తల్లి యొడి లోన వెచ్చగ తనువు మరచి
శాంత్యమాయక భావాల స్వాదురసము
నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ
చింత లెరుగని పొన్నారి చిట్టిపాప
---------
ప్రేమికుని కౌగిలిని చేరి ప రియవధూటి
సేద దీరంగ స్వప్నాల చిత్రరచన
వాలుగన్నుల నర్తింప లీల నగవు
మోము నలరింప నిద్రించు ముగ్ధ హృదయ
-----------
వెతల ,రుగ్మత భారాన వేసరిల్లి
నిద్ర రానట్టి సుదీర్ఘ నిశల యందు
ఘడియలను లెక్కపెట్టుచు గడుపుచుండు
కొంత దనుకను ముదిమిని కునుకు పట్టు .
-----------
2 కామెంట్‌లు:
మధురభావప్రపూరితమై వెలింగి
‘నిద్ర’ యను ఖందకృతి ‘కమనీయ’ మయ్యెఁ
గాని రెండవపద్యములోని మొదటి
పాదమందున, మూడవపద్యమున ద్వి
తీయపాదమ్మునందునఁ జేయఁదగును
సవరణ మ్మచట గణదోషమ్ము దొరలె.
శంకరయ్యగారికి ధన్యవాదాలతో .మూడవ పద్యం రెండవ పాదంలో 'సుదీర్ఘ ' బదులు దీర్ఘమౌ' అని సవరిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి