మారణాయుధాలు ;
-------------------------------------టీ.వీ.లో వార్తలుచూస్తుంటే తరుచు రెండు ముఠాలు కొత్త కొత్త ఆయుధాలతో
పోరాడుతూ ఒకరినొకరు నాశనం చేసుకొంటూ ఉండటం కనిపిస్తుంది. వీళ్ళకీ ఆయుధాలన్నీ ఎలా వస్తున్నాయని
నాకు అనుమానం కలుగుతుంది.అమెరికాయే మిగతా పెద్ద దేశాలకన్నాఎక్కువ సప్లయిచే స్తున్నాది. ఇందులో
రహస్యమేమీ లేదు.కాని అభిజ్న వర్గాల ద్వారా తెలుసుకొన్న రహస్యమేమంటే ;పెంటగాన్ ఏనగరాన్నైనా పూర్తిగా
నాశనం చేసే ఆయుధాల్ని అమ్ముతుంది.స్టేట్ డిపార్ట్మెంట్ కర్తవ్యమేమంటే ఆ మంటల్ని ఆర్పడం.ప్రభుత్వంలోనే
భాగమైన ఈ రెండు శాఖలూ పరస్పర విరుద్ధంగా పని చేస్తూఉంటాయి !వీళ్ళమద్యసంభాషణ ఇలాఉంటుందని
ఊహించి రాస్తున్నాను.
విదేశాంగ శాఖ డేప్యుతి సెక్రెటరి (స్టేట్ డిపార్ట్మెంట్)--"దిన్డిమారిపబ్లిక్ లో ప్రత్యర్థి వర్గాలమధ్య మేము శాంతి
స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాము.ఇరు వర్గాల దగ్గరా ఆయుధాలుఐపోవస్థాపన చ్చాయి కాబట్టి అందరూ శాంతి
సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు దిన్డిమా ప్రభుత్వ సైన్యానికీశాంతి రెండు మిలియన్ డాలర్ల బాంబులు
మేషిన్గాన్నులుఅమ్మబోతున్నారట.ఇలా ఐతే ఎలా ?మూడేళ్ళనుంచిమేము సాంతిస్తాపనకోసం ప్రయత్నం
చేస్తున్నాము.ఇద్దరిదగ్గర ఆయుధాలు ఖర్చాయి పోడంచేత ఇప్పుడు సంధికి ఒప్పుకోన్నారు.మీరిలాచేస్తే ఎలా?
సై.డి."ఇంకా నయం .చిన్న అణు అస్త్రాలు కావాలన్నారు.మనపాలసీకి విరుద్ధం కాబట్టి గంసు, బాంబ్స్ మాత్రం ఇచ్చాము."-వి.డి. "ఐతే అక్కడ మళ్ళీ భాగ్గుమనిపిస్తారా ?"
సై.డి. ""మీ శాంతి ప్రయత్నాలకి అడ్డు రాము. మా పని మేము చేసుకుపోతూ ఉంటాము.
మాదగ్గరఆయుధాలన్నీ అమ్మడం ,కొత్తవి తయారు చేసుకోడం మావిధానం.లేకపోతె అమెరికా థర్డ్ రేట్
పవర్ అయిపోదూ?'-వి.డి. "ఇటీవల మీరు వెస్ట్ ఆసియాలో ఎక్కువ విలువైన ఆయుధాలు, పరికరాలు,
ఎందుకమ్మారు?అక్కడ ఉద్రిక్తత పెరిగిపోతుంది కదా."
సై.డి.-"తెలివితక్కువ ప్రశ్నలు వెయ్యకండి. ఎవరెక్కువ నగదు ఇవ్వగలిగితే వారికి అమ్మడమే మా విధానం.'
"ఇరాక్ కి కూడానా?'-'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి."
వి.డి.సె."మేమిక్కడ అనుకొంటున్నాము.చైనాకి ఫైటర్విమానాలుఅమ్మితే ఇన్దియాతో మన సంబంధాలు
దెబ్బతిన వచ్చును. చివరికి మనం కలగజేసుకొని బంగ్లాదేశ్‌కి మన సైన్యాలు పంపించ వలసి రావచ్చును
".మీరేమనుకొన్నా ఫరవా లేదు.మన ఆయుధాలు కొనుక్కొనే వాళ్ళే మన మిత్రులు.వాళ్ళకే మనం సాయం
చెయ్యాలి.ఎదటి వాళ్లకి కాదు.'--- "ఎదటి వాళ్ళంటే ఎవరు ?"
"గతంలో మనదdగ్గర హెలికాప్టర్లు కొనుక్కొన్నవాళ్ళు!"
(ఆర్ట్ బుఖ్ వాల్డ్ "ఆర్మ్డ్ అండ్ డేంజరస్ "ని అనుసరించి.)
1 కామెంట్:
మీ ఊహాత్మక రచన బాగుంది. ప్రపంచ పోలీసు దేశం వ్యవహారం అలాగే ఉంది మరి. అభినదంనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి