30, డిసెంబర్ 2011, శుక్రవారం

wlnter


 

  ఈ హేమంత నిశాంత వేళల నహో ,హీరప్రభల్ వెల్గుచున్,
  నీహారాంబు పరీత పత్ర లతికల్ నీరాజనమ్మెత్త స
  మ్మోహాత్మప్రకృతిన్ బహుసుమామోదమ్ము ,శేవంతి భూ
  షాహారమ్ముల ,పౌష్య లక్ష్మికి విలాసంబెంతొ రంజిల్లెడిన్.
                 ---------------------  
   

27, డిసెంబర్ 2011, మంగళవారం

lokpal bill


 

  లోక్పాల్ బిల్ కోసం శాంతియుతంగా ఆందోళన,సత్యాగ్రహం,చేయవచ్చును.కాని,పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టాక,కావాలంటే సవరణలు తేవచ్చును.అంతిమ నిర్ణయం మాత్రం పార్లమెంటుదే.నచ్చకపోతే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని ఓడించి మీ ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకొండి.ప్రజాస్వామ్యంలో ఇదే సరి ఐన పద్ధతి .కాని మన పత్రికలు,టీ.వీ.చానెళ్ళూ,విశ్లేషకులూ ,రచయితలూ,కాంగ్రెస్ వ్యతిరేకులు .వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం చెయ్యాలని మొండి పట్టు పట్టుతారు.
      
  

26, డిసెంబర్ 2011, సోమవారం

vipranarayana


 

 చాలా కాలం తర్వాత నిన్న మళ్ళీ'  విప్రనారాయణసినిమా'టీ.వీ.లో చూసాను.చిత్రం పాతదైనా బాగున్నది.భానుమతి, నాగేశ్వరరావు  ,బాగా నటించారు.చిత్రానికి హైలైట్ రాజేశ్వరరావు సంగీతం.భానుమతి పాడిన జావళీలు,ఆవిడ ఏ.యం.రాజాతో కలిసి పాడిన యుగళ గీతాలు,చా లా మధురంగా ఉంటాయి.భానుమతి సోలో 'ఎందుకోయీ తోటమాలీ ',పాట,ఏ.యం. రాజా సొలో ,'చూడుమదే చెలియా ' పాట ఇప్పటికీ విండానికి ఎంతో హాయిగా ఉన్నాయి.
   ఈ సినిమా సారంగు తమ్మయ అనే కవి (16వ శతాబ్దం)రచించిన 'వైజయంతీ విలాసం' అనే ప్రబంధం ఆధారంగా తీసారు.విప్ర నారాయణుడు శ్రీ రంగం లో జీవించిన చారిత్రక వ్యక్తి అని,7వ శతాబ్ది వాడని చరిత్రకారుల అభిప్రాయం.12మంది ఆళ్వారులలో ఒకడని ,తమిళంలో 'తొండరడిప్పొడి ఆళ్వారు '  అని అంటారు.
        ఆ పాటలను టెక్నిక్ తెలిసినవారు ఎవరైనా వారి బ్లాగులో చేర్చి వినిపిస్తే సంతోషిస్తాను.   

chalam samaadhi


 

 26-12-11 ఆంధ్రజ్యోతిలో చలం సమాధి గురించి రంగనాయకమ్మగారు రాసిన వ్యాఖ్యతో చాలావరకు ఏకీభవించవచ్చును.మరణించినవారికి సమాధి కట్టినా ,వారి పుస్తకాలు మనం దాచుకొన్నా   ,చదివినా వాళ్ళకేమీ తెలియదు కదా.ఏమి చేసినా మనకోసమే.వారి వంశీకులు .,అనుచరులు,అభిమానుల ,భక్తుల,తృప్తి కోసమే.సెంటిమెంట్  కోసమే.ఐతే ,మృత దేహాలనుగాని,మమ్మీలనుగాని భద్రపరచే సంప్రదాయం మనకి లెకపోడం మంచిదే.బుద్ధుడి అస్తికల మీదేకదా స్తూపాలను నిర్మించారు. అవి బౌద్ధ మత ప్రచారానికి ఆలవాలమైనాయి.ఏ సమాధి,ఏ పుస్తకం   ఏ కళాఖండం, ఎంతకాలం నిలుస్తుందో  ఎవరూ చెప్పలేరు కదా! ఏమైనా సమాధుల  కోసం ఆవేశం,పెంచుకోడం, తగవులాడుకోడం విజ్ఞత కాదు.కాని కొందరు విశిష్ట వ్యక్తులమరణానంతరం సమాధులో,స్మారక చిహ్నాలని ఏర్పరచడం జరుగుతూనేవుంటుంది.
                                                 
   

23, డిసెంబర్ 2011, శుక్రవారం

saradaga


  బాల్యంలో బాడ్మింటన్ లో -ప్రావీన్యంకోసం
  ప్రయత్నించి  విఫలుడ నయ్యాను.
  యౌవనం లో సంగీతం నేర్వాలని
  స్వరజతులను  దాటలేక పోయాను.
  నడివయస్సులో సైకాలజీ నేర్వాలని
  అడియాస లే అయినాయి.
  వృద్ధాప్యం లో వేదాంతం చదివితే
  వేడెక్కి పోయింది తల
   మన గమ్యాలన్నీఎందుకో
  మహా దూరంగానే ఉంటాయి.
      ---------------------                   

12, డిసెంబర్ 2011, సోమవారం

harikatha




 నిన్న ఒకరి ఆహ్వానంపై హరికథా ఉత్సవానికి వెళ్ళాను.ఉదయం నుంచి రాత్రి వరకు ,ఒక్కొక్కరు గంట  చొప్పున కథాగానం చేసారు.నేను రెండు కథలు మాత్రం ,రామదాసు ,తులసీదాసు కథలు బాగా చెప్పారు.ఆడిటొరియం నిండి పోయింది .ప్రేక్షకుల స్పందన బాగున్నది.మరుగున పడిపోతున్న ఈ కళారూపం ఇంకా శ్రీకాకుళం జిల్లాలో ఇంకా సజీవంగా ఉన్నట్లు అనిపించింది.కొన్ని దేవాలయాల్లో కూడా హరికథలు చెప్పిస్తున్నారు.ఇది సంతోష కరమైన పరిణామమే. 

6, డిసెంబర్ 2011, మంగళవారం

devanand



 సుప్రసిద్ధ సినిమా నటుడు దేవానంద్ తన 88వ ఏట లండన్లో మరణించిన వార్త అందరూ చదివే ఉంటారు.1948నుండి దాదాపు 1968 వరకూ ముగ్గురు నటులు ఒక వెలుగు వెలిగారు.రాజ్కపూర్,దిలీప్కుమార్, దేవానంద్ త్రిమూర్తులు.రాజ్ కపూర్ మంచి దర్శక నిర్మాత,షోమన్ గా,కూడా పేరు పొందేడు.దిలీప్ కుమార్,ముగ్గురిలోకీ గొప్ప నటునిగా ,ట్రాజెడీ కింగ్ గా పేరు పొందాడు.దేవానంద్ లైట్ కామెడీ చిత్రాలకీ ,సిటీ స్లికెర్ గా పేరు గాంచాడు.అందగాడు.handsome hero ఇండియన్ గ్రెగరీ పెక్ అని బిరుదు పొందేడు. అతని హెయిర్  స్టైల్  ,పఫ్ తో యువకులు అనుకరించే వాళ్ళు. ప్రసిద్ధనటి గాయని  సురయా ,అతను ప్రేమించుకొన్నారు.కాని ఇద్దరి మతాలూ, వేరవడం చేత పెళ్ళి చేసు కో లేక పోయారు. తర్వాత దేవానంద్ ఇంకొ నటి కల్పనా కార్తిక్ ని వివాహం  చేసుకొన్నాడు.పాపంసురయాజీవితాంతం  అవివాహితగానే ఉండి పోయింది.దేవానంద్  నవకేతన్ సంస్థ స్థాపించి గైడ్ వంటి కొన్ని మంచి చిత్రాలు కూడా తీసాడు. 1970 తర్వాత కూడా చాలా సినిమాలు తీసి,నటించాడు కాని అవి అంత విజయం సాధించలేదు.అతని heyday అయిపోయింది.రాజేష్ ఖన్నా ,అమితాభ్ శకం ప్రారంభమయింది. dadasahebphalke award,filmfare lifetime achievement awardలతో సత్కారం పొందేడు. 'గాతా రహే మెరా దిల్ '