శ్రీకాకుళం జిల్లాలో దర్సనీయస్తలాలు.౧,అరసవల్లి -సూర్యనారాయణ స్వామి దేవాలయం.వెయ్యేళ్ళ చరిత్ర కలది.౨కూర్మం -శ్రీ కూర్మనాధ స్వామి దేవాలయం.వెయ్యేళ్ళ చరిత్ర కలది.దేశంలో కూర్మావతారంకి ఇదొక్కటే ఆలయం .౩.ముఖలింగం -పూర్వం కళింగసామ్రాజ్యానికి రాజధాని.శ్రీ ముఖ లింగేశ్వరదేవాలయం చాలా ప్రాచీనమైనది.పన్నెండు వందల ఏళ్ల చరిత్ర కలది.౪శాలిహుండం -రెండువేల ఏళ్ల నాటి బౌద్ధ స్తూప శిధిలాలు ఒక కొండ పై ఉన్నవి ౫.ప్రక్రతి .సౌందర్యానికి ఉద్దానం ప్రాంతం ,మహేంద్రగిరి ,కళింగ పట్నం బీచ్ చూడదగినవి. ౬.కొవ్వాడ దగ్గర పెద్ద అణుశక్తి కర్మాగారము ,కళింగ పట్నం రేవునిర్మాణం జరగబోవుచున్నవి.ఇంకా చాలా ఉన్నవి .మరొకసారితెలియ జేస్తాను.
30, జూన్ 2011, గురువారం
29, జూన్ 2011, బుధవారం
డా.భోగరాజు పట్టాబి సీతారామయ్య
డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆయన పూర్తీ పేరు.అందరూ పట్టాభి అనే వారు.టంగుటూరి ప్రకాశం వలె మాస్లీడర్ కాకపోయినా ఆనాటి కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యుడు .ఇంటర్నెట్ లో ఆయన గురించి సమాచారం సరిగా Iలేదు.నాకుతెలిసిన సంగతులు క్లుప్తంగా వివరిస్తాను.
1..ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జల ఉష అనే నౌకను లాంచ్ చెయ్యడానికి విశాఖపట్నం వచ్చి నప్పుడు ఆంద్ర యూనివర్సిటీ లో సభ జరిగింది.అప్పుడు.నేను ఆయనను చూసాను.ఎర్రగా ,కొంచెం పొట్టిగా ఉండేవారు
.2 .ఆయన మెడికల్ డాక్టరు అయినా రాజకీయాల్లో మునిగి తేలే వారు
3.అఖిల భారత కాంగ్రెస్స్ వర్కింగ్ కమిటీలో సభ్యుడు
.4.ఒక సారి అ. భా.కాంగ్రెస్ అధ్యక్షుడు అయినారు
5.తెలుగు లోను ,ఇంగ్లీషు లోను గొప్ప వక్త .
6.1939కాంగ్రెస్ అధ్యక్షపదవికి నేతాజీ సుభాస్ చంద్ర బోసు తో పోటీ చేసి ఓడిపోయారు .గాంధీజీ పట్టాభి ఓటమి నా ఓటమి అన్నారు.తీవ్ర వాదిఅయిన బోసు కాంగ్రెస్ నుంచి వేరే విడిపోయి వేరేఫార్ వర్డ్ బ్లాక్ అనేపార్టీ స్థాపించారు.
7..అన్నిటి కన్నా ముఖ్యం ,పట్టాభి గారు దేశీయ సంస్థలను ఎన్నిటినో స్థాపించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి :ఆంధ్రాబ్యాంకు ,ఆంధ్రా ఉ.సైంటిఫిక్ కంపెనీ .ఆంధ్ర ఇంస్యూరెన్స్ కంపెనీ .కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ మొదలైనవి.
8..స్వరాజ్య ఉద్యమాలు లో పాలుగొన్నారు
9.స్వతంత్రం వచ్చాక రాష్ట్ర గవర్నర్గా పని చేసారు.
జల ఉష

డా.భోగారాజు
జల ఉష
ఇంకా వివరాలు తెలిసిన వారు రాస్తే సంతోషిస్తాను.
28, జూన్ 2011, మంగళవారం
కోన సీమ
కుల్యతటినీ తటాకవికసిత కుముద వనజ పుష్పనికాయము
మగువ పొలుపు మరియు మగరాయు సౌరు
చేరి సగము చేరి చెలువంపు శిల్పమ్ము
మోహినీ రూప సమ్మోహన మూర్తి
దక్ష వాటికా హరనాధ దైవాలయం
చాళుక్య సామ్రాజ్య చారిత్ర వైభవం -ఆదికావ్య రచనావిశేష యాగం
కవిసార్వభౌమ కావ్య వందిత దేశం -కందుకూరి సంస్కరణాభి నివేశం
సంగీత సాహిత్య సంస్కృతీ సమాహారం
ఆంద్ర మాత గళాలంకృత మణిహారం
అతిమనోహరం ఈ సీమ కోనసీమ -గోదావరీ పావనోదకప్లావితం ఈ సీమ కోనసీమ .
My Medical dictionary
I have written English--Telugu medical comprehensive dictionary.It has been printed and published and ABADmarketed by;- PARAS MEDICAL BOOKS Pvt.Ltd.; 5-1-473; Putlibowli; P.O.Box No.544.: HYDERABAD--500 095 A.P.(INDIA) Tel.no.(040)24600869 , 66821071
నేను రచించిన ఇంగ్లీషు -తెలుగు సమగ్ర వైద్య నిఘంటువు పూర్తి అయినది. దానిని పారాస్ మెడికల్ బుక్స్ వారు హైదరాబాదు , ప్రచురించారు.మార్కెట్ లోవిడుదల చేసారు.వారి చిరునామా ,ఫోను నంబరు పైన ఇచ్చాను.
పుస్తకం వెల ;రూ.100
27, జూన్ 2011, సోమవారం
26, జూన్ 2011, ఆదివారం
24, జూన్ 2011, శుక్రవారం
కళా వాచస్పతి కొంగర జగ్గయ్య
శ్రీ కొంగర జగ్గయ్య గారు మంచి నటులే కాక గొప్ప సాహిత్యవేత్త,రాజకీయవేత్త ,కవి ,మేధావి.పద్మ భూషణ్ బిరుదాంకితుడు. ఆ రోజుల్లో రవీంద్ర నాథ్ టాకూర్ కవిత్వ ప్రభావంతెలుగు కవులపై విశేషంగాఉండేది.రాయప్రోలు కృష్ణశాస్త్రి ,చలం ,బెజావాడ గోపాలరెడ్డి వంటి వారి మీద బాగా ఉండింది.౧౯౧౩లొ రవీంద్రునికి నోబెల్ బహుమతి గీతాంజలి కావ్యానికి వచ్చింది.తరువాత చాలామంది దానిని తెలుగు లోకి అనువదిన్చేరు.కాని జగ్గయ్యగారు గీతాంజలి లోని కవితలే కాదు.విశ్వకవి ఇతర కావ్యాల నుండి కూడా కవితలు ఎన్నుకొని రవీంద్ర గీత అనే పేరుతొ త్తెలుగులో పద్య రూపంలో చక్కటి గ్రాంధిక భాషలో రచించారు.రవీంద్రుడు గీతాంజలి కాక ఎన్నో ఇతర రచనలు చేసాడు వాటిలో కొన్ని సంధ్యా సంగీత ,ప్రభాత్ సంగీత ,చిత్ర, కాడి ఓ కోమల్. కల్పనా,నైవేద్య ,లిపిక,శ్యామలి ,శేష లేఖ ,మొదలైనవి.వాటి లో మంచి గీతాలు కొన్ని ఎన్నుకొని జగ్గయ్య ఈ రవీంద్ర గీత రస భరితంగా ,భావ స్ఫోరకం గా రచించారు.వివరంగా మరోసారి చెప్పుకుందాము.ఒక్క ఉదా హరణ మాత్రం ఇస్తాను.:"మూడు ప్రొద్దుల చెమ్మట లోదిగిల్ల--పదము పాడుచు నేల దున్నేదము మేము, --మా కరంములు లోహసలాక లయ్యు,==మా మనమ్ములు మవ్వపు మండసములు ..'
శ్రీ కొంగర జగ్గయ్య తెలుగుసినిమా నటుడిగా ప్రసిద్ధుడు. అంతకు ముందు రేడియోలో తెలుగు వార్తల అనౌన్సర్ గా కొందరికి తెలిసిఉండ వచ్చును.కవిగా చాలా కొద్దిమందికేతెలిసిఉంటుంది. ఆయన రవీంద్రనాథఠాకూర్ కవితలని ,చక్కటి పద్యాలలో తెలుగులొకి అనువదించారు.వాటిని గురించి మళ్ళీ ప్రస్తావిస్తాను. జగ్గయ్య గారి మాటల్లోనే "రవీంద్రులు ప్రకృతి ,సౌందర్య ,ఆరాధకులు .ఆయన కవితా జీవితంలో వివిధ దశలకు ప్రాతినిధ్యం వహించే రీతిలో 53 సంపుటాల నుండి 138 కవితలను అనువాదానికి ఎన్నుకొన్నాను." "సంవేదన ,సంగీతము ,ఊహా చిత్రణ ,వీటి త్రివేణీ సంగమమే రవీంద్రుని .కవిత్వం.మాధుర్యం ,లయ, దానికి సహజమైన ఆభరణాలు."అని హుమాయూన్ కబీర్ పేర్కొన్నారు.ఈ అనువాద మంతటికీ కవి తేటగీతి పద్యాన్నే ఎన్నుకొన్నారు.
ఈ రవీంద్ర గీతలోని అరడజను పద్యాల్లో కొన్ని చరణాలు మాత్రమె ఉదహరిస్తాను.వాటిని బట్టి పాఠకులు అనువాదకుని పాండిత్యం, భాషాపటిమ ,కవితా ప్రాశస్త్యం చవి చూడవచ్చును
1.కలల లోకం నుండి వాస్తవ జగత్తుకి రమ్మని ఉద్బోధ : "అపర సంధ్యల స్వప్నమ్ములల్లుకొనక --నెచ్చెలీ రమ్ముదిగి రమ్ము నేలపైకి --రమ్ము సామాన్య జనజీవితమ్ము గనుము "—(మరీచిక ,కాడి -ఓ కోమల్ -నుండి )
2.హేవాకము -కావ్య గ్రంధావళి నుండి (హేవాకమంటే తెలివి ,,లేక,ప్రౌఢిమ అనిఅర్థం )"నన్ను ముంచెత్తు ఈ స్వాదు నాద మేదియో -ఏనెరుంగుదు నా హృదయ మెరుగు "ఈ బృహద్గీత మెట్టిదో ,ఎపుడు దీని -నాలపించేది ఎవ్వరోయా రహస్య -మేనేరుంగుదు నా హృదయ మెరుగు." (హృదయం లో మోగే ఆత్మసంగీతం గురించి. )
౩.దేశకల్యాణం -నైవేద్య నుంచి --ఇది బాగా ప్రసిద్ధి పొందిన గేయం."ఎచట భయ శంకలను బుద్ధి ఎరుగకుండు -ఎచట తల ఎత్తి నిలబడు నేపు కలుగు - ఎచట జ్ఞానమ్మబాధమై ఎసగు చుండు --"అట్టి స్వేచ్చామయ స్వర్గమందు దండ్రి -నాదు దేశమ్ముమేల్కొనంగానిమ్ము.-(రవీంద్రుడు స్వతంత్ర భారతావని ఎలాఉండాలో ఊహించి రాసినది.)
4. దురభిమానం మతహింస గురించి 'మతము పేరుతొభ్రాంతితో మసలువాడు-చంప జావంగ వెరవాడే క్షణమునండు" 'వాడు నిజమయిన ద్రోహి 'అంటారు
5. ఒక కార్మిక కాంత గురించి ఇలా రాసారు."నిండు చామనపు మేను ,ముదురు చెంగావి వన్నియ ముతుక ఛీర గట్టిన పేదరాలు "అంటూ "ప్రియ జనశ్రేయమునకు నిర్దేస్యమైన-యామె సేవలనిటు కూలి యాస చూపి -దోచుకోనుకుంటి " అని చింతిస్తారు. -పశ్చాత్తాపము -వీదికలో
6.ఆఫ్రికా ఖండం ,పత్రపుట్ లో ఆ ఖండపు దురవస్థ గురించి ఇలా అంటారు.వ్యాఘ్ర దంష్ట్రల క్రౌర్యమ్ము.నిబిడ వన తమిస్రమ్ముమించు గర్వమ్ము పెనయ జాటుమాటుగా జేరిన వేట గాండ్రు కొల్ల గొట్టిరి నీ బైసి కుళ్ళగించి." "తావక నిగూఢ పధప్రశాంతి.-రక్త బాష్పప్రవాహ సంసిక్త మయ్యే ." అని ఆఫ్రికా గురించి తన ఆవేదన .వెళ్ళ బుచ్చారు.
7..౧౯౪౧లొ తన మరణం కి౩నెలలముందు కూడా ఆశావాదాన్ని విడువకుండా రచించిన రవీంద్రుని చివరి గేయం.
1941 లోప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. : "విస్మరిత జయాధ్వమున బునర్విక్రమించి --విగత మానవతాభూతి వేగ -గెలిచినరు డజేతవ్యుడై సదాపరిఢవిల్లు -పర్వ మేతించు ధర్మమ్ము పరిమళించు
కవిచంద్రుడు, కళా వాచస్పతి ,జగ్గయ్య గారికి నా నివాళి నర్పిస్తున్నాను.
20, జూన్ 2011, సోమవారం
కమనీయం: శ్రీకాకుళం - శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం
కమనీయం: శ్రీకాకుళం - శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం
Linked to Srikurmamtemple.com
19, జూన్ 2011, ఆదివారం
Robotic surgery
Imagine you are lying on a table in a hospital theatre.A robot is peering down at you with a knife in its hand ready to cut your abdomen. The picture is scary, is it not?But it is nolonger fiction but is becoming a fact.some expeienced and eminent surgeons have reported success in surgerieswith robots. y ou might have seen ROBO conducting a difficult delivery in the movie!But it will take many more years t o become a common practice.
Advantages: 1.Remote control surgery is possible 2.Greater precision and finesse will be possible.3.Lessertrauma and hospitalisation time.
Disadvantages: 1. High cost.At present cost of installation is in rupees 4 crores and cost of maintenance is forty lakhs per annum.2.Highly skilled and specially trained surgeons will be needed to control and operate the
system.3.patients may not have faith in the inhuman machine.4.Clinical judgement will still be with the human
surgeons.
anyway scientific progress will go on and it is for us to accept or reject according tomerits.Thecost may come down in futures as with all innovations. -ramanarao.muddu

17, జూన్ 2011, శుక్రవారం
శ్రీకాకుళం - శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం
www.srikurmamtemple.com www.srikurmamtemple.blogspot.com
శ్రీ కూర్మం దేవాలయం చాలాప్రాచీన మైనది.విష్ణు,పద్మ,పురాణాల్లో దీని ప్రస్తావన ఉన్నది, చారిత్రకంగా ఇప్పటి ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినది.కళింగరాజులు ,అనంతవర్మ చోడ గంగ దేవ ,( కీ.శ1134)అనంగ భీమ( కీ.శ1211)రాజుల శాసనాలు ఉన్నవి.ఈ దేవాలయాన్ని ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు ,చైతన్య ప్రభు,దర్శించారని అంటారు.ఈ ఆలయం కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నది.

1.విష్ణుమూర్తి కూర్మావతారానికి దేశంలో ఇదొక్కటే ఆలయం.
2. ఒక్క ఆలయానికే .రెండు ధ్వజ స్తంభాలు ఇక్కడే .ఉన్నాయి.
3 దుర్గాదేవిఇక్కడ వైష్ణవి రూపంలో ఉన్నది
.4. .కుడ్య చిత్రాలు ఉన్నకొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి
.5. శివాలయాన్ని వైష్ణవ ఆలయంగా మార్చేరని ఒక వాదన ఉన్నది. శివాలయంలో వలెనె దేవుడికి ప్రతి రోజు అభిషేకం జరుగుతుంది
.6..తాబేలు ఆకారంలో మూలవిరాట్టు ఒక పక్కగా ఉంటుంది. నిర్మాణము,శిల్పము. : ఆలయం కళింగ,దాక్షిణాత్య పద్ధతుల మేళవింపుతో నిర్మించబడినది.ప్రదక్షిణ పథంలో నూటఎనిమిది స్తంభాలు అలంకరణ ,శిల్పంలో ఒకదానితో మరొకటి పోలిక లేకుండాచక్కగా నిర్మించారు.స్తంభాలపైన, గోపురంపైన వివిధదేవతలు ,పురాణ కథలు, లతలు, పుష్పాలు మనోహరంగా చెక్కబడిఉన్నవి. గర్భ గుడి ముందు భోగ మంటపం, ఆస్థాన మంటపం, ఉన్నవి.గర్భగుడి మీద గోపురం ఐదు అంతస్తులుగా ఉన్నది.గుడి ముందు ఒకటి ,వెనుక మరొకటి ధ్వజస్తంభాలు ఉన్నవి.రెండవది పాడయిపొతే సినిమా నటుడు శ్రీహరి మళ్ళీ ప్రతిష్ఠించారుట.
శ్రీ కూర్మం ఫొటోలు కొన్ని చూడండి:

ఈ ఆలయం లో గోడల మీద అనేక గాథలు చిత్రింపబడి ఉన్నాయి.కాని కాలక్రమంలో అవి మాసిపోయిఉన్నవి .కృష్ణం వందే జగద్గురుం సంస్థ వారు విష్ణు గాథలను చక్కటి ఆయిల్ పెయింటింగ్స్ వేయించి గోడల కు తగిలించారు.ఇంకా అనేక విధాలుగా ఈ సంస్థవారు,దేవ దాయ శాఖ వారు,ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
16, జూన్ 2011, గురువారం
HelveTia
హెల్వెటియా,హెల్వెటియా!-చెల్వములొలికే స్వర్ణమయా,
ఇందుశీతల మందమారుత-మెందుచూసినకనువిందు చేసే
సుందరారణ్యసీమల-అందముల ప్రోవీ హెల్వెటియా
నీహారచేలావృతవిహారసీమల
రజతా అ రాజిత భ్రాజితో న్నత-నగరాజ భూమీ
హెల్వెటియా
అరుణ హరిత పత్ర పాళీ -భరిత ఘన భూరుహాళీ
సుమనికుంజప్రసవ -సుగంధ మత్తాళిపాళీ
సరసిజరభసరసీవినోద-జలవిహగాళీ
కాంచనోపమకబరీభరీ - కమనీయబాలా
రమణీమణీ - హెల్వెటియా ,హెల్వెటియా!
(హెల్వెటియా స్విట్జెర్ లాండ్ కి మరొ పేరు )
10, జూన్ 2011, శుక్రవారం
స్వర్గీయ నటరాజ రామ కృష్ణ గారికి నివాళి
శ్రీ నటరాజ రామకృష్ణ గారి గురించి రాయడానికి నాకు నృత్యం గురించి ఎక్కువగా తెలియదు. కాని ఒకటి ,రెండు
సంగతులు మాత్రం రాస్తాను .నేను మెడికల్ కాలేజిలో చదివేటప్పుడు ,మా క్లాస్మేట్ చలపతిరావు ఆయన దగ్గర
నృత్యం నేర్చుకొని ,కాలేజి ఫంక్షన్ లో ఆడవేషంతో "మొక్కజొన్నతోటలో"పాట అభినయించేవాడు.(1954 -55).
అప్పటికి మాస్టారికి ఇంకా అంతప్రసిద్ధి లేదు. వైజాగ్ లో ఉండేవారు.తరవాత 1980 ప్రాంతంలో మా అమ్మాయి అరంగేట్రం కి ఆయన రాలేకపోయినా, ఆశీర్వాదం పంపించేరు.మా మేనకోడలు ఆయన దగ్గర నృత్యం అభ్యసించింది.
ప్రఖ్యాత నర్తకులు ,పత్రికలూ, టి.వి.చానల్సు, ఆయనగురించి చెప్పినవి అంతాచూసి, చదివి ఉంటారు. కూచిపూడి
దేవదాసి,పేరిణి నృత్యాలకి ఆయన చేసినసేవ ,ఆంధ్ర నాట్యానికి ఆయన తెచ్చిన గుర్తింపు చిరస్మరణీయం. తెలుగు నటరాజుకు నివాళులు అర్పిస్తున్నాను.
రమణారావు.ముద్దు
రమణారావు.ముద్దు
2, జూన్ 2011, గురువారం
విశ్వనాథ వారి గురించి ... మరి కొంత
విశ్వనాథవారి గురించి క్లుప్తంగా :--౧.వేయిపడగలు నవల పూర్తిగా చదివాను .౨.రచయిత ప్రతిభను మెచ్చుకోవాలంటే
అతని లేక ఆమె అభిప్రాయాలుతో ఏకీభవించనవసరం లేదు. ౩.విశ్వనాథ సాంప్రదాయక ,ఫ్యూడల్ సమాజాన్ని
గ్రామీణ జీవనవిధానాన్ని సమర్థించిన విషయంమనకు తెలిసిందే.౪.ఏవ్యవస్థలోనైనాకొంత మంచి,కొంతచెడు
ఉంటుంది.౫..వేయిపడగలు నవల గోప్పతనమేమంటే ఏబయి,అరవయి సం:లో మన దేశంలో జరిగిన మార్పులు ,
సంఘటనలు ,ఒక గ్రామం చరిత్రలో ఇమిడ్చి వర్ణించాడు. విశాలమైన కేన్వాస్ మీద సంఘాన్ని చిత్రించారు.
ఎన్నో మౌలిక విషయాలు ఇందులో చర్చకు వస్తాయి. ఇంకాభాషా ,వర్ణనలు గొప్పగా ఉంటాయి.
౬.చెలియలికట్టలో స్త్రీ పురుష సంబంధాల్లో కొన్ని హద్దులను దాటకూడదని నిరూపిస్తాడు.౭.ఏకవీర ఒక మనోహరమైన
ప్రణయకావ్యం..౮.హాహాహూహూ ,అనే గంధర్వుడు రెక్కలకి దెబ్బ తగిలి భూమిమీద పడినాక జరిగిన ఘటనలు
తమాషాగా వర్ణించారు.వేటేరినరీసైన్సు రహస్యాలన్నీఈ నవల లో ఉంటాయి.౯.విశ్వనాధవారి విశ్వరూపంలో
ఈ నవలలు ఒక భాగం మాత్రమె.అయన కవిత్వం గురించి ఇప్పుడు ప్రస్తావించడం లేదు.౧౦.చలంరచనలనీ, విశ్వనాధ
రచనలనీ పోల్చలేము.వేటిగోప్పవాటిదే.౧౧.పురానవైరగ్రన్ధమాలలో మరుగునపడ్డ ప్రాచీన భారతచరిత్ర గురించి ,
చరిత్ర, కల్పనా మేళవించి రచించిన నవలామాలిక.
చలం స్త్రీ విముక్తికోసం ,సమాజంలో ప్రేమ ,కొత్తదనం ,సమానత్వం కోసం రచనలు సాగించాడు. విశ్వనాధ
మన సంస్కృతిలో గొప్పతనం ,శాశ్వతమైన విలువల గురించి రాసాడు. ====రమణారావు .ముద్దు
మరొక పద్యం
జేగంట
--------- శారద విభాత మారుత శైత్య వీచి
పతిత పారిజాతకుసుమ పరిమళమ్ము
గ్రామ మందిరమందు జేగంట మ్రోత
హృదయమున మధు రసమావహించే నిపుడు.
-------------------------------------
armed,and dangerous
మారణాయుధాలు ;
-------------------------------------టీ.వీ.లో వార్తలుచూస్తుంటే తరుచు రెండు ముఠాలు కొత్త కొత్త ఆయుధాలతో
పోరాడుతూ ఒకరినొకరు నాశనం చేసుకొంటూ ఉండటం కనిపిస్తుంది. వీళ్ళకీ ఆయుధాలన్నీ ఎలా వస్తున్నాయని
నాకు అనుమానం కలుగుతుంది.అమెరికాయే మిగతా పెద్ద దేశాలకన్నాఎక్కువ సప్లయిచే స్తున్నాది. ఇందులో
రహస్యమేమీ లేదు.కాని అభిజ్న వర్గాల ద్వారా తెలుసుకొన్న రహస్యమేమంటే ;పెంటగాన్ ఏనగరాన్నైనా పూర్తిగా
నాశనం చేసే ఆయుధాల్ని అమ్ముతుంది.స్టేట్ డిపార్ట్మెంట్ కర్తవ్యమేమంటే ఆ మంటల్ని ఆర్పడం.ప్రభుత్వంలోనే
భాగమైన ఈ రెండు శాఖలూ పరస్పర విరుద్ధంగా పని చేస్తూఉంటాయి !వీళ్ళమద్యసంభాషణ ఇలాఉంటుందని
ఊహించి రాస్తున్నాను.
విదేశాంగ శాఖ డేప్యుతి సెక్రెటరి (స్టేట్ డిపార్ట్మెంట్)--"దిన్డిమారిపబ్లిక్ లో ప్రత్యర్థి వర్గాలమధ్య మేము శాంతి
స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాము.ఇరు వర్గాల దగ్గరా ఆయుధాలుఐపోవస్థాపన చ్చాయి కాబట్టి అందరూ శాంతి
సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు దిన్డిమా ప్రభుత్వ సైన్యానికీశాంతి రెండు మిలియన్ డాలర్ల బాంబులు
మేషిన్గాన్నులుఅమ్మబోతున్నారట.ఇలా ఐతే ఎలా ?మూడేళ్ళనుంచిమేము సాంతిస్తాపనకోసం ప్రయత్నం
చేస్తున్నాము.ఇద్దరిదగ్గర ఆయుధాలు ఖర్చాయి పోడంచేత ఇప్పుడు సంధికి ఒప్పుకోన్నారు.మీరిలాచేస్తే ఎలా?
సై.డి."ఇంకా నయం .చిన్న అణు అస్త్రాలు కావాలన్నారు.మనపాలసీకి విరుద్ధం కాబట్టి గంసు, బాంబ్స్ మాత్రం ఇచ్చాము."-వి.డి. "ఐతే అక్కడ మళ్ళీ భాగ్గుమనిపిస్తారా ?"
సై.డి. ""మీ శాంతి ప్రయత్నాలకి అడ్డు రాము. మా పని మేము చేసుకుపోతూ ఉంటాము.
మాదగ్గరఆయుధాలన్నీ అమ్మడం ,కొత్తవి తయారు చేసుకోడం మావిధానం.లేకపోతె అమెరికా థర్డ్ రేట్
పవర్ అయిపోదూ?'-వి.డి. "ఇటీవల మీరు వెస్ట్ ఆసియాలో ఎక్కువ విలువైన ఆయుధాలు, పరికరాలు,
ఎందుకమ్మారు?అక్కడ ఉద్రిక్తత పెరిగిపోతుంది కదా."
సై.డి.-"తెలివితక్కువ ప్రశ్నలు వెయ్యకండి. ఎవరెక్కువ నగదు ఇవ్వగలిగితే వారికి అమ్మడమే మా విధానం.'
"ఇరాక్ కి కూడానా?'-'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి."
వి.డి.సె."మేమిక్కడ అనుకొంటున్నాము.చైనాకి ఫైటర్విమానాలుఅమ్మితే ఇన్దియాతో మన సంబంధాలు
దెబ్బతిన వచ్చును. చివరికి మనం కలగజేసుకొని బంగ్లాదేశ్కి మన సైన్యాలు పంపించ వలసి రావచ్చును
".మీరేమనుకొన్నా ఫరవా లేదు.మన ఆయుధాలు కొనుక్కొనే వాళ్ళే మన మిత్రులు.వాళ్ళకే మనం సాయం
చెయ్యాలి.ఎదటి వాళ్లకి కాదు.'--- "ఎదటి వాళ్ళంటే ఎవరు ?"
"గతంలో మనదdగ్గర హెలికాప్టర్లు కొనుక్కొన్నవాళ్ళు!"
(ఆర్ట్ బుఖ్ వాల్డ్ "ఆర్మ్డ్ అండ్ డేంజరస్ "ని అనుసరించి.)
1, జూన్ 2011, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)