14, సెప్టెంబర్ 2014, ఆదివారం

airports




 మన ఆం.ప్ర.ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని బాగానేఉన్నవి.ఆచరణకు పనికి వస్తాయి. కొన్ని మాత్రం ఆచరణసాధ్యం కానివి.అనవసరమైన ఖర్చుతోకూడినవి/అందులో ఒకటి.; ప్రతి జిల్లాలో విమానాశ్రయం నెలకొల్పడం.ఉదాహరణకి. శ్రీ కాకుళానికి,విజయనగరానికి విమానాశ్రయాలు. భొగాపురందగ్గర అన్నివసతులూ కూడిన పెద్ద విమానాశ్రయం  కడితే చాలును.మూడు   జిల్లాల  ప్రధానపట్టణాలకిబాగా అందుబాటులో ఉంటుంది.అదిచాలు.ఇప్పుడు ఉన్న విమానాశ్రయాల నిర్వహణలోనే  నష్టాలు వస్తున్నాయట.ఇంక ప్రతి చిన్న పట్టణంలోనూ ఒక airport ఎంత waste  ఆలోచించండి. 

3, సెప్టెంబర్ 2014, బుధవారం

name of new capital of A.P.




  కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధాని నామకరణం గురించి వ్రాయదలిచాను.కొందరు దానిని N.T.R,నగర్ అని పేరు పెట్టమని సలహా ఇస్తున్నారు.కాని ఇది వాదవివాదాలకి ,కొంతమందికి అసంప్ తృప్తికి దారితీయగలదు.ఒక నాయకుడి పేరుపెట్టకుండా ,అందరికీ ఆమోద యోగ్యమైన నేను సూచించే  పేరుని అందరూ పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను.
   వందలసంవత్సరాలు ఆంధ్రదేశాన్ని అంతా పరిపాలించిన శాతవాహనచక్రవర్తుల రాజధాని ' అమరావతి ' .దానినే ' ఆంధ్రనగరి ' అనికూడా పిలిచేవారని చరిత్ర చెబుతున్నది.ఇంచుమించు ఆప్రాంతం లోనే రాజధానిని నెలకొల్పబోతున్నారు కాబట్టి కొత్త రాజధానిపేరు  '  అమరావతి '  అనికాని ' ఆంధ్రనగరి ' అనికాని  పెట్టితే బాగుంటుంది . నా అభిప్రాయంపై బ్లాగరు మిత్రుల చర్చను  ఆహ్వానిస్తున్నాను.