sankalini.org అవును అంటున్నారు కొందరు అమెరికన్ రచయితలు.తాత్కాలిక ఘటనల బట్టి గాక గత ౫౦ ఏళ్ళ దీర్ఘ చరిత్రను గణాంకాలను చూడమంటున్నారు.క్లుప్తంగా వారి వాదనలు ఇవి .
౧.వలస సామ్రాజ్యాలు అంతమై అన్ని దేశాలు స్వతంత్రమైనవి.
౨.చాలా దేశాల్లో నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం ఏర్పడింది.
౩.చిన్న యుద్ధాలు ,తిరుగుబాట్లు తప్ప పెద్దయుద్ధాలు జరగలేదు.
౪.మొత్తం మీద ప్రజల జీవన ప్రమాణం పెరిగింది.
౫.ఆధునిక సౌకర్యాలు దాదాపు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి.
౬.సగటు ఆయుప్రమాణం ౭౦ కి పెరిగింది.మాతా శిశు మరణాలు తగ్గాయి.
౭.అక్షరాస్యత ,సగటువిద్యా వృద్ధి చెందాయి.
౮.కొన్నిదేశాలలో తప్ప స్త్రీలకి సమానహక్కులు, స్వేచ్చ లభించాయి.
౯.శాస్త్ర విజ్ఞానం ,టెక్నాలజీ అద్భుతంగా పురోగమించాయి.
దీనికి వ్యతిరేకంగా పెర్యావరణం దెబ్బ తినడం .జనాభా ఎక్కువగా పెరగడం ,ఉగ్రవాదం, అణుntiయుద్ధ భయం ,మానవ సంబంధాల విచ్చిత్తి వంటివి ఉన్నాయని అంగీకరిస్తూనే మానవజాతి వాటిని అధిగమించగలదని అంటున్నారు.ఇంకా మంచి భవిష్యత్ కి పురోగామించాగాలమని ఆశా వాదం వెలి బుచ్చు తున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి