aటీవల జన్యు శాస్త్రంలో పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నవి.మన దేశం కూడా ఇందులో అగ్రగామి గా ఉంది .ఒక వ్యక్తీ జేనోమ్ ని అంటే శరీర కణాలలో ఉండే ,వారసత్వాన్ని సంక్రమింప జేసే డి.యన్.ఎ .వంటి మాలిక్యూల్స్ ని కల్పి జేనోమ్ అంటారు.ఇప్పటికి ముప్పయి ఐదు వేలు జీన్స్ ని కనుగొన్నారు.వీటిని చిత్రించుట (మాపింగ్ )ద్వారా ఆ వ్యక్తీ కి సంక్రమించే వ్యాధులు,మధుమేహం ,రక్తపోటు ,కీల్లవాతం,కేన్సరు, మొదలైన వాటిని తెలుసుకొని ముందుగానే తగిన చర్యలు,జాగ్రతలు తీసుకోవచ్చును.ముందు కాలం లో ఈ జేనోమ్ సీక్వెన్సింగ్ అనే శాస్త్రం ఒక విలువైన పెద్ద పరిశ్రమ ఔతుంది అని అంటున్నారు.
31, అక్టోబర్ 2011, సోమవారం
30, అక్టోబర్ 2011, ఆదివారం
is the world better?
sankalini.org అవును అంటున్నారు కొందరు అమెరికన్ రచయితలు.తాత్కాలిక ఘటనల బట్టి గాక గత ౫౦ ఏళ్ళ దీర్ఘ చరిత్రను గణాంకాలను చూడమంటున్నారు.క్లుప్తంగా వారి వాదనలు ఇవి .
౧.వలస సామ్రాజ్యాలు అంతమై అన్ని దేశాలు స్వతంత్రమైనవి.
౨.చాలా దేశాల్లో నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం ఏర్పడింది.
౩.చిన్న యుద్ధాలు ,తిరుగుబాట్లు తప్ప పెద్దయుద్ధాలు జరగలేదు.
౪.మొత్తం మీద ప్రజల జీవన ప్రమాణం పెరిగింది.
౫.ఆధునిక సౌకర్యాలు దాదాపు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి.
౬.సగటు ఆయుప్రమాణం ౭౦ కి పెరిగింది.మాతా శిశు మరణాలు తగ్గాయి.
౭.అక్షరాస్యత ,సగటువిద్యా వృద్ధి చెందాయి.
౮.కొన్నిదేశాలలో తప్ప స్త్రీలకి సమానహక్కులు, స్వేచ్చ లభించాయి.
౯.శాస్త్ర విజ్ఞానం ,టెక్నాలజీ అద్భుతంగా పురోగమించాయి.
దీనికి వ్యతిరేకంగా పెర్యావరణం దెబ్బ తినడం .జనాభా ఎక్కువగా పెరగడం ,ఉగ్రవాదం, అణుntiయుద్ధ భయం ,మానవ సంబంధాల విచ్చిత్తి వంటివి ఉన్నాయని అంగీకరిస్తూనే మానవజాతి వాటిని అధిగమించగలదని అంటున్నారు.ఇంకా మంచి భవిష్యత్ కి పురోగామించాగాలమని ఆశా వాదం వెలి బుచ్చు తున్నారు
26, అక్టోబర్ 2011, బుధవారం
papa
నా పాపను నేను మళ్ళీ పెంచుతే.
-----------------------
నా పాపను నేను మళ్ళీ పెంచుతే
వేళ్ళకు రంగు పూస్తాను కాని ,నా తర్జని తో బెదరించను
సవరించడానికన్నా సమాధానానికి ప్రయత్నిస్తాను
గడియారాన్ని చూసే కన్నా కళ్ళతో పాపను కనిపెట్టుతాను
పాప గురించి ఎక్కువ తెలుసుకొనే కన్నా ,దాని క్షేమాన్ని బాగా తెలుసుకొంటాను
పాపతో బాగా విహరిస్తాను గాలిపటాలను ఎక్కువ ఎగరేస్తాను
జాగ్రతలు కఠినంగా తీసుకొనే కన్నా ,జాగ్రతగా పాపతో ఆడుకొంటాను
చక్కని తోటల్లో తిరుగుతాము ,చుక్కల్ని చూసి ఆనందిస్తాము
ఎక్కువ చేరదీసి కౌగలిస్తాను ,తక్కువ వెనక్కి లాగుతాను
స్వల్పంగా కఠినత్వం వహిస్తాను, అధికంగా ఆమోదిస్తాను
మొదట ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాను, పిదప ఆత్మ గృహాన్ని నిర్మిస్తాను
అధికారంపై మమకారాన్ని తక్కువ చేస్తాను
మమకారపు శక్తి గూర్చి అధికంగా బోధిస్తాను. free translation of Diane Loomans 'Full esteem ahead
papa
నా పాపను నేను మళ్ళీ పెంచుతే.
-----------------------
నా పాపను నేను మళ్ళీ పెంచుతే
వేళ్ళకు రంగు పూస్తాను కాని ,నా తర్జని తో బెదరించను
సవరించడానికన్నా సమాధానానికి ప్రయత్నిస్తాను
గడియారాన్ని చూసే కన్నా కళ్ళతో పాపను కనిపెట్టుతాను
పాప గురించి ఎక్కువ తెలుసుకొనే కన్నా ,దాని క్షేమాన్ని బాగా తెలుసుకొంటాను
పాపతో బాగా విహరిస్తాను గాలిపటాలను ఎక్కువ ఎగరేస్తాను
జాగ్రతలు కఠినంగా తీసుకొనే కన్నా ,జాగ్రతగా పాపతో ఆడుకొంటాను
చక్కని తోటల్లో తిరుగుతాము ,చుక్కల్ని చూసి ఆనందిస్తాము
ఎక్కువ చేరదీసి కౌగలిస్తాను ,తక్కువ వెనక్కి లాగుతాను
స్వల్పంగా కఠినత్వం వహిస్తాను, అధికంగా ఆమోదిస్తాను
మొదట ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాను, పిదప ఆత్మ గృహాన్ని నిర్మిస్తాను
అధికారంపై మమకారాన్ని తక్కువ చేస్తాను
మమకారపు శక్తి గూర్చి అధికంగా బోధిస్తాను.
21, అక్టోబర్ 2011, శుక్రవారం
dattapadi
క్రాంతి పథంమున జనుడీ
భ్రాంతిని త్యజియించి విప్లవానల సి ఖలన్
కాంతిని జిమ్ముచు సతతము
శ్రాన్తిని బొందక శ్రమించు సాహసులారా .
13, అక్టోబర్ 2011, గురువారం
silalu
రాయి రాయి రాపాడ రవ్వలే పైకెగయు
రాయి రాయి అతికిన రాజ భవనంమౌను
ఉలికి ఒదిగి ఒదిగి ఉప్పొంగు నా శిలలు
శిల్ప సుందరి జూచి ప్రేమించే పిగ్మాలియన్
పాషాణ హృదయమని పరుషమ్ము లాడే దవు
పాషా ణ మున దాగి ప్రవహించు జలధార
కష్టించి చెమటోడ్చి కట్టిరి శిలలతో
మానవు లేన్నెన్నో మహనీయ హర్మ్యాలు
కక్ష తో నవి ఎన్నో కాల్చి కూల్చిరి వారే
అతి విచిత్రపు జీవు లవని నీ మనుజులే
--------------
12, అక్టోబర్ 2011, బుధవారం
samasya pooranam
కార్యము లెల్ల సక్రమము గా సరి జేసి కొనంగ నాపయిన్
'శౌర్య'యనెండి చిత్రమును చక్కగ జూడగ జాల వేడుకన్
భార్యను గూడి యిల్వేడల పశ్చిమ దిక్కున నస్తమిన్చగా
సూర్యుడు ; చంద్రుడున్ బొడమే చుక్కలు పెక్కులు నిక్కు చుండగన్ .
11, అక్టోబర్ 2011, మంగళవారం
10, అక్టోబర్ 2011, సోమవారం
new poem
నరునకు పరమాత్ముడు దయ
సిరులెల్ల యొసంగి పంపే ,ధరణికి; ఐనన్
అరిషడ్ వర్గమ్ములచే
నరకమ్ము గ జేసి కొనియె నా స్వర్గమ్మున్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)