ఈ మధ్య కాంగ్రెస్ పత్రికలోనే నెహ్రూ,ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా రాసారట.కొన్ని విషయాలు నేను విశదపరచదల్చుకొన్నాను.మనదేశానికి స్వరాజ్యం వచ్చేనాటికి మేము కాలేజిలో చదువుకొనేవాళ్ళం. అప్పుడు ముఖ్యులూ గొప్పవాళ్ళైన నాయకులు గాంధిజీ,నెహ్రూ,పటేల్,అజాద్,రాజేంద్రప్రసాద్.నేతాజీ (సుభాస్ చంద్ర బోస్ ) గొప్పనాయకుడు ఐనా మరణించినట్లు సమాచారం(విదేశాల్లో ఒక విమానప్రమాదంలో ) ప్రజాదరణ పాపులారిటీ ఎక్కువ ఉండటంచేత నెహ్రూజీ ప్రధానమంత్రి ఐనాడు. కాశ్మీర్,చైనాల విషయంలో నెహ్రూ తప్పుడు,బలహీన విధానాలను నేను కూడా వ్యతిరేకిస్తున్నాను.కాని ఆయన నవభారతనిర్మాత అనిఒప్పుకోవాలి.ఎన్నో పారిశ్రామిక,విద్యుత్,నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాడు.రాజ్యాంగ ,సాంఘిక,సంస్కరణలని ఎన్నో ప్రవేశపెట్టాడు.ఐతే నెహ్రూ బదులు పటేల్ ప్రధాని ఐవుంటే బాగుండేదని కొందరు విశ్వసిస్తారు.ఇవన్నీ చరిత్రలోని ifs and buts కదా.
కాని నేనిప్పుడు వ్రాయదలుచుకొన్నది రాజాజీ (రాజగోపాలాచారి)గురించి.ఆయనకూడా మేధావి,గొప్పనాయకుడే.కాని ఇతరనాయకులనుంచి విభేదించేవాడు. 1942 లోనే పాకిస్తాన్ ఇవ్వక తప్పదని చెప్పాడు.కాంగ్రెస్ సోషలిస్టు పాలసీలను వ్యతిరేకించాడు.'పర్మిట్,లైసెన్స్,రాజ్ ' ని రద్దుచెయ్యమన్నాడు. చివరకు 1990 లో మళ్ళీ కాంగ్రెస్ ప్రధాని ఐన పీ.వీ.నరసిమ్హారావు గారు రాజాజీ పాలసీలను అమలు పరచారు.
పైన పేర్కొన్న నాయకులందరూ (వారిలోవారికి విభేదాలు ఉన్నా) నిజాయితీకలవారు, ,నిస్స్వార్థపరులూ ,దేశభక్తులూ.
నాకు తెలిసిన విషయాలు ఇక్కడ వ్రాశాను.
2 కామెంట్‌లు:
ఆ తరం తరువాయి నేతల్లో ఆ తరం అసలు సిసలైన నాయకులు లాంటి వారు మన దేశానికి కరువవడం మన దురదృష్టం
నెక్స్ట్ జనరేషన్ సరి ఐన నాయకులని వారు తయారు చేయక పోవడం దీనికి మూల కారణ మవుతుందేమో !
జిలేబి
నాయకులలో విభేదాలు ఉన్న మనము పరికించవలిసినది వారిలోని నిజాయితీని అని మీరు ఉదాహరణతో సహా విసిధికరించడం ఎంతో బాగుంది.మీకు మా తరుపు నుంచి all the best
కామెంట్‌ను పోస్ట్ చేయండి