ముళ్ళపూడి రమణ గారు ఒకసారి రాసిన విషయం .ఆయన బాధపడినా ఏమీ అనలేక ఉండిపోయినట్లు కనిపిస్తుంది.' బాలే 'లాగ తీసిన కళాఖండం 'సీతాకళ్యాణం '
సినిమా ఇంగ్లాండు లో మంచి ప్రశంసలు పొందిన తర్వాత బాపు,రమణలు దాన్ని బిశ్వజిత్రాయ్ కి చూపించితే,అంతాచూసి ఆ రోజుల్లో పెర్షియన్ కార్పెట్లు లేవు అనేసి లేచి చక్కా వెళిపోయినట్లు రాసుకున్నారు.పాపం వీళ్ళు బాధ పడ్డా ఏమీ అనలేకపోయారు.ఆ పాయింటు మినహా మిగతా సినిమా అంతటిలోను,ఆయనకి బాగున్నవి ఒక్కటీ కనబడలేదా.ఇంగ్లండులో తనసినిమాలకన్నా గొప్ప ప్రశంసలు పొందినందుకు ఈర్ష్య అనుకోవాలా?ఒకోసారి గొప్పవాళ్ళు కూడా ఈర్ష్యా,అసూయలకి లోనవుతారనుకొంటాను.ఐనా రామాయణ కాలంలో తివాసీలు లేవని ఆయన ఎలా అనుకున్నారు?రత్నకంబళ్ళు గురించి మన కావ్యాలనిండా వర్ణనలు ఉన్నాయికదా.( తివాసీలు,పెర్షియాలోనేగాని మనదేశంలో తయారయేవి కాదని అంటారు.పూర్వకాలం నుంచి పారసీక దేశానికి చీనా దేశానికి,మన దేశానికి,వ్యాపారసంబంధాలు ఉండేవని చరిత్రలో తెలుస్తుంది.కాళిదాసు తన రఘువంశ ' కావ్యంలో శ్రీరామునికి పూర్వుడైన రఘుమహారాజు పారశీకదేశంపై దండెత్తి జయించినట్లు రాశాడు. అందువల్ల ఎవరికైనా విమర్శించేముందు చాలా జాగ్రత్త అవసరమనుకొంటాను.
2 కామెంట్‌లు:
free blogger templates www.ltemplates.com
ఈర్ష అలాగే ఉంటుంది కదా.
బిశ్వజిత్ "రాయ్" ఎవరు డాక్టరు గారూ? ఆ రోజుల్లో వెలిగిన హిందీ నటుడు బిశ్వజిత్తా? అతనయితే "రాయ్" కాదనుకుంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి