12, ఆగస్టు 2015, బుధవారం

old age and children




 వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం వల్ల తల్లిదండ్రులు పడుతున్న కష్టాలగురించి ఈమధ్య పత్రికల్లో చాలా కథలు వస్తున్నాయి.నిజమే కాదనను.కాని కొంచెం అవతలి  వైపు కూడా చూడవలసి  ఉంటుంది.కావాలనే deliberateగా నిర్లక్ష్యం చేసేవారి గురించి  రాయదలుచుకోలేదు.  కాని తల్లి దండ్రుల మీద అంతో, ఇంతో ప్రేమ ఉండి ,కూడా సరిగా చూడలేనివారి  సంగతి గమనించాలి.
  1.తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆర్థిక పరిస్థితులు.2. తమ ముసలితనానికి అంతో ఇంతో  వెనక వేసుకొనక పోవడం.3,ఈ రోజుల్లో భార్యా ,భర్తలిద్దరూ ఉద్యోగాలో,పనులో చేస్తూఉండడం వల్ల తీరుబాటు లేకపోవటం.పిల్లలు కూడా అందరూ చదువులకు వెళ్ళిపోవడం వలన 4.పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు వృద్ధుల్ని చూసేవారు.ఇప్పుడు అంతా nuclear families కదా. 5.వృద్ధాప్యంలో జబ్బులు ఎక్కువ. ఇప్పుడు వైద్యం కూడా చాలా ఖరీదు.medical insurance లేకపోతే భరించడం చాలా కష్టం. ఇలాగ అనేక కారణాలు ఉన్నాయి.వాటిని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది.

10, ఆగస్టు 2015, సోమవారం

INDIA -poverty-my observation




 మన దేశంలో పేదరికం ఇంకా ఉన్నదని ఒప్పుకుంటాను.ఈ విషయంలో ప్రభుత్వ గణాంకాలు ,ఇతర గణాంకాలు విభేదిస్తున్నాయి.వాటి మాట ఎలాఉన్నా, ప్రాక్టికల్ గా నా పరిశీలనలో ముఖ్యాంగా మన కోస్తా ఆంధ్ర లో పేదరికం మునపటి కన్నా  బాగా తగ్గిందని అనిపిస్తున్నది.
 1.మాఇంటికి పూర్వం రోజూ కనీసం 10 మంది బిచ్చానికి వచ్చేవారు.ఇప్పుడు ఒకరూ రావటం లేదు.
 2.పనిమనుషులు దొరకటం కష్టం గాఉంది.దొరికినా వాళ్ళు పూర్వం లాగ మిగిలిన అన్నం,కూరలు పట్టుకెళ్ళటం లేదు.
 3.అందరి దగ్గరా  సెల్ ఫోన్లు ,టీ.వీలు ఉన్నాయి.మోటార్  బైక్ లేక పోయినా సైకిలేనా లేని కుటుంబాలు కనిపించడం లేదు.
 4.పూర్వం తాటాకు గుడిసెలూ ,పూరిళ్ళూ ఎక్కువగా ఉండేవి.ఇప్పుడవి చాలా తక్కువ.సిమెంట్,లేక ఇటుక ఇళ్ళు (పల్లెలలో కూడా ) ఎక్కువగా ఉన్నాయి.
  5.పూర్వం చదువు చాలా తక్కువ ,ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు.
 6. ఇప్పుడు దాదాపు అందరూ మంచి బట్టలే ధరిస్తున్నారు.
   ప్రజల ఆదాయం పెరగడం, ప్రభుత్వపు సంక్షేమ కార్యక్రమాలవల్ల ఈ మార్పులు వస్తున్నవని అనుకుంటున్నాను.అలా అని పేదరికం లేదని నా అభిప్రాయం కాదు.ఇంకా చెయ్యవలసినవీ,సాధించవలసినవీ చాలా ఉన్నాయని ఒప్పుకుంటాను.

31, జులై 2015, శుక్రవారం

our population


 

  పత్రికల్లో సమాచారం;మనదేశ జనాభా 130 కోట్లు అని ఏడెనిమిది ఏళ్ళలో చైనాను మించి పో తుందని2050 కి 170 కోట్లకు చేరుతుందని.అధిక జనాభా ఒకరకం గా మంచిదే ఐనా  దానికి ఒక హద్దు ఉండాలి.  నా అభిప్రాయంలో ,12 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్న మనదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ  180 కోట్లను దాటకూడదు.(చ ;మై;కి 1500  మంది జనసాంద్రత ) లేకపోతే  అందరికీ  ఆహారం ,నీటి సరఫరా, గృహవసతి ,విద్యా,వైద్య సౌకర్యాలు అందించలేము. 150కోట్లకు limit చేసుకో  గలుగుతే ఇంకా మంచిదే .మన నాయకులెవరూ కుటుంబ నియంత్రణ గురించి మాటలాడడానికే  భయపడుతున్నారు.దక్షిణరాష్ట్రాలలో  జనాభా అభివృద్ధి బాగా తగ్గుతుండడం మంచిపరిణామమే.కాని ఉత్తరాదిలో ఇంకా తగ్గడంలేదు. అందువలన కుల,మత,ప్రాంత భేదం లేకుండా జనాభా నియంత్రణ చేపట్టాలి.  

30, జూన్ 2015, మంగళవారం

medical exam before marriage.




 ఒక డాక్టర్ గా అనుభవపూర్వంగా చెప్తున్నాను.చాలామందికి రుచించక పోవచ్చును.అమలు చేయడంకూడా కష్టమే.పెళ్ళికి ముందు ఎన్నో చూస్తారు.అందచందాలు,సంప్రదాయం,హోదా,డబ్బు, ఇంకా ఎన్నో.మంచిదే.కాని వధువు,లేక వరుడి ఆరొగ్యం గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.పెళ్ళి నాటికి ఆరోగ్యంగానే ఉన్నా.అనేక వ్యాధులు  క్రమంగా బయట పడతాయి.అప్పుడేమీ చెయ్యలేరు.చాలాజబ్బులు వంశపారంపర్యంగా వస్తాయి.కొన్ని ముందే తెలుసుకోవచ్చును. అందుచేత,కాబోయే పార్ట్నర్ పూర్తి మెడికల్ రిపోర్ట్  చూసి వివాహం చేసుకోడం మంచిది.ఇరువురూ అవతలవారి రిపోర్టుల్ని చూసుకొని సమ్మతమైతేనే వివాహం చేసుకోడం మంచిది.కాని దీన్ని ఆచరణలో  పెట్టడం కష్టం.ఇది ఒక సలహా మాత్రమే.

29, జూన్ 2015, సోమవారం

national songs




 '' మా తెలుగుతల్లికి మల్లెపూదండ ''గేయం తెలుగువారి(కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో)జాతీయ గేయం అయింది.ఇందులో originalగా శంకరంబాడి సుందరాచారి రచించిన గేయంలో ' అమరావతీగుహల అపురూపశిల్పాలు  ' అనిఉన్నది.అమరావతిలో గుహలూ లేవు,అందులో శిల్పాలూ లేవు.అందుకని ఆ చరణాన్ని అమరావతీ నగర ' అనిమార్చారు.దరిమిలా ఇప్పుడు ' అమరావతీ గుడుల ' అని మార్చి పాడుతున్నారు.ఆ శిల్పాలులో చాలా భాగం  లండన్ మ్యూజియం లోను,కొన్ని స్థానిక మ్యూజియం లో ను ఉన్నాయి.మొదట్లో టంగుటూరి సూర్యకుమారి పాడిన గ్రామొఫోన్ రికార్డు లోను ' అమరావతీ గుహల ' అనేఉంది.ఇది  మన తెలుగు జాతీయ గేయం కథ.
   ఇక భారత జాతీయ గేయం '' జనగణ మన అధినాయక '' విషయం ;;ఆదిలో దీన్ని రవీంద్ర నాథ టాగూర్ బ్రిటిష్ చక్రవర్తిని కీర్తిస్తూ రాసేడని, అప్పటికింకా టాగూర్గారికి జాతీయోద్యమంతో బాగా సంబంధం లేదని ,తర్వాతనే  బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్  బిరుదుని త్యజించారని  ఒక వాదం ఉంది. కాదు ఆ గేయాన్ని భారతమాతను స్తుతిస్తూ రాసిన జాతీయగీతం అని ప్రతివాదం గా చెప్తారు.
   ఇంకొక జాతీయగీతం ''వందేమాతరం' గురించి; ఇది దుర్గామాత గురించి కీర్తిస్తూ రాసింది  దీన్ని పాడమని మమ్మల్ని నిర్బంధిచకూడదని ముస్లిం నాయకుల అభ్యంతరం.కాదు, ఇది భారతమాత గురించి బంకించంద్ర రాసినదని సమర్థిస్తారు. నా ఉద్దేశంలో ఈ గేయం మొదటి నాలుగు చరణాలు దేశాన్ని ఉద్దేశించినవే కాబట్టి

''వందేమాతరం సుజలాం ...నుంచి సుఖదాం వరదాం మాతరం '' వరకూపాడితే ఎవరికీ  అభ్యంతరం ఉండకూడదని.
  ఇలాగే బ్రిటిష్ జాతీయగీతం'  long live the King ' కి  కొందరు రాచరికవ్యవస్థ వ్యతిరెకులు అభ్యంతరం తెలుపుతున్నారు.ఆస్ట్రేలియాలో కూడా కొందరు ఇప్పుడు ఆ దేశం స్వతంత్రమైనది,అన్ని జాతులవారూ నివసిస్తూ ఉన్నారు కాబట్టి బ్రిటిష్ జాతీయ గీతం పనికిరాదంటున్నారు.రెపు స్కాట్లాండ్ విడిపోతే వాళ్ళూ అదే అంటారు. 

9, జూన్ 2015, మంగళవారం

Revant Reddy's affair




 ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డితోబాటు చంద్రబాబునాయుడు కూడా భ్రష్టు పడ్డాడు.చివరికి కేసు కోర్టులో ఏమౌతుందో కాని,ప్రజల దృష్టిలో నాయుడుగారు అపఖ్యాతి పాలయ్యాడు.అందువల్ల తనపదవికి రాజీనామా చేసే నైతిక బాధ్యత ఆయనపైఉంది.ఐనాపరవాలేదు ,లాలూప్రసాద్ యాదవ్ గారు ముందే దారిచూపించిఉన్నాడుకదా!తాను దిగిపోవలసివచ్చినప్పుడు తన భార్య రబ్దీదేవిని ముఖ్యమంత్రిపదవిలో అధిష్ఠింప జేసాడుకదా.అలాగే చంద్రబాబునాయుడు  కూడా కుమారుడు లోకేష్ ని ముఖ్యమంత్రినిచేసి  తాను రాజీనామా చెయ్యవచ్చును. దానితో నైతికంగా ప్రవర్తించాడని పేరూ వస్తుంది.మళ్ళీ అదనుచూసుకొని గద్దెనెక్కవచ్చును. ఈలోగా ఎలాగూ లోకేష్ అధ్వర్యంలో T.D.P.ప్రభుత్వం కొనసాగుతుంది.తాను వెనకనుంచి చక్రం తిప్పవచ్చును. ఏమంటారు? 

28, మే 2015, గురువారం

prasannabhaaskaram




 ప్రసిద్ధ కవీ,అధ్యాపకుడు,పండితుడూ ఐన శ్రీ మానాప్రగడ శేషశాయిగారి 'ప్రసన్నభాస్కరం 'ఈ మధ్యనే నాకు లభించింది.ఆయనకు చూపు మందగించినప్పుడు రచించినట్లు తెలుస్తోంది.మొత్తం 223 పద్యాలున్నవి.అందులో రెండు మాత్రం ఉదహరిస్తాను.    
    చం'; హరితమణి చ్చటా చకిత హారి తురంగమ సప్తకాప్రభా
           పరిణతమద్భుత ప్రణమితామరమౌళి గుళుచ్చ కాంతిభా
           సురము,జగత్త్రయీ సదనసుందర కాంచన తోరణమ్ము, భా
           స్కర నవరత్న  మండలము,చయ్యన మాకు బ్రసన్నమయ్యెడున్

   మత్తే';  నిను సేవింప రవీ !మయూరుడనుగానే,లేక శ్రీనాథుడై
             నను గానే ,దరినుండు చాయనైనన్ గానే,ఉషహ్కాంతినై
             నను గానే,ప్రియపద్మినీరమణి నైనంగానె త్రైలోక్యపా
             వనముల్ నీఅరుణారుణ ప్రభలెటుల్ వర్ణింపగా జాలుదున్?
   అన్ని పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి.సంస్కృతంలోని మయూరశతకంకి సాటి వస్తుందని ధీమాగా  చెప్పగలను.