27, డిసెంబర్ 2012, గురువారం



  


  ఈనాడు (27-12-12)తెలుగుగడ్డపై 37 స.;తర్వాత తిరుపతిలో రాష్ట్రపతిచె ప్రారంభింపబడిన4వ ప్రపంచ తెలుగుమహాసభల ప్రారంభోత్సవం బాగానే జరిగిందని నా అభిప్రాయం.విమర్శలు ఎలాగూ ఉంటాయి.కొన్ని పొరబాట్లు కూడా జరిగిఉండవచ్చును.కాని మొత్తం మీద జయప్రదంగానే జరిగిందని చెప్పవచ్చును.' మా తెలుగుతల్లి ' ప్రార్థనాగీతం సుశీల, బాలసరస్వతి బాగా పాడలేకపోయారు,వృద్ధాప్యంవలన.ఎవరైనా మంచి యువ గాయనీగాయకులచే పాడించవలసింది.
  కిరణ్కుమార్ రెడ్డి గారి ప్రసంగాన్ని మామూలుగా హేళన చెస్తూఉంటారు.కాని ఆయన తెలుగు ఈమధ్య improve  అయింది.చిత్తూరు యాస ఉండవచ్చును ,కాని అందులో తప్పేమీలేదుకదా.కొంచెం తప్పులున్నా  గవర్నర్ గారు తెలుగు బాగానే మాట్లాదుతారు. 
  సభలకి good start  అనుకోవచ్చును.

18, డిసెంబర్ 2012, మంగళవారం

backwardness-2



 


  ఆర్యా,మీ గణాంకాల్ని  అంగీకరించడానికి అభ్యంతరం ఏమీ లేదు.ఉభయగోదావరి  జిల్లాలు నీటివసతివలన పంటలు అధికంగా పండుతాయని  తెలిసిందే.కాని ఇతరవిషయాలలో అంత ఎక్కువ తేడాలు లేవు. (2011 లో ప్రభుత్వ గణాంకాలప్రకారం.)ఇక్కడివాళ్ళలో enterprise తక్కువ.నేను చెప్పదలుచుకొన్నది అదే.అన్నిటికీ ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చో లేము కదా.విశాఖరేవు,పరిశ్రమలు,కాకుందా ఫెర్రోఅలాయిస్ పరిశ్రమ  ఉన్నది.అణువిద్యుత్కేంద్రం తయారవుతున్నది. ఫార్మా కారిడర్ పరిశ్రమలు ఉన్నవి.వెనుకబడినతనం అనేది మన మెదడులో ఉన్నది అని చెప్పడమే నా ఉద్దేశం.ఇది తెలంగాణా వారికీ వర్తిస్తుంది .                                     

11, డిసెంబర్ 2012, మంగళవారం

కమనీయం: Backwardness

కమనీయం: Backwardnesscpbrownsevasamithi@yahoo.com

10, డిసెంబర్ 2012, సోమవారం

Backwardness




 వెనకబడిన వాళ్ళం,వెనకబడ్డ ప్రాంతం అని చెప్పుకోడం ఇప్పుడు ఒక అలవాటయింది.ఉత్తరాంధ్ర(నాది ఆ  ప్రాంతమే ఐనా )బాగా వెనకబడింది అంటుంటారు.కాని నేను అలా అనుకోను.ఈ ప్రాంతంలో  వర్షాలు బాగానే పడతాయి.ఏరులు,వాగులు చాలాఉన్నవి.పంటలు బాగానే పండు తాయి.ఇటీవల విద్యాలయాలు,ఆస్పత్రులు ,బాగావృద్ధిచెందాయి.పర్యాటక రంగం కూడా పెరుగుతున్నాది.మధ్యకోస్తా ఆంధ్రులు ఇక్కడ కొండలు,అడవులు ఉండటం చేత మీరు వెనకబడ్డారని అంటారు.అవి ఉండటం అదృష్టం,అందం.అడవులు ,కొండలు లేని పశ్చిమ గోదావరి,కృష్ణా ,గుంటూరు జిల్లాలకన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు  అందంగాఉంటాయి.గణాంకాల ప్రకారం కూడా అంత పెద్ద తేడా ఏమీ లేదు.తెలంగాణా జిల్లాలు కూడా (కొంచెం తరతమ భేదాలు తప్పించి ) వెనకబడలేదని నా అభిప్రాయం.
  

7, డిసెంబర్ 2012, శుక్రవారం

GLOBALIZATION (contd.)





  ఐతే ప్రపంచీకరణ వలన నష్టాలు ,లాభాలు ఉన్నాయి.
    నష్టాలు;-1.దేశీయ పరిశ్రమలు దెబ్బతినడం.2.ఆర్థికంగా విదేశాలపైన ఆధారపడవలసి రావడం.3.విదేశ భాషాసంస్కృతుల కు లొంగిపోవడ4.ఇతరదేశాల్లో కలిగే ఆర్థిక, రాజకీయ సంక్షోభాల వలన మన ప్రయోజనాలు దెబ్బతినడం.ఇటువంటి నష్టాలు ఉన్నాయి.
 లాభాలు;- 1.మన ఎగుమతులవలన ఆర్థికలాభం.2.ఇతరదేశాల్లో ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించడం.3.సాంకేతిక,వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల సహాయసహకారాలు.4.ఇతర దేశాల్ల్లో మనం పలుకుబడి,వనరులు ,ముడిపదార్థాలు సంపాదించుకోవడం వంటి లాభాలు కూడా ఉన్నాయి .
   మనం గుర్తించవలసిన అంశం ; పూర్వం లాగా మనదేశం ఇప్పుడు బలహీనమైన,పేదదేశం కాదు.అభివృద్ధి పథంలో పయనిస్తూ బలీయమౌతున్న దేశం. మనకంపెనీలు ఇతరదేశాల్లో విస్తరిస్తున్నాయి.అక్కడ మనవాళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించుకొంటున్నారు.మిలిటరీ, ఆర్థికసంపత్తిలో ,మనదేశం p.p.p. ప్రకారం 4వస్థానంలో ఉంది.అందువలన ప్రపంచీకరణ అంటే భయపడనక్కరలేదు.అందులోఉన్న మంచి ని తీసుకొని ,చెడ్డని వదిలివేయడం నేర్చుకొంటే సరిపోతుంది. 

Globalization





  ఇటీవలకాలంలో ప్రపంచీకరణ(globalization) గురించి ఎక్కువగా వినిపిస్తున్నది.తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి.ఇప్పుడు ఎక్కువైనా పూర్వకాలమ్నుంచి ఈ ప్రక్రియ కొంత జరుగుతూనేఉన్నది.ఈ మాటకి అర్థం ఏమిటి?ఒక్క ఆర్థికవిషయాల్లోనే కాదు; రాజకీయ,సాంఘిక,భాషా సాంస్కృతిక వ్యవహారాలన్నిటి లోను దేశాల మధ్య పరస్పర ప్రభావము, ఆధిక్యము,సమ్మిశ్రమము జరగడమే.రోమన్ సామ్రాజ్యకాలంలో దాని ప్రభావం చాలా దేశాలపై పడినది.మనదెశ ప్రభావం తూర్పు,ఆగ్నేయ ఆసియా దేశాలలో బాగా కనిపిస్తుంది.16వ శతాబ్దమ్నుంచి పశ్చిమ యూరప్  సామ్రాజ్యాల విస్తరణ వలన ఆసియా,ఆఫ్రికా ,అమెరికా ఖండాలలో యూరప్ ప్రభావం వాటిపై పూర్తిగా పడింది.అంతకు ముందు ఇస్లాం ద్వారా ఆరబ్ మత,భాషా ,సంస్కృతుల ప్రభావం అట్లాంటిక్ నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా వ్యాపించింది కదా.ఆధునికవిజ్ఞానం,పరికరాలవలన యీ ప్రపంచీకరణ అతివేగంగా జరుగుతున్నది .(to be continued) .