3, సెప్టెంబర్ 2011, శనివారం

arudra contd.


ఆరుద్ర సరళమైన శిష్టవ్యావహారికం లోనే ఈ శుద్ధమధ్యాక్కరలను వ్రాసారు.సులభంగా అర్థమౌతుంది కనక అట్టే వివరణ అక్కరలేదు.
  తనలక్ష్యాన్ని చెపుతూ రాసింది.ప్రతీ పాదానికీ 13మాత్రలు ఉంటాయి.
    ''కూనలమ్మపదాల రీతి =కూర్చాక దీనిలో నీతి
      వీనులకు విందొనరించి =ప్రేముడిని జగతిలో పెంచి
      దానవత్వము వేగద్రుంచి =ధర్మపథమే అనుసరించి
      మానవుల మంచినే ఎంచి = మదిమీటు కవితావిపంచి  
     అని తన కవితా లక్ష్యాన్ని చాటిస్తారు.
     ఆరుద్ర నాస్తికుడు.మూఢనమ్మకాలను నిరసిస్తూ రాసినది.
      '' జంతువులతలలున్న సురలు =చలనమ్ములేనట్టి తరులు
         వింతగా కనిపించు రాళ్ళు =వెర్రిమానవుల దేవుళ్ళు
         పంతుళ్ళు పొత్తర్లు పట్ట=భరమగున పితరాళ్ళపొట్ట
        అంతరాత్మను తలచుకొమ్ము = అనవసరమీ తద్దినమ్ము.
      కాని పూర్వికుల సంస్మరణ ఏదో ఒకరూపంలో అన్ని నాగరకతలలోనూ ఉందికదా!
      కట్నాలని నిరసిస్తూనే తనదాకా వస్తేమాత్రం కట్నాన్ని ఆశించే కపటులమీద ఆరుద్రవిసుర్లు.

      ''కన్యకల పరిణయసమస్య=కారునల్లని అమావాస్య
        మా న్యాలపై అప్పుదెచ్చి=మ్యారేజి చేయడం పిచ్చి
        అన్యాయమీ శుల్కం =అడగడం పాపమనుచు
        అన్యులకు తానుబోధించి =ఆశించు కట్నాలసంచి
       మనేన్నికలమీద ,అవినీతిమీద విమర్శ
     '' కులతత్వ కూటాలవోట్లు =బలమున్నపదవులకు మెట్లు
        పలుకుబడిబడిలోన సీట్లు=పండించులే పచ్చనోట్లు
        కలవాళ్ళ అవగుణపు చెట్లు= ఫలియించె కోటానుకోట్లు
       తలబిరుసుతనపు పర్మిట్లు=దాపురించెను మనకు పాట్లూ'
       ఇంకా కొన్ని మరో సారి.
              ----------

కామెంట్‌లు లేవు: