మరొక కథ;' ముంపు ':గంటేడ గౌరినాయుడు గారు రాసినది.నాగావళితీరప్రాంతంలో నీటి ప్రాజెక్టు గురించి ఒక పల్లెలో జరుగుతున్న చర్చలు,వాదోపవాదాలు,ఆందోళనలుగురించి.ప్రాజక్టు వల్ల ముంపులో ఇల్లు ఖాళీ చేసిపోవలసి వస్తుందని ఒకపక్క బెంగ.మరోపక్క నష్టపరిహారం వస్తుంది కదా దానితో ఏంచెయ్యాలని ఆలోచన.ప్రాజెక్టు ఇక్కడైక్కడకాదు దూరంగా ఎగువన కడితే మనకి మంచిదని వూరి మాస్టారి ఉపన్యాసం.కథకి పర్యవసానం ఏమీ లేదు.అనిశ్చితంగా ముగుస్తుంది.ఇంతకీ ప్రాజెక్టుకి రచయిత అనుకూలమా,వ్యతిరేకమా అనేది తెలియదు.(దరిమిలా జంఝావతి ప్రాజెక్టు పూర్తి ఐనట్లు తెలుస్తున్నది.)
జి.యస్.చలంగారి రచన 'పొగ 'అనే కథ.ఇది రోడ్డు రవాణా,పాఠశాలల ప్రైవేటీకరణకి వ్యతిరేకం గా రాసింది.ప్రభుత్వం ఎలాగనిర్లక్ష్యం,దుష్పరిపాలన ద్వారా R.T.C.బస్సుల్ని ,ప్రభుత్వ స్కూళ్ళని నిర్వీర్యం.నిరుపయోగకరంగా,మార్చిరద్దుచేద్దామనిచూస్తున్నదో వివరించారు.ప్రయివేటు రవాణాని,విద్యని ఎలా ప్రోత్సహిస్తున్నదో ఆవైనం,దానికి వ్యతిరేకంగా కథా నాయకుడు పిడికిలి ముగించడంతో కథ ముగుస్తుంది.
' చేదుఫలం ' కథ పడాల జోగారావు రచన.గ్రామీణ సహకార బాంకుల్లో,అక్రమాలు, అవి నడిచే తీరు వాటి లోతట్టు సమాచారంinside information తో రాసినది.ముకుందం అనే ఉద్యోగి తనకిష్టం లేకపోయినా కొన్ని చర్యలలో ఇరుక్కొని ఆ ఇబ్బందుల్లో నుంచి తనకున్న మంచిపేరు goodwill వల్ల బయటపడటం కథ.తోడి మేనేజర్లు బాగా ధనమూ,ఆస్తిపాస్తులు సంపాదించుకొన్నా ,తాను మాత్రం అలాగే ఉండిపోవడం బంధుమిత్రుల విమర్శకి గురి అవుతాడు.
మరొక ప్రసిద్ధ కథకుడు అట్టాడ అప్పలనాయుడు రచించినదీ' షా--- '' అనే కథ. చదరంగంలో ఎత్తులు,పైఎత్తులులాగే రాజకీయాల్లో వాటిగురించి విశదంగా రాసారు.పల్లెల్లోంచి వచ్చిన చిన్న పెట్టుబడిదార్లు ,పడమటినుంచి వచ్చిన బడా పెట్టుబడిదార్ల పోటీకినిలబడలేకపోవడం అందుకు ప్రతిగా మరొక ఎత్తు వెయ్యడం ప్రధానాంశం.I.T.,PHARMA కంపెనీల నీటి అవసరాలకోసం ప్రాజెక్టు డిజైను మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల చేసే ఆందోళనని చిన్నపెట్టుబడిదారు ప్రోత్సహిస్తాడు.స్థానికప్రజల అవసరాల్ని తీర్చేవిధంగ మొదటి డిజైనుప్రకారమే నిర్మించాలని సామాన్యప్రజలతోబాటు లోకల్ సావుకార్లు కూడా పాల్గొంటారు.