24, జూన్ 2011, శుక్రవారం

కళా వాచస్పతి కొంగర జగ్గయ్య

శ్రీ కొంగర జగ్గయ్య గారు మంచి నటులే కాక  గొప్ప సాహిత్యవేత్త,రాజకీయవేత్త ,కవి ,మేధావి.పద్మ భూషణ్  బిరుదాంకితుడు. ఆ రోజుల్లో రవీంద్ర నాథ్ టాకూర్  కవిత్వ ప్రభావంతెలుగు కవులపై  విశేషంగాఉండేది.రాయప్రోలు   కృష్ణశాస్త్రి ,చలం ,బెజావాడ గోపాలరెడ్డి వంటి వారి మీద  బాగా ఉండింది.౧౯౧౩లొ రవీంద్రునికి నోబెల్ బహుమతి గీతాంజలి కావ్యానికి వచ్చింది.తరువాత చాలామంది దానిని తెలుగు లోకి అనువదిన్చేరు.కాని జగ్గయ్యగారు గీతాంజలి లోని కవితలే కాదు.విశ్వకవి ఇతర కావ్యాల నుండి కూడా కవితలు ఎన్నుకొని రవీంద్ర గీత అనే పేరుతొ త్తెలుగులో పద్య రూపంలో చక్కటి గ్రాంధిక భాషలో రచించారు.రవీంద్రుడు గీతాంజలి కాక  ఎన్నో ఇతర రచనలు చేసాడు వాటిలో కొన్ని సంధ్యా సంగీత ,ప్రభాత్ సంగీత ,చిత్ర, కాడి ఓ కోమల్. కల్పనా,నైవేద్య  ,లిపిక,శ్యామలి ,శేష లేఖ ,మొదలైనవి.వాటి లో మంచి  గీతాలు కొన్ని ఎన్నుకొని జగ్గయ్య ఈ రవీంద్ర గీత రస భరితంగా ,భావ స్ఫోరకం గా రచించారు.వివరంగా  మరోసారి  చెప్పుకుందాము.ఒక్క ఉదా హరణ మాత్రం ఇస్తాను.:"మూడు ప్రొద్దుల చెమ్మట లోదిగిల్ల--పదము పాడుచు నేల దున్నేదము మేము, --మా కరంములు  లోహసలాక లయ్యు,==మా మనమ్ములు  మవ్వపు మండసములు ..'

శ్రీ కొంగర జగ్గయ్య తెలుగుసినిమా నటుడిగా ప్రసిద్ధుడు. అంతకు ముందు రేడియోలో తెలుగు వార్తల అనౌన్సర్ గా కొందరికి తెలిసిఉండ వచ్చును.కవిగా చాలా కొద్దిమందికేతెలిసిఉంటుంది. ఆయన రవీంద్రనాథఠాకూర్ కవితలని ,చక్కటి పద్యాలలో తెలుగులొకి అనువదించారు.వాటిని గురించి మళ్ళీ ప్రస్తావిస్తాను. జగ్గయ్య గారి  మాటల్లోనే "రవీంద్రులు ప్రకృతి ,సౌందర్య ,ఆరాధకులు .ఆయన కవితా జీవితంలో వివిధ దశలకు ప్రాతినిధ్యం వహించే రీతిలో 53 సంపుటాల నుండి 138 కవితలను అనువాదానికి ఎన్నుకొన్నాను." "సంవేదన ,సంగీతము ,ఊహా చిత్రణ ,వీటి  త్రివేణీ సంగమమే రవీంద్రుని .కవిత్వం.మాధుర్యం ,లయ, దానికి సహజమైన ఆభరణాలు."అని హుమాయూన్ కబీర్ పేర్కొన్నారు.ఈ అనువాద మంతటికీ  కవి తేటగీతి పద్యాన్నే ఎన్నుకొన్నారు.
 ఈ రవీంద్ర  గీతలోని అరడజను పద్యాల్లో కొన్ని చరణాలు మాత్రమె ఉదహరిస్తాను.వాటిని బట్టి పాఠకులు అనువాదకుని పాండిత్యం, భాషాపటిమ ,కవితా ప్రాశస్త్యం  చవి చూడవచ్చును  
1.కలల లోకం నుండి వాస్తవ జగత్తుకి రమ్మని ఉద్బోధ : "అపర సంధ్యల స్వప్నమ్ములల్లుకొనక --నెచ్చెలీ రమ్ముదిగి రమ్ము నేలపైకి --రమ్ము సామాన్య జనజీవితమ్ము గనుము "—(మరీచిక ,కాడి -ఓ కోమల్ -నుండి )
2.హేవాకము  -కావ్య గ్రంధావళి నుండి (హేవాకమంటే తెలివి ,,లేక,ప్రౌఢిమ అనిఅర్థం )"నన్ను ముంచెత్తు  ఈ స్వాదు నాద మేదియో -ఏనెరుంగుదు నా హృదయ  మెరుగు "ఈ బృహద్గీత మెట్టిదో ,ఎపుడు దీని -నాలపించేది ఎవ్వరోయా రహస్య -మేనేరుంగుదు నా హృదయ మెరుగు." (హృదయం లో మోగే ఆత్మసంగీతం గురించి.  )
౩.దేశకల్యాణం -నైవేద్య నుంచి --ఇది  బాగా ప్రసిద్ధి పొందిన  గేయం."ఎచట భయ శంకలను బుద్ధి ఎరుగకుండు -ఎచట తల ఎత్తి నిలబడు నేపు కలుగు - ఎచట జ్ఞానమ్మబాధమై ఎసగు చుండు --"అట్టి స్వేచ్చామయ స్వర్గమందు దండ్రి -నాదు దేశమ్ముమేల్కొనంగానిమ్ము.-(రవీంద్రుడు స్వతంత్ర భారతావని ఎలాఉండాలో ఊహించి రాసినది.)
4. దురభిమానం మతహింస గురించి 'మతము పేరుతొభ్రాంతితో  మసలువాడు-చంప  జావంగ వెరవాడే క్షణమునండు" 'వాడు నిజమయిన ద్రోహి 'అంటారు
5. ఒక కార్మిక కాంత గురించి ఇలా రాసారు."నిండు చామనపు మేను ,ముదురు చెంగావి వన్నియ ముతుక ఛీర గట్టిన పేదరాలు "అంటూ "ప్రియ జనశ్రేయమునకు నిర్దేస్యమైన-యామె   సేవలనిటు కూలి యాస చూపి -దోచుకోనుకుంటి " అని చింతిస్తారు. -పశ్చాత్తాపము -వీదికలో 
6.ఆఫ్రికా ఖండం ,పత్రపుట్ లో ఆ ఖండపు దురవస్థ గురించి ఇలా అంటారు.వ్యాఘ్ర దంష్ట్రల క్రౌర్యమ్ము.నిబిడ వన తమిస్రమ్ముమించు గర్వమ్ము పెనయ  జాటుమాటుగా జేరిన వేట గాండ్రు కొల్ల గొట్టిరి నీ బైసి కుళ్ళగించి." "తావక నిగూఢ పధప్రశాంతి.-రక్త బాష్పప్రవాహ సంసిక్త మయ్యే ." అని ఆఫ్రికా గురించి తన  ఆవేదన .వెళ్ళ బుచ్చారు.
7..౧౯౪౧లొ తన మరణం కి౩నెలలముందు కూడా ఆశావాదాన్ని  విడువకుండా రచించిన రవీంద్రుని చివరి గేయం. 
1941 లోప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. : "విస్మరిత జయాధ్వమున బునర్విక్రమించి --విగత మానవతాభూతి  వేగ -గెలిచినరు  డజేతవ్యుడై సదాపరిఢవిల్లు -పర్వ మేతించు ధర్మమ్ము పరిమళించు
   కవిచంద్రుడు, కళా వాచస్పతి ,జగ్గయ్య గారికి నా నివాళి నర్పిస్తున్నాను.



1 కామెంట్‌:

శశిధర్ పింగళి చెప్పారు...

మీ వ్యాసం బాగుంది మాష్టారూ. అయితే నా ఆకలి రెట్టింపయ్యింది. మీకభ్యంతరం లేకుంటే పుస్తకాలు గానీ అవి దొరికే విలాసం గానీ నాతో పంచుకుంటే సదా కృతజ్ఞణ్ణి.