మన దేశంలో పేదరికం ఇంకా ఉన్నదని ఒప్పుకుంటాను.ఈ విషయంలో ప్రభుత్వ గణాంకాలు ,ఇతర గణాంకాలు విభేదిస్తున్నాయి.వాటి మాట ఎలాఉన్నా, ప్రాక్టికల్ గా నా పరిశీలనలో ముఖ్యాంగా మన కోస్తా ఆంధ్ర లో పేదరికం మునపటి కన్నా బాగా తగ్గిందని అనిపిస్తున్నది.
1.మాఇంటికి పూర్వం రోజూ కనీసం 10 మంది బిచ్చానికి వచ్చేవారు.ఇప్పుడు ఒకరూ రావటం లేదు.
2.పనిమనుషులు దొరకటం కష్టం గాఉంది.దొరికినా వాళ్ళు పూర్వం లాగ మిగిలిన అన్నం,కూరలు పట్టుకెళ్ళటం లేదు.
3.అందరి దగ్గరా సెల్ ఫోన్లు ,టీ.వీలు ఉన్నాయి.మోటార్ బైక్ లేక పోయినా సైకిలేనా లేని కుటుంబాలు కనిపించడం లేదు.
4.పూర్వం తాటాకు గుడిసెలూ ,పూరిళ్ళూ ఎక్కువగా ఉండేవి.ఇప్పుడవి చాలా తక్కువ.సిమెంట్,లేక ఇటుక ఇళ్ళు (పల్లెలలో కూడా ) ఎక్కువగా ఉన్నాయి.
5.పూర్వం చదువు చాలా తక్కువ ,ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు.
6. ఇప్పుడు దాదాపు అందరూ మంచి బట్టలే ధరిస్తున్నారు.
ప్రజల ఆదాయం పెరగడం, ప్రభుత్వపు సంక్షేమ కార్యక్రమాలవల్ల ఈ మార్పులు వస్తున్నవని అనుకుంటున్నాను.అలా అని పేదరికం లేదని నా అభిప్రాయం కాదు.ఇంకా చెయ్యవలసినవీ,సాధించవలసినవీ చాలా ఉన్నాయని ఒప్పుకుంటాను.
1 కామెంట్:
మీరు చెప్పినది ప్రతి విషయమూ నిజమే. వీటితో పాటు కొన్ని దుర్గుణాలు కూడా ప్రబలిపోయాయి, అదే బాధగా ఉంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి