అనుకోకుండా,నిన్న ఒక టీ.వీ. చానెల్ లో ' మంగమ్మశపథం B& W సినిమా ' మంగమ్మ శపథం 'చూసాను.కథ కేమిటిలే జానపదకథ.కాలక్షేపానికి బాగానేఉంది. యవ్వనం తొలగని అందాల తారలు N.T.రామారావు.జమున,హీరో,హీరోయిన్లు.రామారావు రెండు పాత్రలు తండ్రీ,కొడుకూ బోనస్. పైగా రామారావు,జమున ఇద్దరికీ మారువేషాలు!
సంగీతం మధురంగా ఉంది.L.విజయలక్ష్మి నృత్యాలు మనోహరంగాఉన్నాయి.అంచేత చూడవచ్చును.
ఈకథ అంతకుముందు రెండు సార్లు తీశారు.వైజయంతీమాల తల్లి వసుంధర తో మొదటిసారి ,రెండోసారి భానుమతితోను తీసారు.పాపులర్ కథా ,స్టార్సు కాబట్టి మూడు చిత్రాలూ విజయవంతమయాయి.
1 కామెంట్:
అన్నట్లు ఇదే కథను భానుమతి హీరోయిన్ వేషం కట్టగా హిందీలోనూ తెలుపు-నలుపులో తీసారు. మిగతా వివరాలు గుర్తు లేవు.
అస్లు ఈ కథ మథిర సుబ్బన్న దీక్షితులుగారి కాశీమజిలీ కథల్లోనూ ఉందని జ్ఞాపకం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి