22, డిసెంబర్ 2014, సోమవారం
20, డిసెంబర్ 2014, శనివారం
Sri.D.V.Subbarao.
శ్రీ డి.వి.సుబ్బారావుగారి తో నాకు బాగా పరిచయముంది.ఆయన వివిధరంగాల్లో ప్రసిద్దికెక్కారు. న్యాయవాదిగా,క్రికెట్ అఫిషియల్గా,విశాఖ మేయర్గా వినుతిచెందారు.ముఖ్యంగా మేయర్గా విశాఖను సుందరంగా అభివృద్ధి చెయ్యడంలో ఆయన కృషి ప్రశంసనీయం.వ్యక్తిగా కూడా స్నేహశీలుడు,నిజాయితీపరుడు, మేధావి .ఆయన మరణవార్త నన్ను కలచివేసింది.అయనకు నా నివాళి, శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుకొంటున్నాను.
17, డిసెంబర్ 2014, బుధవారం
premature deaths
శీర్షిక
--------
ఈ మధ్య కొందరు ప్రముఖులు,సినీ,సాహితీ,రాజకీయ రంగాలలోవారు అకాల మృత్యువు బారిన పడుతున్నట్లు చదవడం కలవరపెడుతున్నది. ప్రసిద్ధులు కాకపోయినా ఇతర రంగాలలో కూడా ( వైద్యరంగంతోసహా) ఇలాగే జరుగుతున్నది.కర్మానుసారం జరుగుతుందనే మాట పక్కన పెడితే,మానవ ప్రయత్నాలు ఏం చెయ్యాలంటే;
1.40సం:దాటిన ప్రతి మనిషి ఏడాదికొకసారి మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
2.చెకప్ లో ఏవైన,అధిక రక్తపోటు మధుమేహలక్షణాలు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవాలి.
3.మద్యపానం,ధూమపానం మానివేయాలి.
4. డబ్బు సంపాదించాలి కాని దానికోసం ఆరోగ్యాన్ని బలిపెట్టకూడదు.
5.జీవితవిధానాన్ని life style ని తగిన విధంగా మార్చుకోవాలి. ఆహరనియంత్రణ,తగుమాత్రం వ్యాయామం అవసరం.
6.ముఖ్యంగా జబ్బుని దాచుకోకూడదు.జీవితభాగస్వామి,లేక దగ్గరి బంధువుల సహకారం తీసుకోవాలి.
11, డిసెంబర్ 2014, గురువారం
o,visakhaa!
విశాఖా!ఓ విశాఖా,నావిశాఖా!
----------------------
పసిప్రాయంలో నీ వడిలో పరుండితి,
నీలతరంగ హస్తాలతో నిమిరావు నన్ను.
ఎల జవ్వనములో కోరి వలచాను నిన్ను,
తరులతా కుంతలాల మురిపించావు నన్ను
సుందర విశాఖా!విలాసరేఖా!
నీ శైల కందరాలలో
సానుప్రదేశాలలో
సైకతచుంబిఫేనరాశుల్లో
సంధ్యామారుతసౌరభాల్లో
చంద్రోదయసువర్ణరోచుల్లో
అలలపై జలతారుదారుల్లో
ఉదయారుణజలదపంక్తుల్లో
ఆడియాడి అలసి నిదురించాను
సుందరవిశాఖా! విలాసరేఖా!
సుదూరంలో నౌకోపరితలం నుండి
నీహారదుకూలపరీవృతమైన
నీ తీర సౌభాగ్యాన్ని తిలకించినాను .
తిలకించి,తిలకించి పరవశించాను
సుందరవిశాఖా!విలాసరేఖా!
విశాఖా!,ఓ విశాఖా,నా విశాఖా!
22, నవంబర్ 2014, శనివారం
naming the Capital
ఇంతకు ముందొకసారి రాసాను.ఇప్పుడు మళ్ళీ రాజధాని పేరుగురించి పత్రికల్లో వేసారుకాబట్టి మళ్ళీ రాస్తున్నాను.NTR నగర్ అనిపేరుపెట్టాలని కొందరు మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది.దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. .కారణాలు ;;
1.యన్.టీఆర్.పేరు ఒక వర్గం వారిని,పార్టీ వారిని సంతృప్తి పరచవచ్చును.కాని చాలామంది ఇతరులకు ఇష్టపడదు.
2.NTR అని ఇంగ్లిష్ లో రాయవలసి వస్తుంది. అదీగాక ఒక వ్యక్తి పేరు పెట్టడమెందుకు?
3.కాబోయే రాజధాని పూర్వం ఆంధ్రదేశాన్ని 400 సం; పాలించిన ఆంధ్రశాతవాహన చక్రవర్తుల రాజధాని ఐన 'అమరావతి ' దగ్గరే. అందువల్ల మన కొత్త రాజధానికి 'అమరావతి ' అని పేరు పెట్టడమే సముచితంగా ఉంటుంది.ప్రజలంతా ఆవిధంగానే ప్రభుత్వాన్న్ డిమాండ్ చేస్తే బాగుంటుంది.
10, నవంబర్ 2014, సోమవారం
seemantam cheayistaam
గర్భిణీ స్త్రీలకు ఉచితవైద్య సేవలు అందిస్తాము.పోషకపదార్థాలని ఇస్తాము.ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా ప్రసవం చేయించి ,ఆడపిల్ల పుడితే ధనసహాయం చేస్తాం.ఇంతవరకు బాగానే ఉంది. కాని ప్రభుత్వం (చంద్రబాబునాయుడు హామీలు) గర్భిణీలకు సీమంతం ప్రభుత్వఖర్చుతో చేయిస్తామనడం చవకబారు ప్రజాకర్షణ పథకం కాదా?పెళ్ళిళ్ళు ,గర్భాదానాలు కూడా ప్రభుత్వఖజానాలోంచి ఖర్చుపెట్టి చేయిస్తారేమో!అధికారముందని ఇలాటి వ్యర్థపథకాల్ని ప్రవేశ పెట్టడమేనా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)