ఉద్రమదేవి సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది కాబట్టి,వీలయితే అడవి బాపిరాజుగారు రచించిన 'గోన గన్నారెడ్డి 'అనే నవలను చదివితే మంచిది.చాలాకాలం క్రిందటే బాపిరాజుగారు చాలా పరిశోధించి ఈ నవల వ్రాసారు.చిన్నప్పటినుండి రుద్రమదేవిని మగపిల్లవాడిగా పెంచడం.చాలాకొద్దిమందికే ఈ విషయం తెలియడం,తర్వాత ముమ్మడమ్మను ఆమెకు వివాహం చేయడం,మగవేషంలోనే ఆమె రాజ్యంచెయ్యడం వంటి అనేక వింత విషయాలు ఇందులో ఉన్నాయి. సినిమాను తీసినవాళ్ళు ఈనవలను చదివి ఉంటారనుకొంటాను.గోనగన్నారెడ్డి అనేకులదృష్టిలో గజదొంగ, కాని అతడు రుద్రమదేవికి యుద్ధాల్లో సహాయం చేస్తాడు.వీలయితే చదవ వలసిన నవల.
1 కామెంట్:
నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి నవల నాకు ఎక్కువ నచ్చింది బాపిరాజు గారి గోనగన్నారెడ్డి కంటే. కూడా. ఇంతకాలం రుద్రమదేవి ఎవరూ సినిమా తీయలేదేం అనుకుంటూ ఉన్నాను. తీస్తున్నారని తెలిపినందుకు సంతోషం. సినిమా చూసేక చెప్పండి ఎలా ఉందో.
మాలతి
కామెంట్‌ను పోస్ట్ చేయండి