కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధాని నామకరణం గురించి వ్రాయదలిచాను.కొందరు దానిని N.T.R,నగర్ అని పేరు పెట్టమని సలహా ఇస్తున్నారు.కాని ఇది వాదవివాదాలకి ,కొంతమందికి అసంప్ తృప్తికి దారితీయగలదు.ఒక నాయకుడి పేరుపెట్టకుండా ,అందరికీ ఆమోద యోగ్యమైన నేను సూచించే పేరుని అందరూ పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను.
వందలసంవత్సరాలు ఆంధ్రదేశాన్ని అంతా పరిపాలించిన శాతవాహనచక్రవర్తుల రాజధాని ' అమరావతి ' .దానినే ' ఆంధ్రనగరి ' అనికూడా పిలిచేవారని చరిత్ర చెబుతున్నది.ఇంచుమించు ఆప్రాంతం లోనే రాజధానిని నెలకొల్పబోతున్నారు కాబట్టి కొత్త రాజధానిపేరు ' అమరావతి ' అనికాని ' ఆంధ్రనగరి ' అనికాని పెట్టితే బాగుంటుంది . నా అభిప్రాయంపై బ్లాగరు మిత్రుల చర్చను ఆహ్వానిస్తున్నాను.
6 కామెంట్‌లు:
well Said sir.
మీ ప్రయత్నం హర్సణీయం. మీరు సూచించిన రెండు పేర్లూ చాలా బాగున్నాయి. అయితే, నా మొదటి ఓటు అమరావతి అనే దానికేనండీ ..
అయినా, మన పిచ్చి కానీ, ఏలిన వారు ఇప్పటికే దేనికో ఫిక్స్ అయి పోయి ఉండరూ ? దేనికో ఏమిటి, NTRనగర్ అనే దానికే అయి ఉంటుంది.
ఆ కుందేలుకి ఎప్పుడూ మూడే కాళ్ళు ...
వేచి చూదాం ...
Amaravathi is a good one.
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండాలనేది చాలా దశాబ్దాల నాటి ప్రతిపాదనే. ఆ రోజుల్లో అనేక కారణాల వల్ల అది కుదరలేదు. ఎవరో కొద్దిమంది రాయలసీమవాళ్ళకి తప్ప శేషాంధ్ర రాష్ట్రంలో నూటికి 90 శాతం మందికి ఆ ప్రతిపాదనతో పేచీ ఏమీ లేదు. అయినా ఆ ప్రదేశాన్ని కులాభిమానంతోనే ఎంపిక చేస్తున్నారనే నింద నెదుర్కుంటోంది నాయుడు ప్రభుత్వం. కానీ ఆ ప్రదేశానికున్న బహుళప్రయోజనాల్ని బట్టి ఆ నిందని తిప్పికొట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎన్.టి.ఆర్.నగర్ అని పేరుపెడితే ప్రత్యర్థుల వాదనని బహిరంగంగా బలపరచినట్లవుతుంది. "Yes కులాభిమానంతోనే మేము ఇవన్నీ చేస్తున్నా"మని బాహాటంగా ఒప్పేసుకోవడమవుతుంది. కాబట్టి కొత్తరాజధానికి ఎన్.టి.ఆర్. పేరు తగిలించడం లాంటి అప్రతిష్ఠాకరమైన తెలివితక్కువ పనిని నాయుడు ప్రభుత్వం చెయ్యదని ఆశిద్దాం.
Meeru correctaga cheppinaru
ఆయన చంద్ర నగర్ అని పెట్టుకున్నా ఎవరూ ఆశ్చర్య పోనక్కర లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి