ఓ ఘంటసాలా , మధుర సంగీత లోలా , గంధర్వ లోక వాసీ భూతలప్రవాసీ,
జనరంజనము చేయ చనుదెంచి మరలావు, మా గుండెలో నిలిచి రాగమై మ్రోగావు,
నీలాల గగనాన నిండిన వెన్నెలలో ,నీలిమేఘాలలో గాలికేరటాలలో
కొండగాలి తిరిగితే గుండె వూసులాడితే ,నీవు పాడిన పాట వినిపించు నేవేళ ,=ఓ ఘంటసాలా =
మది శారదాదేవి మందిరమే నీకు ,మధు మురళీగాన మాధుర్యమే నీవు,
శివ శంకరీమంత్ర చింతనను చేసావు ,ఆలపించితివి గీతా సుధా బోధనలు నీవు ,=ఓ ఘంటసాలా =
మోహనము పాడితే మోహనాస్త్రముగాదె ,కల్యాణి నీ నోట కళ్యాణ శుభకారి ,
పాడుతా తీయగా అని పాడేవు అద్భుతముగా ,మరువ లేని మనీషీ ,మరలి రాని మహతీ .=ఓ ఘంటసాలా =
డిసెంబర్ నాలుగో తేదీ ఘంటసాల జయంతి లో పాడుటకు నేను రచించిన పాట.
.