్ష చేయించుకొనుట మంచిది.
3.కండ్లు ఎర్రబడి,నీరు కారుతుంటే ఇంటి వైద్యం ఏవో చుక్కలు వేసికొనుట మంఛిది కాదు.కంటి డాక్టర్ కి చూపించి తగిన మందు చుక్కలు వాడాలి.
4.మెల్లకన్నును 'సిరిమెల్ల ' అని అశ్రద్ధ చెయ్యరాదు.మొదటిలోనే స్పెషలిస్టు కి చూపించి వైద్యం చేయించవలెను.అద్దాలవలనగాని ,శస్త్రచికిత్స వలన గాని మెల్లను బాగు చెయ్యవచ్చును.

8, జనవరి 2016, శుక్రవారం
islamic terrorism
నేను ముస్లిం వ్యతిరేకిని కాను.అనేక రంగాల్లో వాళ్ళు మన భారతదేశానికి వారి CONTRIBUTION అందిస్తున్నారు.అందరు ముస్లింలూ టెర్రరిస్టులు కాదు. కాని వారిలో ఒకవర్గంవారు ఉగ్రవాదానికి పాల్పడుతూ ఉంటారు..నాకు కొందరు మంచి ముస్లిం మిత్రులు ఉండేవారు కూడా.కాని ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి.ఎక్కడైన ఒకప్రాంతంలో వారు మెజారిటీలో ఉంటే అక్కడ వారు ప్రత్యేక రాజ్యాన్ని ,లేక మినీ పాకిస్థాన్ను స్థాపించుకోడానికి ప్రయత్నిస్తారు.ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్,బీహార్,బెంగాల్,అస్సాం రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలలో మెజారిటీగా ఉన్నారు.దీనికి కాంగ్రెసే కాక మిగతా పార్టీలు కూడా బాధ్యులు.ఇప్పటికైనా మేల్కొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కింది చర్యలు తీసుకోవాలి.
1.బాంగ్లాదేశ్ సరిహద్దుని పూర్తిగా కంచెతో మూసివెయ్యాలి.అవసరమైనచోట్ల మాత్రం కంట్రొల్డ్ గా వర్తకవ్యాపారాలు అనుమతించాలి.
2.విదేశీయులను గుర్తించి వారికి పౌరసత్వ హక్కులు,వోటింగు హక్కులూ రద్దుచెయ్యాలి.
3.హిందువులతోబాటు ముస్లిం,క్రైస్తవ మతస్తులకు కూడా 2రు పిల్లల కుటుంబ నియంత్రణ విధిగా పాటించాలి.
29, డిసెంబర్ 2015, మంగళవారం
RAJAAJEE
ఈ మధ్య కాంగ్రెస్ పత్రికలోనే నెహ్రూ,ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా రాసారట.కొన్ని విషయాలు నేను విశదపరచదల్చుకొన్నాను.మనదేశానికి స్వరాజ్యం వచ్చేనాటికి మేము కాలేజిలో చదువుకొనేవాళ్ళం. అప్పుడు ముఖ్యులూ గొప్పవాళ్ళైన నాయకులు గాంధిజీ,నెహ్రూ,పటేల్,అజాద్,రాజేంద్రప్రసాద్.నేతాజీ (సుభాస్ చంద్ర బోస్ ) గొప్పనాయకుడు ఐనా మరణించినట్లు సమాచారం(విదేశాల్లో ఒక విమానప్రమాదంలో ) ప్రజాదరణ పాపులారిటీ ఎక్కువ ఉండటంచేత నెహ్రూజీ ప్రధానమంత్రి ఐనాడు. కాశ్మీర్,చైనాల విషయంలో నెహ్రూ తప్పుడు,బలహీన విధానాలను నేను కూడా వ్యతిరేకిస్తున్నాను.కాని ఆయన నవభారతనిర్మాత అనిఒప్పుకోవాలి.ఎన్నో పారిశ్రామిక,విద్యుత్,నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాడు.రాజ్యాంగ ,సాంఘిక,సంస్కరణలని ఎన్నో ప్రవేశపెట్టాడు.ఐతే నెహ్రూ బదులు పటేల్ ప్రధాని ఐవుంటే బాగుండేదని కొందరు విశ్వసిస్తారు.ఇవన్నీ చరిత్రలోని ifs and buts కదా.
కాని నేనిప్పుడు వ్రాయదలుచుకొన్నది రాజాజీ (రాజగోపాలాచారి)గురించి.ఆయనకూడా మేధావి,గొప్పనాయకుడే.కాని ఇతరనాయకులనుంచి విభేదించేవాడు. 1942 లోనే పాకిస్తాన్ ఇవ్వక తప్పదని చెప్పాడు.కాంగ్రెస్ సోషలిస్టు పాలసీలను వ్యతిరేకించాడు.'పర్మిట్,లైసెన్స్,రాజ్ ' ని రద్దుచెయ్యమన్నాడు. చివరకు 1990 లో మళ్ళీ కాంగ్రెస్ ప్రధాని ఐన పీ.వీ.నరసిమ్హారావు గారు రాజాజీ పాలసీలను అమలు పరచారు.
పైన పేర్కొన్న నాయకులందరూ (వారిలోవారికి విభేదాలు ఉన్నా) నిజాయితీకలవారు, ,నిస్స్వార్థపరులూ ,దేశభక్తులూ.
నాకు తెలిసిన విషయాలు ఇక్కడ వ్రాశాను.
18, డిసెంబర్ 2015, శుక్రవారం
renDu paarTeela naaTakam
#GST BILL#modalaina mukhyamaina
GST BILLవంటి బిల్ల్స్ ని పార్లమెంట్ లో పాసవకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకొనంటున్నదనిB,J,P,ప్రభుత్వం ఆరోపిస్తున్నది .మా ప్రభుత్వకాలంలో ఇలాగే మీరు ఇదె బిల్లులిని అడ్డుకొన్నారని కాంగ్రెస్ జవాబిస్తున్నది ,ఈ మధ్య మామిత్రుడొకడు ,ఇద్దరికీ GST bill పాసవడం ఇష్టం లేదని explain చేసాడు. ఉదాహరణకి మన ఇచ్చాపురం దగ్గర ఒడిస్సా ,ఆంధ్ర సరిహద్దులో టొల్ల్ గేట్ రోజుకి ఆదాయం30లక్షలు .అందులో రాజకీయనాయకులకు ,ప్రజాప్రతినిధులకు,పెద్ద అధికారులకు,చివరకు గుమాస్తాలకు,అటెండర్లసహా అందరికీ వారి వారి వాటాలు ఉంటాయి .ఇలా దేశమంతా ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో వాటి మొత్తం ఆదాయం . ఎంతో ఆలోచించుకొండి. ఇంత ఆదాయాన్నిఏ పార్టీవాళ్ళయినా వదులుకొంటారా అందుకే జీ,యస్.టీ బిల్లు ఎప్పటికీ పాసవదనిచెప్పాడు.

19, సెప్టెంబర్ 2015, శనివారం
srisailam project
అసలు రాయలసీమకు ఎప్పుడో మొదటి ద్రోహం జరిగింది.అది క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టు మొదటి ప్రయారిటీ గా కట్టి,అతర్వాత నాగార్జున సాగర్ కట్టి ఉండవలసింది.క్రిష్ణా గుంటూర్ వాళ్ళ ప్రాబల్యం వల్ల అలా జరగలేదు. సంజీవరెడ్డి వంటి సీమ నాయకులు కూడా అప్పుడు నోరెత్తలేదు.గాలేరు-నగరి,హంద్రీ -నీవా పథకాల సంగతి అలా ఉంచండి.ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయిర్ లో ఉన్న నీటిలో కనీసం 100 TMC లనీటిని రాయలసీమకు విడిచిపెట్టకుండా దిగువకు నీరు వదలకూడదు.ఈ విషయంలో రాయలసీమ నాయకులంతా,మంత్రులతో సహా గట్టిగా పట్టు పట్టాలి. చిత్తూరు జిల్లా వాడైనా చంద్రబాబు క్రిష్ణా డెల్టా గురించేగాని రాయలసీమ అవసరాలు పట్టవు.ఇప్పటికైనా రాయలసీమవారంతా మేలుకోవాలి.
12, ఆగస్టు 2015, బుధవారం
old age and children
వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం వల్ల తల్లిదండ్రులు పడుతున్న కష్టాలగురించి ఈమధ్య పత్రికల్లో చాలా కథలు వస్తున్నాయి.నిజమే కాదనను.కాని కొంచెం అవతలి వైపు కూడా చూడవలసి ఉంటుంది.కావాలనే deliberateగా నిర్లక్ష్యం చేసేవారి గురించి రాయదలుచుకోలేదు. కాని తల్లి దండ్రుల మీద అంతో, ఇంతో ప్రేమ ఉండి ,కూడా సరిగా చూడలేనివారి సంగతి గమనించాలి.
1.తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆర్థిక పరిస్థితులు.2. తమ ముసలితనానికి అంతో ఇంతో వెనక వేసుకొనక పోవడం.3,ఈ రోజుల్లో భార్యా ,భర్తలిద్దరూ ఉద్యోగాలో,పనులో చేస్తూఉండడం వల్ల తీరుబాటు లేకపోవటం.పిల్లలు కూడా అందరూ చదువులకు వెళ్ళిపోవడం వలన 4.పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు వృద్ధుల్ని చూసేవారు.ఇప్పుడు అంతా nuclear families కదా. 5.వృద్ధాప్యంలో జబ్బులు ఎక్కువ. ఇప్పుడు వైద్యం కూడా చాలా ఖరీదు.medical insurance లేకపోతే భరించడం చాలా కష్టం. ఇలాగ అనేక కారణాలు ఉన్నాయి.వాటిని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది.
10, ఆగస్టు 2015, సోమవారం
INDIA -poverty-my observation
మన దేశంలో పేదరికం ఇంకా ఉన్నదని ఒప్పుకుంటాను.ఈ విషయంలో ప్రభుత్వ గణాంకాలు ,ఇతర గణాంకాలు విభేదిస్తున్నాయి.వాటి మాట ఎలాఉన్నా, ప్రాక్టికల్ గా నా పరిశీలనలో ముఖ్యాంగా మన కోస్తా ఆంధ్ర లో పేదరికం మునపటి కన్నా బాగా తగ్గిందని అనిపిస్తున్నది.
1.మాఇంటికి పూర్వం రోజూ కనీసం 10 మంది బిచ్చానికి వచ్చేవారు.ఇప్పుడు ఒకరూ రావటం లేదు.
2.పనిమనుషులు దొరకటం కష్టం గాఉంది.దొరికినా వాళ్ళు పూర్వం లాగ మిగిలిన అన్నం,కూరలు పట్టుకెళ్ళటం లేదు.
3.అందరి దగ్గరా సెల్ ఫోన్లు ,టీ.వీలు ఉన్నాయి.మోటార్ బైక్ లేక పోయినా సైకిలేనా లేని కుటుంబాలు కనిపించడం లేదు.
4.పూర్వం తాటాకు గుడిసెలూ ,పూరిళ్ళూ ఎక్కువగా ఉండేవి.ఇప్పుడవి చాలా తక్కువ.సిమెంట్,లేక ఇటుక ఇళ్ళు (పల్లెలలో కూడా ) ఎక్కువగా ఉన్నాయి.
5.పూర్వం చదువు చాలా తక్కువ ,ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు.
6. ఇప్పుడు దాదాపు అందరూ మంచి బట్టలే ధరిస్తున్నారు.
ప్రజల ఆదాయం పెరగడం, ప్రభుత్వపు సంక్షేమ కార్యక్రమాలవల్ల ఈ మార్పులు వస్తున్నవని అనుకుంటున్నాను.అలా అని పేదరికం లేదని నా అభిప్రాయం కాదు.ఇంకా చెయ్యవలసినవీ,సాధించవలసినవీ చాలా ఉన్నాయని ఒప్పుకుంటాను.
31, జులై 2015, శుక్రవారం
our population
పత్రికల్లో సమాచారం;మనదేశ జనాభా 130 కోట్లు అని ఏడెనిమిది ఏళ్ళలో చైనాను మించి పో తుందని2050 కి 170 కోట్లకు చేరుతుందని.అధిక జనాభా ఒకరకం గా మంచిదే ఐనా దానికి ఒక హద్దు ఉండాలి. నా అభిప్రాయంలో ,12 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్న మనదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 180 కోట్లను దాటకూడదు.(చ ;మై;కి 1500 మంది జనసాంద్రత ) లేకపోతే అందరికీ ఆహారం ,నీటి సరఫరా, గృహవసతి ,విద్యా,వైద్య సౌకర్యాలు అందించలేము. 150కోట్లకు limit చేసుకో గలుగుతే ఇంకా మంచిదే .మన నాయకులెవరూ కుటుంబ నియంత్రణ గురించి మాటలాడడానికే భయపడుతున్నారు.దక్షిణరాష్ట్రాలలో జనాభా అభివృద్ధి బాగా తగ్గుతుండడం మంచిపరిణామమే.కాని ఉత్తరాదిలో ఇంకా తగ్గడంలేదు. అందువలన కుల,మత,ప్రాంత భేదం లేకుండా జనాభా నియంత్రణ చేపట్టాలి.
30, జూన్ 2015, మంగళవారం
medical exam before marriage.
ఒక డాక్టర్ గా అనుభవపూర్వంగా చెప్తున్నాను.చాలామందికి రుచించక పోవచ్చును.అమలు చేయడంకూడా కష్టమే.పెళ్ళికి ముందు ఎన్నో చూస్తారు.అందచందాలు,సంప్రదాయం,హోదా,డబ్బు, ఇంకా ఎన్నో.మంచిదే.కాని వధువు,లేక వరుడి ఆరొగ్యం గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.పెళ్ళి నాటికి ఆరోగ్యంగానే ఉన్నా.అనేక వ్యాధులు క్రమంగా బయట పడతాయి.అప్పుడేమీ చెయ్యలేరు.చాలాజబ్బులు వంశపారంపర్యంగా వస్తాయి.కొన్ని ముందే తెలుసుకోవచ్చును. అందుచేత,కాబోయే పార్ట్నర్ పూర్తి మెడికల్ రిపోర్ట్ చూసి వివాహం చేసుకోడం మంచిది.ఇరువురూ అవతలవారి రిపోర్టుల్ని చూసుకొని సమ్మతమైతేనే వివాహం చేసుకోడం మంచిది.కాని దీన్ని ఆచరణలో పెట్టడం కష్టం.ఇది ఒక సలహా మాత్రమే.
29, జూన్ 2015, సోమవారం
national songs
'' మా తెలుగుతల్లికి మల్లెపూదండ ''గేయం తెలుగువారి(కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో)జాతీయ గేయం అయింది.ఇందులో originalగా శంకరంబాడి సుందరాచారి రచించిన గేయంలో ' అమరావతీగుహల అపురూపశిల్పాలు ' అనిఉన్నది.అమరావతిలో గుహలూ లేవు,అందులో శిల్పాలూ లేవు.అందుకని ఆ చరణాన్ని అమరావతీ నగర ' అనిమార్చారు.దరిమిలా ఇప్పుడు ' అమరావతీ గుడుల ' అని మార్చి పాడుతున్నారు.ఆ శిల్పాలులో చాలా భాగం లండన్ మ్యూజియం లోను,కొన్ని స్థానిక మ్యూజియం లో ను ఉన్నాయి.మొదట్లో టంగుటూరి సూర్యకుమారి పాడిన గ్రామొఫోన్ రికార్డు లోను ' అమరావతీ గుహల ' అనేఉంది.ఇది మన తెలుగు జాతీయ గేయం కథ.
ఇక భారత జాతీయ గేయం '' జనగణ మన అధినాయక '' విషయం ;;ఆదిలో దీన్ని రవీంద్ర నాథ టాగూర్ బ్రిటిష్ చక్రవర్తిని కీర్తిస్తూ రాసేడని, అప్పటికింకా టాగూర్గారికి జాతీయోద్యమంతో బాగా సంబంధం లేదని ,తర్వాతనే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్ బిరుదుని త్యజించారని ఒక వాదం ఉంది. కాదు ఆ గేయాన్ని భారతమాతను స్తుతిస్తూ రాసిన జాతీయగీతం అని ప్రతివాదం గా చెప్తారు.
ఇంకొక జాతీయగీతం ''వందేమాతరం' గురించి; ఇది దుర్గామాత గురించి కీర్తిస్తూ రాసింది దీన్ని పాడమని మమ్మల్ని నిర్బంధిచకూడదని ముస్లిం నాయకుల అభ్యంతరం.కాదు, ఇది భారతమాత గురించి బంకించంద్ర రాసినదని సమర్థిస్తారు. నా ఉద్దేశంలో ఈ గేయం మొదటి నాలుగు చరణాలు దేశాన్ని ఉద్దేశించినవే కాబట్టి
''వందేమాతరం సుజలాం ...నుంచి సుఖదాం వరదాం మాతరం '' వరకూపాడితే ఎవరికీ అభ్యంతరం ఉండకూడదని.
ఇలాగే బ్రిటిష్ జాతీయగీతం' long live the King ' కి కొందరు రాచరికవ్యవస్థ వ్యతిరెకులు అభ్యంతరం తెలుపుతున్నారు.ఆస్ట్రేలియాలో కూడా కొందరు ఇప్పుడు ఆ దేశం స్వతంత్రమైనది,అన్ని జాతులవారూ నివసిస్తూ ఉన్నారు కాబట్టి బ్రిటిష్ జాతీయ గీతం పనికిరాదంటున్నారు.రెపు స్కాట్లాండ్ విడిపోతే వాళ్ళూ అదే అంటారు.
9, జూన్ 2015, మంగళవారం
Revant Reddy's affair
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డితోబాటు చంద్రబాబునాయుడు కూడా భ్రష్టు పడ్డాడు.చివరికి కేసు కోర్టులో ఏమౌతుందో కాని,ప్రజల దృష్టిలో నాయుడుగారు అపఖ్యాతి పాలయ్యాడు.అందువల్ల తనపదవికి రాజీనామా చేసే నైతిక బాధ్యత ఆయనపైఉంది.ఐనాపరవాలేదు ,లాలూప్రసాద్ యాదవ్ గారు ముందే దారిచూపించిఉన్నాడుకదా!తాను దిగిపోవలసివచ్చినప్పుడు తన భార్య రబ్దీదేవిని ముఖ్యమంత్రిపదవిలో అధిష్ఠింప జేసాడుకదా.అలాగే చంద్రబాబునాయుడు కూడా కుమారుడు లోకేష్ ని ముఖ్యమంత్రినిచేసి తాను రాజీనామా చెయ్యవచ్చును. దానితో నైతికంగా ప్రవర్తించాడని పేరూ వస్తుంది.మళ్ళీ అదనుచూసుకొని గద్దెనెక్కవచ్చును. ఈలోగా ఎలాగూ లోకేష్ అధ్వర్యంలో T.D.P.ప్రభుత్వం కొనసాగుతుంది.తాను వెనకనుంచి చక్రం తిప్పవచ్చును. ఏమంటారు?
28, మే 2015, గురువారం
prasannabhaaskaram
ప్రసిద్ధ కవీ,అధ్యాపకుడు,పండితుడూ ఐన శ్రీ మానాప్రగడ శేషశాయిగారి 'ప్రసన్నభాస్కరం 'ఈ మధ్యనే నాకు లభించింది.ఆయనకు చూపు మందగించినప్పుడు రచించినట్లు తెలుస్తోంది.మొత్తం 223 పద్యాలున్నవి.అందులో రెండు మాత్రం ఉదహరిస్తాను.
చం'; హరితమణి చ్చటా చకిత హారి తురంగమ సప్తకాప్రభా
పరిణతమద్భుత ప్రణమితామరమౌళి గుళుచ్చ కాంతిభా
సురము,జగత్త్రయీ సదనసుందర కాంచన తోరణమ్ము, భా
స్కర నవరత్న మండలము,చయ్యన మాకు బ్రసన్నమయ్యెడున్
మత్తే'; నిను సేవింప రవీ !మయూరుడనుగానే,లేక శ్రీనాథుడై
నను గానే ,దరినుండు చాయనైనన్ గానే,ఉషహ్కాంతినై
నను గానే,ప్రియపద్మినీరమణి నైనంగానె త్రైలోక్యపా
వనముల్ నీఅరుణారుణ ప్రభలెటుల్ వర్ణింపగా జాలుదున్?
అన్ని పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి.సంస్కృతంలోని మయూరశతకంకి సాటి వస్తుందని ధీమాగా చెప్పగలను.
23, ఏప్రిల్ 2015, గురువారం
invitation to discussion
ఇప్పుడు మన దేశంలో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తిస్తున్న అంశం;ఆధునికీకరణ,పారిశ్రామికీకరణ అందుకు వ్యతిరేకంగా రైతుల వద్ద భూసేకరణకు నిరాకరణ,పర్యావరణరక్షణ..(modernization,industrialization vs.refusal by farmers ,protection of environment.) రెండు వైపుల వాదం బలంగానే వుంది.మనం చైనాలాగ ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే మొదటిది తప్పదంటుంది ప్రభుత్వం.ఇంకొక వర్గంవారు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.నేను నిపుణిణ్ణి కాదు.అందువల్ల ఈ విషయాలు బాగా తెలిసిన వారు చర్చలో తమ అభిప్రాయాలు తెలియ జేయ కోరుతున్నాను.

16, ఏప్రిల్ 2015, గురువారం
AL BERUNI
ఘజనీ మహమ్మద్ 17సార్లు మనదేశంపై దండెత్తి అనేక దేవాలయాల్ని ధ్వంసం చేసి ,సంపదకొల్లగొట్టి దోచుకొనిపోయినట్లే మనకు తెలుసు.కాని ,అతడు తన ఆస్థానంలో పండితుల్ని.కవుల్ని,శాస్త్రజ్ఞుల్నీ పోషించినట్లు చాలామందికి తెలియదు/.అందులో ఒకడు అల్ బెరుని. గొప్పవిద్వాంసుడు.శాస్త్రజ్ఞుడు.అతడు మన దేశంలో 13 సంవత్సరాలు నివసించి మన గ్రంథాలు సేకరించి,పండితులనుంచి సమాచారం సేకరించి ,పరిశోధనలు చేసి మనదేశం పైన ఒక పెద్దగ్రంథం వ్రాసాడు.అందులో హిందువుల ఆచారవ్యవహారాలు,దేశ పరిస్థితులు,ఇక్కడి శాస్త్రగ్రంథాలు,మతము,పురాణాలు,పంచాంగం ఒకటేమిటి చాలా విస్తారంగా రచించాడు.కొన్ని చోట్ల విమర్శలు కూడా నిశితంగా చేసాడు.తప్పక చదవ వలసిన పుస్తకం INDIA by AL BERUNI.edited byDr.Edward C. Sachau ;RUPA PUBLICATIONS NEW DELHI.
7, ఏప్రిల్ 2015, మంగళవారం
rudramadevi
ఉద్రమదేవి సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది కాబట్టి,వీలయితే అడవి బాపిరాజుగారు రచించిన 'గోన గన్నారెడ్డి 'అనే నవలను చదివితే మంచిది.చాలాకాలం క్రిందటే బాపిరాజుగారు చాలా పరిశోధించి ఈ నవల వ్రాసారు.చిన్నప్పటినుండి రుద్రమదేవిని మగపిల్లవాడిగా పెంచడం.చాలాకొద్దిమందికే ఈ విషయం తెలియడం,తర్వాత ముమ్మడమ్మను ఆమెకు వివాహం చేయడం,మగవేషంలోనే ఆమె రాజ్యంచెయ్యడం వంటి అనేక వింత విషయాలు ఇందులో ఉన్నాయి. సినిమాను తీసినవాళ్ళు ఈనవలను చదివి ఉంటారనుకొంటాను.గోనగన్నారెడ్డి అనేకులదృష్టిలో గజదొంగ, కాని అతడు రుద్రమదేవికి యుద్ధాల్లో సహాయం చేస్తాడు.వీలయితే చదవ వలసిన నవల.
18, మార్చి 2015, బుధవారం
pattiseema project
హటాత్తుగా ఈ పట్టిసీమ ప్రాజెక్టుని చంద్రబాబునాయుడి బుర్ర లో ప్రవేశించడానికి కారణమేమిటి?పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసి దివాలాకోరుతనంతో దీన్ని ప్రొమోట్ చేస్తున్నాడు.పట్టిసీమకి అయే 1500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు కొంతవరకైనా పనిజరుగుతుంగి కదా.B.J.P.,T.D.P. కుమ్మక్కై ఆంధ్రులని ముంచేసారు.ఎంత మోసగాళ్ళు ?సరే కాంగ్రెస్ వాళ్ళు ముందే తీరని ద్రోహం చేసారు.చివరి దాకా ఆంధ్రులు ఈ దొంగ రాజకీ యాలతో బాధపడవలసిందేనా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)