27, జనవరి 2014, సోమవారం

60 years of Indepedence -an assessment




  మన దేశం స్వతత్రమై 66ఏళ్ళు ,మొదటి గణతంత్రదినోత్సవం 63 ఏళ్ళు ఐనవి.ఈ సందర్భంలో  మనదేశం సాధించినదేమిటి   అని తర్కించుకోవాలి.ప్రభుత్వాలు,పార్టీలు,ప్రజలు అని కాకుండా మన జాతిమొత్తం సాధించినది బేరీజు వేసుకుంటే క్లుప్తంగా నాకు తోచినది రాస్తాను.అమెరికాలోఉన్న నా మిత్రులు ఇండియా  బాగా మారిపోయింది,అని అంటారు.ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల రిపోర్టుల ఆధారంగాను,మనం ప్రత్యక్షంగా  చూస్తున్న దాని ప్రకారము ఈ విషయాలు రాస్తున్నాను.
  1,వ్యవసాయరంగం ;- 3రెట్లు జనాభా పెరిగినా 5 రెట్లు వ్యవసాయౌత్పత్తులు పెరిగి కరువుకాటకలని నివారించాము.
  2.పారిశ్రామిక రంగం;- తాతా  ఉక్కుఫాక్టరీ తప్ప మరి పెద్ద పరిశ్రమలు లేని పరిస్థితి నుంచి ప్రపంచంలో ఒక  పెద్ద పారిశ్రామిక దేశాల్లో మనదేశం ఒకటైనది.
  3.అణుశక్తి,అంతరిక్షయానం ,వీటిలో 6అగ్రగామి దేశాల్లో ఒకటి ఐనాము.
  4.విద్య;-100కి 10 మంది విద్యావంతులున్న   స్థితినుంచి 100కి70 మంది చదువుకున్నవారి గా    అభివృద్ధి సాధించాము.ఉన్నతవిద్య, సాంకేతిక విద్య లో బాగా అభివృద్ధి  సాధించాము.information technology లో అగ్రస్థానంలో ఉన్నాము.
  5.వైద్యం,ఆరోగ్యం;- మశూచి ,ప్లేగు,కలరా,కుష్ఠు ,పోలియో  వంటి అంటురోగాల్ని నిర్మూలించగలిగాము.సగటు ఆయుప్రమాణం 30 సం;నుంచి దాదాపు 70 సం; కి పెరిగింది.
  6.జీవనవ్యయం బాగా పెరిగినా సగటు ఆదాయం కూదా అంతకన్నా పెరిగింది.ప్రజల జీవనప్రమాణాలు ,శైలి కూడా వృద్ధిపొందింది.
  7.infrastructure ,రోడ్లు,విద్యుత్ ఉత్పత్తి అందరికీ అందుబాటులో కి వచ్చాయి.
  8.అప్పటిలో 100కి 80 మంది దారిద్ర్యరేఖకు   దిగువలో ఉండేవారు.నేడు100కి 30మంది పేదరికంలో(3రెట్లు జనాభా పెరిగినా)ఉన్నారు.
  పై అంశాలని బట్టి మనం ఒకదేశంగా పాక్షికవిజయాల్నిమాత్రమే సాధించామని ఇంక చాలా కృషి చెయ్యాలని.సరి ఐన విధానాలతో ప్రభుత్వాలు (కేంద్ర,రాస్ట్రప్రభుత్వాలు) అన్నివర్గాల ప్రజలూ,పట్టుదలతో పనిచేస్తే,వచ్చే 20,లేక 30 సంవత్సరాలలో పూర్తి అభివృద్ధి  సాధించి ప్రపంచంలోని నాలుగు లేక ఐదు అగ్రరాజ్యాల్లో ఒకటిగా విలసిల్లుతామని  భావిస్తున్నాను.      

20, జనవరి 2014, సోమవారం

Sasi tharoor



 

  శశిథరూర్ (కేంద్ర సహాయమంత్రి)భార్య సునందాపుష్కర్ ఆత్మహత్య గురించి నిజానిజాలు ఏమైనా,పాకిస్తాన్ జర్నలిస్టు తో అతని సంబంధం గురించి నిజానిజాలు ఎలా ఉన్నా ,ఈ scandalవలన థరూర్ వెంటనే  మంత్రిపదవికి రాజీనామా చేయవలసిన నైతిక బాధ్యత ఉంది.అలా చేయకపోతే ప్రధానమంత్రి అతనిని తొలగించాలి.  

9, జనవరి 2014, గురువారం

aggipeTTelu




 ఇటీవల రైళ్ళలో అగ్నిప్రమాదాలు,బోగీలు మొత్తం కాలిపోయి ప్రయాణీకులుచనిపోవడం చూస్తున్నాము.ఎప్పుడో చాలా అరుదుగా జరుగుతే ఏమో కాని A.C.కంపార్ట్ మెంట్లు అగ్గిపెట్టెలై వాటిలో ప్రయాణం చేయడానికి భయం వేస్తున్నది.ఇంతజరుగుతున్నా రైల్వే శాఖ,ప్రభుత్వం స్పందించడంలేదు.నేను ఈ కింది సూచనలు వెంటనే అమలుజరుపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.1.ఒక నెల రోజులు A.C.సౌకర్యం ఆపివేయాలి.2.ఆ వ్యవధిలో అన్ని ఏ.సి.సిస్టెంస్ ని క్షుణ్ణంగా చెక్ చేసి లోపాలు సవరించాలి.3.అన్ని ఏ.సి.బోగీలకి emergency exits ఏర్పాటు చెయ్యలి.4.డ్రైవర్ కి రైలులో ఎక్కడ మంటలు రేగినా తెలిసే పద్ధతి ఏర్పాటు చెయ్యాలి.ఈ చర్యలు ఆలస్యం లేకుండా చేపట్టాలి.వీటిని A.C. బస్సులకి కూడా వర్తింపజేయాలి. 

6, జనవరి 2014, సోమవారం

tragedies in cine life.



 

 సినిమా నటుడు ఉదయకిరణ్ ఆత్మహత్య ఉదంతం చాలా బాధ కలిగించింది.పైకి ఎంతో గ్లామరస్ గా సంపన్నంగా కనబడే సినిమా ప్రపంచంలో ఎంతోకొంత ప్రాముఖ్యం సంపాదించుకున్న కొందరి జీవితాల్లో ట్రాజెడీలు  మనకు తెలిసిందే.చివరిదాకా ఆనందంగా,దర్జాగా బతికిన వారి సంఖ్య తక్కువే.ప్రముఖులసంగతే ఇలావుంటే ,చిన్నచిన్న వేషాలు వేసేవాళ్ళు,డాన్సర్లు,మొదలైనవాళ్ళ జీవితాల్లో ఎంత ట్రాజెడీలు దాగివున్నాయో కదా! 

16, డిసెంబర్ 2013, సోమవారం

A.P.division bill




 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు  ఇప్పుడు రాష్ట్ర శాసన సభ ముందుకు వచ్చింది కదా.అందులోని మంచిచెడ్డలేమైనా ,అందులో ఏమిఉందో వివరాలు ఏమీ తెలియడంలేదు.రాజకీయ నాయకులు.ప్రజా ప్రతినిధులు,పత్రికలు,టి.వి.మాధ్యమం చానెల్సు ఎవరూ ఏమీ
 చెప్పడం లేదు.బ్లాగరుమిత్రులెవరికైనా తెలిస్తే అందులోని ముఖ్యమైన అంశాలగురంచి (వివరంగా కాకపోయినా,సూత్రప్రాయంగానైనా) తెలియజేయమని కోరుతున్నాను.

9, డిసెంబర్ 2013, సోమవారం

bhagavatam


 

  ఈ మధ్య  ఈటి.వి. లో సాయంత్రం 6 గం;కి ప్రసారమయ్యే 'భాగవతం '(బాపు-రమణ దర్శకత్వం,సుమన్ సమర్పించిన)చూస్తున్నాను.బాగా తీసారు.పాత్రధారులు కూడా అందరూ బాగున్నారు.నేటి సినిమా రంగంలో పౌరాణిక చిత్రాలకి సరిపోయే నటీ నటులు లేరనిపిస్తుంది.కాని ఈ సీరియల్ చూస్తే టి.వి.లో అందుకు తగిన నటీనటులు ,ఉన్నారనిపిస్తుంది.అలాగే గాయనీగాయకులు,సంగీతదర్శకులు,సాంకేతిక సిబ్బంది కూడా ఉన్నారని  స్పష్టమౌతుంది.                  

5, డిసెంబర్ 2013, గురువారం

capital




  central cabinet నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ విభజన దాదాపు ఖాయమైనది కాబట్టి అనవసరమైన ఆందోళనలతో కాలం,శక్తి,వృథాచెయ్యకుండా అభివృద్ధి మీద కేంద్రీకరించడం మంచిది.అంతేకాదు; కృష్ణా,గుంటూరు వారు తమ అహంకారాన్ని,స్వార్థ బుద్ధిని విడిచిపెట్టి,రాష్ట్ర రాజధానిని రాయలసీమప్రాంతంలో ,కర్నూలులోగాని,ఒంగోలుప్రాంతంలో గాని చండీఘడ్ లాగ చక్కగా తీర్చి నిర్మించడానికి అంగీకరించడం మంచిది.లేకపోతే మళ్ళీ రాయలసీమలో  అసంతృప్తి కలుగుతుంది. అలాగే, విశాఖపట్నం ని పారిశ్రామీక,I.T.HUB గా అభివృద్ధిచేయవలసిఉంటుంది.