31, మే 2011, మంగళవారం

another poem

అపుడే మిహిరాంసుకము దాల్చి ,యవనతముఖి 
యగు లతాంగి బోల్ ససిబింబ మస్తమించే
ఎర్రనైన చీకటు లావరించే దిసల 
నెలత వ్రీడా కపోలారునిమము వోలె 
  ----------------------------------
అచ్చు తప్పులు తప్పలేదు.మన్నించాలి. 



టెలి ఫోన్ ... గల్పిక - 5


గల్పిక-5
---------  టెలిఫోన్
           ---------  అలెక్జాండర్ గ్రహాం బెల్ టెలిఫొన్ కనిపెట్టింది దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు సులభంగా మాట్లాడుకొడానికి .కాని ఆ టెలిఫొన్ యంత్రాంగం శాఖోప శాఖలుగావిస్తరించి  ఈనాడు పరిస్థితి ఎలా ఉందో ఊహించుకొండి. గ్రహాంబెల్ టెలిఫొన్ కనిపెట్టినప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు జరిగాయని ఊహించుకొండి. బెల్ పక్క గది లోకి వెళ్ళి అక్కడ పొరబాటున ఒంటిమీద యాసిడ్ వొలకగా ఆనొప్పితో ఇలా ఫొన్లో అంటాడు  "వాట్సన్,ఇలా రా ఒకసారి నీతో మాట్లాడాలి." వాట్సన్ నుంచి జవాబు బదులు ఒక మెషీన్ బదులు చెప్తుంది."మీకు కావలసిన డాక్టర్ పేరు తెలిస్తే నం.1 నొక్కండి.తెలియకపోతే నం.2 నొక్కుతే రిజిస్టర్ చేస్తారు.అండమాన్ దీవుల యాత్రకు వెళ్ళాలంటే నం.3 నొక్కండి.అత్యవసరమైన పరిస్థితి ఐతే మీ సోషల్ సెక్యూరిటీ నంబరు,మెడికల్ ఇన్స్యూరెన్స్ నంబరు కొట్టి ,తర్వాత నం.4 నొక్కండి.డాక్టర్ వాట్సన్ గారి తోనే మాట్లాడాలనుకొంటే మ్యూజిక్ సింఫనీ పూర్తయే దాకా ఆగి నం.5 నొక్కండి "
  ఆన్సరింగ్ మెషీన్ చెప్పినట్లు గ్రహాంబెల్ 5 నొక్కుతాడు.కాని జవాబురాదు.కనెక్షన్  తెగిపోతుంది. చివరకు  వాట్సన్ ఆ గదిలోకి ఏదో పని మీద వస్తాడు.గ్రహాంబెల్గారు అతనితో అంటాడు." ఇందాక యాసిడ్ పడినప్పుడు నిన్నుపిలుద్దామని ఫొన్ చేసినప్పుడు నంబర్  1 నొక్కడం  మరిచిపోయాను "
        ( ఆర్ట్ బుఖ్వాల్డ్ "బెల్ ఆన్ ది టెలిఫొన్ " ని అనుసరించి ) రమణారావు.ముద్దు   

30, మే 2011, సోమవారం

another poem

సెలవు
=====     నేను వీడిపోవునంతలోన =నెన్నిటికో ధన్యవాదములు 
                 స్వస్థాతకీ ,సౌర రస్మికీ సౌఖ్యానికి =చైతన్యానికి ,చల్లని గాలికి ,సౌరభానికి 
                 జీవానికి ,జీవితమాధుర్యానికి=జీవితపు వెతలకు ,ధన్యవాదములు 
                 సమరసభావానికి ,సంక్షోభానికి =స్పందనలకి ,స్నేహాలకి ,
                 అపరిచితులకు ,ఆదరించినవారికి =తీపి పల్కులకూ,తీవ్రభాషనలకు 
                 సంధ్యారుణ చిత్రరచనలకు ,=చంద్ర చారు శీతల సంస్పర్సకి
                      అన్నిటికీ ,ఎన్నటికీ ధన్యవాదాలు .--రమణారావు ---

సెసిల్.బి.డి.మిల్ గురించి మరి కొంత సమాచారం ...

vvసెసిల్.బి.డి.మిల్ -గురించి తెలుగు రత్న గారి బ్లాగు లొ కొంచెం రాశారు.దాని మీద నెను చిన్న కామెంట్ రాసాను.కాని తృప్తి కరంగాలేదు.ఒక తప్పు కూడా దొర్లింది.బెణర్ చిత్రం అతదు తీయలెదు
 డిమిల్ గురించి క్లుప్తంగా ;= హాలీవుడ్ స్థాపకుల్లొ ఒకనిగా పరిగణిస్తారు.జననం; 1881మరణం 1959
సినిమా నిర్మాత ,దర్శకుడు ,రచయిత .కొన్నిటిలో నటించ్ హాడు కూడా .మొదట్లో నాటకాలలో  పాల్గొనేవాడు.తరవాతనిశ్శబ్దచిత్రాలు(సైలంట్)చాలా తీసాడు.అందులో కొన్ని టాకీలు గా మళ్ళీ తీసాడు.అతడి చిత్రాలు చాలా ఖర్చు పెట్టి భారీగా తీసేవాడు. అందుకు.తగిన కథలను.దృశ్యాలను ఎంచుకొనేవాడు.అగ్ర తరాగణంతో ,గొప్ప సెట్టింగులతో ,ప్రొడక్షన్ వాల్యూస్తో తీసేవాడు. మనలో చాలామంది చూసివుండే చిత్రాలను మాత్రం పేర్కొంటాను.
  1.శాంసన్ అండ్ దెలీలా ==బైబిల్ లోని కథ .విక్టర్మెచుర్ ,హెడీ లామార్ శాంసన్.దెలీలాలుగా నటించారు.భీమబలుడైన శాంసన్ పాగన్ దేవాలయాన్ని కేవలం తన భుజబలం తోనే పడగొట్టడం గొప్పగా చిత్రీకరించాడు.(1949)
 2. (1952) గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్థ్ ==సర్కస్ దృస్యాలు బాగా చిత్రీకరించాడు.
3.టెన్ కమాండ్మెంట్స్ ; ( 1956 ) బైబిల్ లో ప్రవక్త మోజెస్ కథ.ఈజిప్టునుండి పారిపొతున్న యూదులకు ఎర్రసముద్రం  విడిపోయి దారి ఇచ్చే దృశ్యం గొప్పగా ఉంటుంది.అప్పటికన్నా టెక్నాలజీ ,కంప్యుటర్ గ్రాఫిక్స్ బాగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఆశ్చర్యం గా ఉంటాయి.ఈ సినిమాలో చార్ల్స్తన్ హెస్టన్ మోజెస్గా ,యూల్ బ్రిన్నర్ ఫారోగా అద్భుతంగా నటించారు.
  కాని సీరియస్ విమర్శకులు ఈయన సినిమాలని అంతగా మెచ్చుకొలేదు.ఆర్థికంగా విజయం సాధించాయి.ప్రజలు బాగా ఆదరించారు..
  సన్సెట్ బౌల్వార్ద్ అనె సినిమా బాలీవుడ్ చిత్రసీమ మీద వ్యంగ్యంగాతీసిన చిత్రం. ఇందులో దిమిల్ నటించాడు .
  సెసిల్ .బి. డిమిల్ పేరున నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన జీవితకాలపు అవార్డ్ 2011లో ప్రసిద్ధ నటుడు రాబర్ట్ డీ నీరో అందుకొన్నాడు.
మరొక్క సంగతి.ఎలిజబెత్ టైలర్ నటించిన క్లియో పాత్రా చాలామందిచూసే ఉంటారు.ఆకథనే డీమిల్ 1934 లో నిర్మించాడు,

 

29, మే 2011, ఆదివారం

credit card

క్రెడిట్ కార్డ్ -గల్పిక ౪.
-------------(ఆర్ట్ బుఖ్ వాల్డ్ 'చార్జ్ మీ 'ని అనుసరించి )
 ఈ మధ్య భారత్ లక్ష్మి అనే పెద్ద బాంక్ తన ఖాతాదార్లకు ఆకర్షణీయమైన ,సదుపాయాలతో క్రెడిట్ కార్డులని 
ఇస్తున్నట్లు తెలిసింది.నన్ను కూడా  ఒకటి తీసుకోమన్నారు .కాని వాళ్ళు ఇతర కంపెనీలకి మన వివరాలు 
అమ్ముతున్నట్లు చూచాయగా తెలిసింది.మన విషయాలు గోప్యంగా ఉండాలికదా. ఈ వ్యవహారాన్ని తలుచుకొంటే 
 ఒక దృశ్యం కనబడింది.దానిని మీ ముందు ఉంచుతున్నాను.కుటిల డిపార్ట్మెంట్ స్టోర్ వారు ,భారత లక్ష్మి బాంక్
 వారితో మాట్లాడే ఘట్టంగా ఊహించుకోండి.
 కు,డి.=హలో భారతలక్ష్మీ కుటిల నుంచి మాట్లాడుతున్నాను.పుల్లారావు గురించి మీకు తెలిసిన సమాచారం 
 కాస్త మాకు చెప్తారా .అఫ్కోర్సు ఫార్మాలిటీస్ మామూలే
.భా.ల.=ఒక నిముషం ఉండండి. డేటా చూసి  చెప్తాను.====ఆ .అతను చవకరకం జోళ్ళు కొంటాడు. 
 కు.డి.=అంకున్నాం .ఇంకా ఏమైనా ?
 భా.ల. =జింక శేవింగు క్రీము ,నీము టూత్ పేస్టుని కొంటాడు.దియోడరెంటుని,అరుదుగా కొంటాడు.పొదుపు
 మనిషి అనుకొంటాము. 
 "అతని ప్రేమ వ్యవహారాలూ సంగతి ఏమైనా చెప్పగలరా ?
 "డజను వాలెంటైను కార్డులు కొంటాడు.కొంచం గ్రంథ సాన్గుడు లాగే ఉన్నాడు.
 "మరి స్పోర్ట్సు సంగతి ?
 "చెప్పుకోదగినదేమీ లేదుఎప్పుడో .రెండు టెన్నిస్ బంతులు కొంటాడు."
 "అన్నట్టు అతని భోజనం ,అభిరుచుల సంగతి చెప్పండి "
 సుష్టుగానే నాన్వెజ్ తింటాడు.ఒక్కడే తింటాడు.ఎప్పడూ పార్టీలు ఇచ్చినట్లు లేదుపేమెంట్ క్రెడిట్ కార్డు తోనే 
.చేస్తాడు."
 కు.డి."చివరిగా ,అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది ?"
 భా.ల."అతను కొంచం స్థూల కాయుడు.కొంచం చెవుడు, డయాబిటీస్ ఉన్నట్లున్నాయి.వారం వారం రెండు 
 మూడు వందల మందులు కొంటూ ఉంటాడు. "
 కు.డి ."అయితే ఇంకేం .మాకు సరిపోయిన మనిషే.కాస్త అతని అన్లిస్తేడ్ఫోన్ నంబర్ ఇవ్వండి.మా ఫోన్ 
 డిపార్ట్మెంట్ కి ఇస్తాం .అతని వెంట పడతారు. చాలా థాంక్స్ . 

another poem

నా మరొక గేయం.
                             ప్రక్రుతి 
                          ------------
   సుమ సౌరభముల ,భ్రమర నాదమ్ముల 
   సాగినది వాసంత సాంధ్యసమీరమ్ము 
   గ్రీష్మ తాపోదగ్ర కీలావ్రుతములగుచు 
  వేసవి గాలులు విసరె  ధూళి 
  జలగర్భినుల  మోసి సలిల ధారల గురిసి 
  వరదానమిచ్చేను వానగాలి 
   హిమబిందువులు రాలి చేమంతి దండల
   చలిచిరుగాలుల పొలిచె సీతువున 
         ----------------------------

28, మే 2011, శనివారం


నా కొత్త గేయం.
-----------------
ఇచట పూసిన విరులు -ఏ చాన జడ మెరియునో
ఈ కొమ్మ కూయు కోయిల -ఏ తరువు దరి జేరునో
ఈ కోనలో పారు సెలయేరు-ఏ సీమలన్ ప్రవహించునో
ఈ నింగి లో తేలు ఆమొయిలు -ఎటు పయనించి వర్షించునో
ఈ సోగకనుల కన్నియ - ఏ పురుష పుంగవుని వరియించునో
ఇచట జన్మించిన మానవుడు -ఏ దేశములకేగునో
      ఏ జీవనము  సాగించునొ
       ఎట తుది శ్వాస విడుచునో
                                       ==రమణారావు .ముద్దు