హటాత్తుగా ఈ పట్టిసీమ ప్రాజెక్టుని చంద్రబాబునాయుడి బుర్ర లో ప్రవేశించడానికి కారణమేమిటి?పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసి దివాలాకోరుతనంతో దీన్ని ప్రొమోట్ చేస్తున్నాడు.పట్టిసీమకి అయే 1500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు కొంతవరకైనా పనిజరుగుతుంగి కదా.B.J.P.,T.D.P. కుమ్మక్కై ఆంధ్రులని ముంచేసారు.ఎంత మోసగాళ్ళు ?సరే కాంగ్రెస్ వాళ్ళు ముందే తీరని ద్రోహం చేసారు.చివరి దాకా ఆంధ్రులు ఈ దొంగ రాజకీ యాలతో బాధపడవలసిందేనా?
6 కామెంట్‌లు:
1952 లో గెలిచిన మా పోలవరం ఎమ్.ఎల్.ఎ శ్రీ శొంఠి రామమూర్తిగారు ఈ ప్రాజక్ట్ పేరు రామపాద సాగర్ అన్నారు. అది మొదలు ఇలా కొన సాగుతూనే ఉంది. అసలు సంగతి ఏ రాజకీయ పార్టీ చెప్పటం లేదు, ఉన్నదేదో కీలకం, అది తెలియటం లేదు.
The then MLA WAS sRI. PUSULURI KODANADARAMAYYA
శర్మ గారూ, శొంఠి వెంకట రామమూర్తి గారు ICS ఆఫీసర్. వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఛీఫ్ సెక్రెటరీ గా వున్నప్పుడు పోలవరం ప్రోజెక్ట్ ప్రతిపాదనలు వచ్చాయి. ఆ ప్రోజెక్ట్ కు "శ్రీరామపాద సాగర్" అనే పేరు సూచించినది రామమూర్తి గారే. ఇది నాకు తెలిసిన / చదివిన వివరం. తర్వాత రోజుల్లో ఆయన MLA గా కూడా చేసారా (నాకు తెలియదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను) ?
ఇక ఇప్పుడు పోలవరం ప్రోజెక్ట్ పేరుతో నడుస్తున్నవి రాజకీయాలే.
నాది ఆ నియోజకవర్గమే! ఆ రోజులలో ఎమ్.ఎల్.ఎ గా ఉన్నది శ్రీ పుసులూరి కోదండరామయ్య గారు, అప్పటి ఛీప్ సెక్రటరీ శ్రీ శొంఠి రామమూర్తిగారు. మొదట వ్యాఖ్య రాసేటప్పటికి పేర్లు పూర్తిగా గుర్తురాలేదు.
పోలవరం వెనక ఏదో గూడు పుఠాణీ ఉందనిపిస్తూంది.
Купил кота не знал как его назвать. Нашёл здесь unique female cat names http://allcatsnames.com/female-cat-names-unique полный список имен для котов.
నిజమే.శొంఠి రామమూర్తిగారు చీఫ్ సెక్రెట్రీయే.ఆయన రాజకీయవాది కాదు. కొదండరామయ్య గారు శాసనసభ్యుడు.రామమూర్తిగారే పోలవరం ప్రోజక్టుని 'రామపాదసాగర్ 'అని నామకరణం చేసారు.అప్పటినుంచి ఈ ప్రోజెక్టు నలుగుతూనేవుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి