నేటి ఉగాదితో వసంతఋతువు ప్రవేశించింది.కాని అప్పుడే ఎండలు ముదిరాయి.కాని సాయంకాలం,రాత్రి ,చల్లగాలితో బాగానేఉన్నాయి.పగలు మాత్రం వేడిగా ఉంది.poorman's OOTYఅని పేరుబడిన ఈవూళ్ళోనే ఇలా ఉంటే ఇంక గుంటూరు,కడప, రామగుండం లో ఎలా ఉంటుందో ?మాపెరట్లోఉన్న చెట్ల మీద కోకిలారావాలు వినిపిస్తున్నవి.మామిడిపూత, చిన్న పిందెలు ఉన్నాయి.మల్లెలు ఇంకా ఇప్పుడే తొలి మొగ్గలు తొడుగుతున్నవి.
కాని కవులు వర్ణించే ఋతువర్ణన మన ఆంధ్రప్రదేశ్,తమిళనాడు (దక్షిణభారతం) కన్నా ఉత్తరాది,ముఖ్యంగా,హిమాలయప్రాంతానికి వర్తిస్తుందనుకుంటాను.మనకి వసంతంలో మండే ఎండలు,శరత్తులో ముసుర్లు,తుఫానులు.convention ప్రకారం కవులు వర్ణిస్తారు.ఏమైతేనేమి ఉగాది శుభకామనలతో ముగిస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి