7, జనవరి 2013, సోమవారం
NRI autobiography
పుస్తకం పేరు;'నేలా,నింగీ,నేనూ '
భాష;తెలుగు; రచయిత;డా;ప్రయాగమురళీమోహన్ కృష్ణ.
ప్రచురణ;ఎమెస్కో బుక్స్;హైదరాబాద్ -500 029
ముద్రణ-2011;మూల్యం-రూ.150 .పుటలు=494.
ఒక NRI ఆత్మకథ అని రాసుకొన్న పుస్తకాన్ని ఈమధ్యనే చదివాను.శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట దగ్గర గొటివాడ అనే అగ్రహారంలో జన్మించి ,వైజాగ్ లో మెడిసిన్ చదివి ,కొంతకాలం ప్రభుత్వ సర్వీసులో పనిచెసినతర్వాత,అనెస్థీషియా లో స్పెషలైజ్ చేసిన డాక్టరుగారు.
ఆ తర్వాత అనూహ్యంగా విదేశాలకి వెళ్ళి,3 దశాబ్దాలు పైగా 6 దేశాలలో ( ట్రినిడాడ్ ,ఐర్లండ్,ఇంగ్లండ్,డెన్మార్క్, స్వీడన్,నార్వే) లలో బాగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. వృద్ధాప్యంలో మనదేశానికి తిరిగి వచ్చి ఇక్కదే ప్రశాంతజీవనం గడుపుతున్నారు.తన సబ్జెక్టు అనస్తీషియా మీద రెండు పుస్తకాలు రచించారు.
500పేజీల గ్రంథంలో,మొదటి 280 పేజీలు తన బాల్యమ్నుంచి ఇండియాలో జీవితం,తర్వాత 140 పేజీలు విదేశాల్లో జీవిత విశేషాల గురించి చివరి 60 పేజీలలో మళ్ళీ మనదేశంలో జీవితం గురించి రాసారు.చిన్న చిన్న విషయాలు కూడా వదలిపెట్టలేదు.
దీనిద్వారా పూర్వపురోజులు,ఇప్పుడు మనదేశంలో పరిస్థితులు, మార్పులు తెలుస్తాయి.అభివృద్ధి చెందిన విదేశాల గురించి ,అనేక వైద్య విషయాలు తెలుస్తాయి.ఎన్నాళ్ళు విదేశాల్లో ఉన్నా రచయితకి వున్న స్వదేశాభిమానం,సంప్రదాయాలమీదా ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.సులభంగా చదువుకుపోగల పుస్తకం.శైలి బాగుంది.
నాకు ప్రత్యేక ఆసక్తి ;ఇందులో పి.జి.కె.(పంతుల గోపాలకృష్ణారావు) అనబడే రచయిత మిత్రుడు నాకు స్వయానా మేనల్లుడు కావడం.అలాగే కుమారగుప్తా,కొందరు డాక్టర్లు,ప్రొఫెసర్లు పరిచయం ఉన్నవాళ్ళు కావటం ఆసక్తి కలిగిస్తుంది.
ఇటీవలికాలంలో ఆత్మకథలు బాగా వస్తున్నవి.మంచిదే.ఎలాంటి వారి జీవితంలోనైనా ఎంతో కొంత తెలుసుకోవలసినదీ,ఆసక్తికరమైనదీ ఉంటుందని నా అభిప్రాయం.
' నేలా,నింగీ,నేనూ ' అందరూ చదవవలసిన గ్రంథం.మరొక్క విశేషం;చిన్నప్పుడు చదువురాని బడుద్ధాయి అనిపించుకొన్న వ్యక్తే స్వయంకృషితో పెద్ద డాక్టర్ గా ఎదిగి పేరొందడం ప్రశంసనీయమే.
6, జనవరి 2013, ఆదివారం
Hindu Gods
ఈ మధ్య అక్బరుద్దీన్ ప్రేలాపనలలో హిందూ దేవతలను దూషించిన దానిపై పలువురు ఆగ్రహించారు.అతన్ని తీవ్రంగా శిక్షించాలీన్నారు.నిజమే.నేను కూడా ఏకీభవిస్తున్నాను.నేను కూడా ఖండిస్తున్నాను.కాని ఒక్క విషయం; మన సినిమాల్లో,ముఖ్యంగా తెలుగు సినిమాల్లో యముడు,కృష్ణుడు ,మొ;దేవతల గురించి బఫూన్ల లాగ చిత్రించినా ఎవరూ మాట్లాడరేమి?సెన్సారుబోర్డు వారు కళ్ళు మూసుకొంటున్నారా?ఇది చాలా అభ్యంతరకరమైన విషయం కాదా?
27, డిసెంబర్ 2012, గురువారం
ఈనాడు (27-12-12)తెలుగుగడ్డపై 37 స.;తర్వాత తిరుపతిలో రాష్ట్రపతిచె ప్రారంభింపబడిన4వ ప్రపంచ తెలుగుమహాసభల ప్రారంభోత్సవం బాగానే జరిగిందని నా అభిప్రాయం.విమర్శలు ఎలాగూ ఉంటాయి.కొన్ని పొరబాట్లు కూడా జరిగిఉండవచ్చును.కాని మొత్తం మీద జయప్రదంగానే జరిగిందని చెప్పవచ్చును.' మా తెలుగుతల్లి ' ప్రార్థనాగీతం సుశీల, బాలసరస్వతి బాగా పాడలేకపోయారు,వృద్ధాప్యంవలన.ఎవరైనా మంచి యువ గాయనీగాయకులచే పాడించవలసింది.
కిరణ్కుమార్ రెడ్డి గారి ప్రసంగాన్ని మామూలుగా హేళన చెస్తూఉంటారు.కాని ఆయన తెలుగు ఈమధ్య improve అయింది.చిత్తూరు యాస ఉండవచ్చును ,కాని అందులో తప్పేమీలేదుకదా.కొంచెం తప్పులున్నా గవర్నర్ గారు తెలుగు బాగానే మాట్లాదుతారు.
సభలకి good start అనుకోవచ్చును.
18, డిసెంబర్ 2012, మంగళవారం
backwardness-2
ఆర్యా,మీ గణాంకాల్ని అంగీకరించడానికి అభ్యంతరం ఏమీ లేదు.ఉభయగోదావరి జిల్లాలు నీటివసతివలన పంటలు అధికంగా పండుతాయని తెలిసిందే.కాని ఇతరవిషయాలలో అంత ఎక్కువ తేడాలు లేవు. (2011 లో ప్రభుత్వ గణాంకాలప్రకారం.)ఇక్కడివాళ్ళలో enterprise తక్కువ.నేను చెప్పదలుచుకొన్నది అదే.అన్నిటికీ ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చో లేము కదా.విశాఖరేవు,పరిశ్రమలు,కాకుందా ఫెర్రోఅలాయిస్ పరిశ్రమ ఉన్నది.అణువిద్యుత్కేంద్రం తయారవుతున్నది. ఫార్మా కారిడర్ పరిశ్రమలు ఉన్నవి.వెనుకబడినతనం అనేది మన మెదడులో ఉన్నది అని చెప్పడమే నా ఉద్దేశం.ఇది తెలంగాణా వారికీ వర్తిస్తుంది .
11, డిసెంబర్ 2012, మంగళవారం
10, డిసెంబర్ 2012, సోమవారం
Backwardness
వెనకబడిన వాళ్ళం,వెనకబడ్డ ప్రాంతం అని చెప్పుకోడం ఇప్పుడు ఒక అలవాటయింది.ఉత్తరాంధ్ర(నాది ఆ ప్రాంతమే ఐనా )బాగా వెనకబడింది అంటుంటారు.కాని నేను అలా అనుకోను.ఈ ప్రాంతంలో వర్షాలు బాగానే పడతాయి.ఏరులు,వాగులు చాలాఉన్నవి.పంటలు బాగానే పండు తాయి.ఇటీవల విద్యాలయాలు,ఆస్పత్రులు ,బాగావృద్ధిచెందాయి.పర్యాటక రంగం కూడా పెరుగుతున్నాది.మధ్యకోస్తా ఆంధ్రులు ఇక్కడ కొండలు,అడవులు ఉండటం చేత మీరు వెనకబడ్డారని అంటారు.అవి ఉండటం అదృష్టం,అందం.అడవులు ,కొండలు లేని పశ్చిమ గోదావరి,కృష్ణా ,గుంటూరు జిల్లాలకన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు అందంగాఉంటాయి.గణాంకాల ప్రకారం కూడా అంత పెద్ద తేడా ఏమీ లేదు.తెలంగాణా జిల్లాలు కూడా (కొంచెం తరతమ భేదాలు తప్పించి ) వెనకబడలేదని నా అభిప్రాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)