రెండు విషయాల గురించి గట్టిగా వ్రాయదలుచుకొన్నాను.
1.ఆంధ్రప్రదేష్ రాజధాని;మన రాజధాని గురించిస్థలనిర్ణయం జరిగిపోయింది .కాబట్టి పేరు కూడా నిర్ణయమైపోవాలి.అమరావతి 400సంవత్సరాల కాలం ప్రాచీన విశాల సామ్రాజ్యానికి రాజధాని.ఇంచుమించు ఆప్రదేశంలోనే ఇప్పుడు రాజధానిని నిర్మించబోతున్నారుకాబట్టి అమరావతి అనిపేరుపెట్టడమే సముచితం.ఏ వ్యక్తి పేరు పెట్టడం బాగుండదు. అమరావతే మనరాజధాని.
2.నవంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశావతరణ జరిగింది.ఆ తేదీనే మనం పండుగగా జరుపుకొంటున్నాము.జూన్ 2వతేదీన అందులో ఒకభాగం విడిపోయింది.ఆ తేదీని తెలంగాణా వారు జరుపుకోనిండి .మనరాష్ట్రావతరణ దినోత్సవం మాత్రం నవంబర్ 1వతారీకే.మార్చకూడదు.జూన్2 విషాదదినం.ఆరోజు జరుపుకోవడమేమిటి అర్థంలేకుండా.ఇలాంటి సలహాలు ప్రభుత్వానికి ఇచ్చిన కుహనామేధావులెవరు?
ఈ రెండు విషయాల గురించి ప్రజలుగట్టిగా అడగాలి.బ్లాగు మిత్రులనుంచి స్పందనలు,అభిప్రాయాలు కోరుతున్నాను.
2 కామెంట్‌లు:
మీరు ఇచ్చిన సలహా మంచిది. అమరావతి అన్న పేరు, ఆ ఊరి భూగోళ పరిసరాలు ఎన్నో విధాలుగా సరిపోతాయి.
ఒక బ్లాక్ దుర్దినాన్ని పండగ అని చెప్పి ఆంధ్రావాళ్ళ నెత్తిన రుద్దుతున్నారు చంద్రబాబు అండ్ కో. ఇదేదో తెలంగాణావాళ్ళతో సహానుభూతి కోసం చేసినట్లుంది తప్ప ఆంధ్రావాళ్ళ ఆత్మగౌరవాన్ని సూచించే విధంగా లేదు. ఎంతసేపూ తెలంగాణాలో కూడా మెప్పు కొట్టేద్దామన్న ఆలోచన, 2019 లో అక్కడ ఏదో సాధించాలన్న యావ తప్ప నాయుడికి ఆంధ్రావాళ్ళ మనోభావాల ధ్యాస ఏమైనా ఉందంటారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి