25, సెప్టెంబర్ 2011, ఆదివారం

my motto


 


 ' నా తెలంగాణ కోటి రత్నాల వీణ '
   రత్న ఖచిత కిరీటమ్ము రాయసీమ
   దివ్య కాంచన రథము మా తీర భూమి
   వెలుగు ముప్పేట హారమ్ము తెలుగునాడు.
  పై పద్యంలో మొదటి పాదం అందరికీ తెలిసిన దాశరథి పద్యంలోనిది.మిగిలిన మూడు పాదాలూ నేను వ్రాసినవి.పై పద్యమే నా
 నిశ్చిత అభిప్రాయం.నేను అంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలనూ,అన్ని జిల్లాలనూ ప్రేమిస్తాను.ఆంధ్రులు అంటే అన్ని  జిల్లాలవారూ. అజ్ఞానం వలననో దురుద్దేశం తోనో ఈ విషయం సామాన్యులకు కవులు, రచయితలు,పత్రికల వారూ,టీ.వీ,ల వారూ ఎందుకు చెప్పడం లేదో తెలియదు.ఇప్పటి ఉద్రిక్త వాతావరణంలో ఇంతకన్న వ్రాయ దలచుకో లేదు.  

2 కామెంట్‌లు:

Lakshman .M. V. చెప్పారు...

ఈ భావన చాల బాగుంది. నాలుగు పంక్తుల్లో ఏంతో లోతైన విషయం తెలియచేశారు.

Vamshi Pulluri చెప్పారు...

చాల బాగుంది. అంత గొప్పగా కకున్న నేను రాసిన కొన్ని లైన్లు చూడండి.

"అలుపే లేని పోరాటాల తెలంగాణ పల్లె కథ
మాట తప్పని పౌరుశాల రాయలసీమ ఊరి కథ
సోచమైన మనసే ఉన్నా ఉతరంద్ర వారి కథ
కృషినే నమ్మి ముందుకు సాగే కోన సీమ గ్రామ కథ
ప్రతి కథ ప్రతి ఒక్కరి కథ, ఇదే మనందరి కథ"
http://inspiringrays.blogspot.com/2008/11/blog-post.html