16, సెప్టెంబర్ 2012, ఆదివారం

Lady Doctors.--pioneers

-
 

  ఈ వ్యాసం నా వ్యాస సంపుటి ' సంధ్యారాగం 'నుంచి తీసి రాస్తున్నాను.మహిళల గూర్చి రాస్తున్న సౌమ్య గారి వంటి వారికి ఉపయోగపడ వచ్చును.
 
 '' స్త్రీలు--వైద్యవృత్తి . ''
  -------------------------
  ఈ రోజుల్లో మహిళలు వైద్య వృత్తి లో అన్ని శాఖల్లోను విరివిగా ఉన్నారు.కాని ఒకప్పుడు మాత్రం చాలా తక్కువగా ఉండేవారు.ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోడమే బాగా తక్కువ కదా. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో వైద్యవృత్తిలో చేరి అందరికీ,తరువాత వారికీ మార్గదర్శులైన మహిళల గురించి తెలియజేస్తాను.
 1. మిస్ హ్యూలెట్ --( Miss Hewlett )1866 మొట్ట మొదట మన దేశంలో వైద్య వృత్తి అవలంబించి మంత్రసానులకు(midwives ) కి తరిఫీదు ఇచ్చింది.
 2.ఆనందీబాయి జోషి M.D.-- అమెరికాలో వైద్యం చదివి కొల్ హాపూర్ హాస్పటల్ స్థాపించిన ప్రథమ భారతీయ మహిళ (A.D.1888 )
 3. మిస్ ఆనీ వాక్ (Miss.Anne walke L.M.& S)భొంబాయిలో మెడికల్ పట్టా పొందిన మొదటి మహిళ.
 4.మిస్ సోఫియా ఇడా స్కుడ్డర్ (Miss.Sophia Ida Scudder M.D.DSc.) భారత దేశంలో జన్మించి ,అమెరికాలో వైద్యం చదివి ,ప్రసిద్ధిపొందిన రాయవెల్లూరు హాస్పటల్ ,మెడికల్ కాలేజి స్థాపించిన ప్రఖ్యాతి పొందిన మహిళ (1918)
 5.మిసెస్.ముత్తు లక్ష్మీ రెడ్డి M.D.C.M. వైద్య రంగం లోనే గాక సాంఘికసేవ ,జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో కూడా కృషి చేసారు. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి వైస్ ప్రెసిడెంట్ గా కొన్నాళ్ళు పని చేసారు.1954 లో  మద్రాస్ కేన్సర్ హాస్పటల్ ని స్థాపించారు.
 6.డా .కెప్టెన్ లక్ష్మి (Dr.Captain Lakshmi ) .నేతాజీ  సుభాస్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లో పనిచేసారు.ప్రపంచ యుద్ధం తర్వాత వైద్యవృత్తిలో ఉంటూ ,సాంఘిక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.ప్రతిపక్షాల  తరఫున ఒకసారి భారత్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడి పోయారు.ఇటీవలనే  
మరణించారు.
 7.డాక్టర్ సుశీలా నయ్యర్.M.D. -ఢిల్లీ ఆరోగ్యమంత్రి గా (1952-1955) పనిచేసారు.కాంగ్రెస్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.1962లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా నియమింపబడ్డారు.సేవాగ్రాం  లో కస్తూర్బా ట్రస్టు ద్వారా పలు ఆరోగ్య కార్యక్రమాలను నిర్వర్తించారు.
 8.డాక్టర్.లాజరస్ (Dr.H.M.Lazarus M.B.B.S.'M.R.C.P.'F.R.C.S.) వాల్తేరులో జన్మించి కొన్నాళ్ళు విశాఖపట్నం  K.G.హాస్పటల్ లో గైనిక్ సర్జన్ గా పనిచేసారు.మేము మెడిసిన్ చదువుతూ ఉన్నరోజుల్లో ఆవిడ పనిచేస్తూ ఉండేవారు.2వ ప్రపంచ యుద్ధ కాలంలో మిలిటరీలో పనిచేసారు.నర్సింగ్,మిడ్వైఫరీ స్కూలుని (Nursing &Midwifery school ) స్థాపించారు.
  కొద్దిమంది pioneers ఐన లేడీ డాక్టర్ల గురించి మాత్రమే వ్రాసాను.ఇటీవల కాలంలో వీరిని అనుసరించి వైద్య,ఆరోగ్య రంగాల్లో వివిధ శాఖల్లో ప్రవీణులు,ప్రఖ్యాతులైన మహిళలు చాలా మంది ఉన్నారు.
              -----------------
   

15, సెప్టెంబర్ 2012, శనివారం

Alfred Hitchcock.--contd.



 6వ దశకంలో హిచ్కాక్ శీతలయుద్ధం (cold war between America and Soviet Union) నేపథ్యంలో రెండు చిత్రాలు తీసాడు.1.టొపాజ్ Topaz.దీనికి లియాన్ యూరిస్ నవల ఆధారం.టొపాజ్ అన్నది ఒక కోడ్ నేము.మధ్యలో రచయితకి,దర్శకుడికీ వచ్చిన భేదాభిప్రాయాల వల్ల అంకున్నట్లు రాలేదు.అంతగా విజయం సాధించలేదు.క్యూబా అమెరికా పక్కనే ఉన్న చిన్న కమ్యూనిస్ట్ దేశం.అక్కడ సోవియెట్ తన క్షిపణుల్ని పెట్టడం వలన ప్రపంచయుద్ధం వస్తుందని భయపడ్డారు.చివరకు రష్యా వాటిని ఉపసంహరించుకోడం వలన ఆ సంక్షోభం తొలగిపోయింది.దీనినే cuban crisis అంటారు.2.టార్న్ కర్టెన్ torn curtain ఇది బెర్లిన్  కమ్యూనిస్ట్ పాలనలో ఉన్నప్పుడు జరిగినట్లు తీసిన కథ.రెండిటి లోను గూఢ చారి చర్యలు,ఎత్తుగడలు,క్షిపణి రహస్యాలు,(missile secrets ) ప్రధానపాత్ర వహిస్తాయి.కథ అనేక మలుపులు తిరుగుతుంది.
 తర్వాత మళ్ళీ ఆయన తనకి ఫేవరెట్ కథల వైపు మళ్ళాడు. 1.మార్నీ - ఇందులో జేంస్ బాండ్ గా ప్రసిద్ధిపొందిన షాన్ కానరీ హీరొ.  దొంగ అని తెలిసినా మార్నీ అనే అందగత్తె వ్యామోహంలో పడి,ఆమె దొంగ అని తెలిసినా    పెళ్ళి చేసుకొంటాడు.కాని frigidity వలన ఆమె కాపురం చేయలేకపోతుంది.అందుకు కారణాలు అన్వేషిస్తూ మార్ని తల్లిని కలుసుకొంటాడు. ఆమె ఒక వేశ్య.మార్ని చిన్నతనంలో ఒక విటుడు తల్లిని గట్టిగా కొడుతూఉంటే సహించలేక వాడిని కత్తితో పొడిచి చంపుతుంది.అప్పటి నుంచి ఆమెకు మగవాళ్ళమీద కోపం.అసహ్యం.చివరికి psychiatric treatment వలన బాగయి హీరోతో కాపురం చేస్తుంది.ఈ సినిమాలో మనస్తత్వ  పరిశోధన ,child trauma  వంటి విషయాలతో ఉంటుంది.
  ఫ్రెంజీ (frenzy) మళ్ళీ లండన్ కూరలమార్కెట్ (covent garden ) ప్రాంతంలో వరుస హత్యల మీద సినిమా.ఇది రీమేక్.ఇద్దరు కవలల్లో ఒకడు హంతకుడు.కాని నిర్దోషి అమాయకుడి మీద ఆరోపణలు ,పోలికలవలన,వస్తాయి.చివరకు అసలు హంతకుడు పట్టుబడతాడు.నెక్ టై హత్యలని పూర్వం నిజంగా జరిగిన ఘటనలే ఈ సినిమాకి
ఆధారం అంటారు.
  ఆయన ఆఖరి చిత్రం 1976 లో తీసాడు.కొన్ని టీ,వీ.సీరియల్స్,షోలు కూడా నిర్వహించాడు. 5దశాబ్దాలపాటు (50 సంవత్సరాలపైగా )సాగిన అల్ఫ్రెడ్ హిచ్ కాక్ సినీ జీవితాన్ని అంచనా వెయ్యడం కష్టమే.ఒక రకం (genre) సిన్మాలకి ఆయన పెట్టిందిపేరు.master of suspense అని పేరుగాంచాడు.50 చిత్రాల్ని తీసాడట.అందులో నేను చూసిన కొన్నిటి గురించే రాసాను .ఇప్పటికీ DVD  లో దొరుకుతున్నవి .
   చివరగా హిచ్ కాక్ చిత్రాల్లోని ప్రత్యేకతలు కొన్ని వివరిస్తాను.1,నవరసాల్లో భయానక,బీభత్స,అద్భుత రసాల్ని ఎక్కువగా కలిగి ఉంటాయి.2.ఉత్కంఠ suspense ప్రధానం.నేరం crime  ప్రధానాంశం.కాని ఎక్కువ రక్తపాతం ,పోరాటాలు ఉండవు.3. మంచి నవలల ఆధారంగా చాలా సినిమాలు తీసాడు.4.కథనంలో ప్రావీణ్యం ఉంటుంది.కొన్నిటిలో ప్రారంభంలోనే హంతకుడెవరొ తెలిసినా కథనంతో ఆసక్తి కలిగిస్తాడు.5.కొన్ని సినిమాల్లో ఆఖరి సీను climax అద్భుతంగా ఉంటుంది.(ఉదాహరణకు;
 స్ట్రేంజెర్స్ ఒన్ అ ట్రైన్ లో కార్నివాల్,వెర్టిగోలో చర్చ్ శిఖరం,నార్త్ బై నార్త్ వెర్త్ లో
 రష్మోర్ పర్వతం ,మాన్ హూ న్యూ టూ మచ్లో కాన్సర్ట్ హాల్ -ఈ దృశ్యాలన్నీ గొప్పగాఉంటాయి. 6.పెద్ద సెట్టింగులు,అనవసరపు సీనులు ఉండవు.7.మామూలు మనుషుల్లో దాగిఉండే దురాశ, క్రౌర్యం వెల్లడిస్తాడు.వాస్తవికతేగాని అభూతకల్పనలు ఉండవు.8.ఈయన సినిమాలు కొన్ని చాలా మలుపులతో, చిక్కుగా ఉండి జాగ్రత్తగా చూడక పోతే అర్థం కావు.
  గొప్పవాడయినా ,సామాన్యుడయినా ప్రతి మనిషి జీవితంలో ఒక ఉచ్చదశ ఉంటుంది.
   ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ జీవితంలో 1950--1960 మధ్య స్వర్ణయుగం అంటారు.అప్పుడు ఆయన తీసిన సినిమాలు క్లాసిక్స్ గా పరిగణింపబడి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టాయి.
                      (సమాప్తం)  
 
                             

ALFRED HITCHCOCK --contd.



  1954లో రెయర్విండోrear window సినిమా జేంస్ స్టీవర్ట్,గ్రేస్కెల్లీ తో తీసాడు.హీరో కాలు విరిగి మంచం పాలయి ఊసుపోకకు కిటికీ లోనుంచి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ని గమనిస్తూఉంటాడు.ఎదురుగా ఒక ఫ్లాట్లో భర్త భార్యని హత్యచేసి,శవాన్ని ఎక్కడో దాచినట్లు అనుమానిస్తాడు. మొదట్లో అతని ప్రియురాలు ,డిటెక్టివ్ మిత్రుడు నమ్మరు.చివరికి వాళ్ళ సాయంతో రహస్యాన్ని చేదిస్తాడు.ఇందులో గ్రేస్ కెల్లీ విలన్ ఇంట్లోకి పరిశోధించడానికి వెళ్ళగా అప్పుడే వాడు తిరిగి రావడం ,ఆమె దాక్కొని ఎలాగో తప్పించుకొనడం,  ఇదంతా నిస్సహాయంగా కిటికీ లోంచి చూస్తున్న స్టీవార్ట్  తో బాటు మనమూ చాలా సస్పెన్స్ అనుభవిస్తాము.
 the man who knew too much sinimaaలో హీరోకి ఒక వీ.ఐ.పీ. ని హత్య చెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నం తెలుస్తుంది.ఆ ముఠా అతని నోరు మూయించడానికి అతని కొడుకును కిద్నాప్ చేస్తారు.ఇందులో డోరిస్ డే పాడిన కేసెరాసెరా  అనేపాట ప్రసిద్ధమైనది.చివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు ముఠా జరపబోయిన హత్యాప్రయత్నాన్ని హీరో భగ్నం చేస్తాడు.ఈ సీనులో సంగీతం తారస్థాయికి చేరుతూ దానితో బాటు action,suspense పెరుగుతాయి. గొప్పగా ఉంటుంది.
  55లో to catch a thief సినిమాలో కేరీగ్రాంట్ పూర్వం పెద్ద దొంగగా ఉండినా ప్రస్తుతం మర్యాదగా జీవితం గడుపుతూ ఉంటాడు.సంపన్నుల విడిది ఫ్రెంచ్ రివేరా లో వరసగా ఆభరణాల చోరీ జరుగుతుంటాయి.పోలీసులు గ్రాంట్ని అనుమానించి నిఘా పెడతారు.తన నిర్దోషిత్వాన్నొ నిరూపించుకొనడానికి అతడు ప్రయత్నించి ఎలాగో అసలు దొంగను పట్టుకుంటాడు.ఇంతకీ అసలు దొంగ హీరో స్నేహితురాలయిన ఒక యువతే ! ఈ చిత్రానికి అకాడమీ అవార్డు లభించింది.
  58లో వెర్టిగో vertigo అనే చిత్రం  ఒక నవల ఆధారంగా తీసారు.జేంస్ స్టీవార్ట్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్.అతనికి ఎత్తయిన స్థలాలంటే భయం.acrophobia అంటారు. అందువలన ఒక హత్యను సరిగా శోధించలేక పోతాడు.చర్చి శిఖరం నుంచి పడిపోయి మరణించింది అనుకొన్న స్త్రీ మరలా కనిపిస్తే ,ఆమె వెంటబడి రహస్యాన్ని కనుగొంటాడు.జరిగిందేమంటే భర్త భార్యను చంపి చర్చి పై నుంచి తోసివేసి ఆమె లాగే ఉన్న మరొక స్త్రీ చంపోయినట్లు డిటెక్టివ్ ని నమ్మిస్తాడు.ఇటీవల అమెరికాలో ప్రేక్షకుల సర్వేలో దీనిని అత్యుత్తమ చిత్రం గా ఎన్నుకున్నారు.
 1959లో  North by North west వచ్చింది.ఇందులో మళ్ళీ కేరీ గ్రాంట్ హీరో.తనను చంపబోయే విలన్ల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నాలతోనే కథ నడుస్తుంది.శత్రువు హెలికాప్టర్ తో దాడి చేసినప్పుడు గోధుమపొలాల్లో  దూరి తప్పించుకొనేసీను,చివర్లో మౌంట్  రష్మోర్ మీద తీసిన దృశ్యాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.(mount Rushmore మీది giant size నలుగురు అమెరికన్ ప్రెసిడెంట్ల ముఖాల  చెక్కడాలపైన ఈ దృశ్యం చిత్రీకరించారు.
   1960 లో సైకో  (psycho) చిత్రం తీసాడు.ఇది ఒక కల్ట్ సినిమా అని చెప్పవచ్చును.ఒక నవల ఆధారంగా తీసింది.మోటల్ షవర్లో జరిగిన హత్య ,తల్లి శవం (mummy) తో సైకో సంభాషణ ,చివరి సీను అన్నీ అప్పట్లో కొత్త.జలదరింపు కలిగిస్తాయి.తర్వాత సైకో ని అనుకరిస్తూ చిత్రాలు ఎన్ని వచ్చినా ఇదే అన్నిట్లోకి ఉత్తమమైనదిగా పేరు పొందింది.(psychic killers are common in America.Now they are increasing in India also )ఈ చిత్రాన్ని నేను రెండు సార్లు చూసాను.
   తర్వాత బిర్డ్స్ (BIRDS ) అని ఒకనవల ఆధారంగా తీసాడు.ఇందులో వేలకొద్దీ పక్షులు మనుషుల మీద దాడి చేస్తుంటాయి.నాకు అంతగా నచ్చలేదు.
  (మిగతా మరొక సారి.)
 

13, సెప్టెంబర్ 2012, గురువారం

Alfred Hitchcock



 ఆల్ఫ్రెడ్  హిచ్కాక్  గురించి కొంత సమాచారం వికీపీడియా లో లభ్యమౌతుంది.కాని స్వయంగా ఆయన సినిమాలు చూసిన అనుభూతి వేరు.జ్ఞాపకమున్నంతవరకు నేను చూసిన చిత్రాల గురించి రాస్తాను.కొన్ని టీ.వీ.పుణ్యమా అని మళ్ళీ చూసాను.ఆ రోజుల్లో సెసిల్.బి.డీమిల్లి అనే ఆయన భారీ సెట్టింగులతో పౌరాణిక ,చారిత్రక సినిమాలు తీసాడు.వాల్ట్ డిస్నీ కార్టూన్ సినిమాలు తీసే వాడు.హిచ్కాక్ ప్రత్యేకత ఉత్కంట,నేరము (suspense,crime ) ప్రధానమైనవి.అలాగని పోరాటాలు,రక్తపాతం ఉండవు.కొన్ని సినిమాల్లో హంతకుడెవరో ముందే తెలుస్తుంది.కాని,సస్పెన్స్ తో కథ నడిపిస్తాడు.ఆయన ప్రకారం కథా,స్క్రీన్ ప్లే పూర్తిగా సిద్ధమైతే సినిమా  దాదాపు పూర్తి అయినట్లే.అతడు పనిచేసినకాలం,తన మాటల్లోనే మూకీ సినిమాలనుండి తెలుపు-నలుపు టాకీలు,రంగుల సినిమాలు,సినిమాస్కోపు,3 Dలు ,టెలివిజన్ సీరియల్స్ వరకు చురుకుగా సాగింది.ఆయన సినిమాలు చాలా వరకు ప్రసిద్ధ నవలలు,లేక యదార్థ సంఘటనలని ఆధారంగా తీసినవే.ఇంగ్లాండ్లో మొదట్లో సినిమాలు తీసి పేరు గడించాడు.అవి 1.MAN WHO KNEW TOO MUCH 2.39 STEPS.3.THE LADY VANISHES.కాని వీటిని నేను చూడలేదు.
  తర్వాత అంతర్జాతీయ సినిమా కెంద్రమైన హాలీవుడ్ కి వెళ్ళి 1939 లో డాఫ్నె ద్యు మారియర్ ప్రసిద్ధనవల రెబెకా ని తెరకెక్కించాడు.దీనికి అకాడమీ అవార్డు కూడా వచ్చింది.ఇందులో ఉత్కంఠ ఉంటుంది కాని క్రైం ఉండదు.పెద్ద భవనంలో ఒంటరిగా ఉన్న యువతి అనుభవాలతో గొప్పగా ఉంటుంది.తర్వాత shadow of doubt తీసాడు.ఆయన్ని అడిగితే అదే తన ఫేవరెట్ సినిమా అన్నాడట.కాని నేను చూడలేదు.తర్వాత suspicion  అన్న సినిమాలో భార్యను హత్య చెయ్యడానికి ప్రయత్నించే భర్తగా ప్రసిద్ధుడైన హీరో కారీ గ్రాంట్ చేత అతని ఇమేజ్ కి విరుద్ధంగా వేయించాడు.విజయం సాధించాడు.అప్పటినుండి (1945)1960 దాకా ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఎన్నో సినిమాలు తీసాడు.master of suspense గా పేరు మారు మోగి పోయింది.
 1945లో స్పెల్బౌండ్ ( spellbound) చిత్రం మనస్తత్వ పరిశోధన,మతిమరుపు (amnesia) మీద తీసాడు.గ్రిగరీపెక్,ఇంగ్రిద్ బెర్గ్మన్ నటించారు.మొదటిసారి అర్థం కాలేదు. మళ్ళీ చూసినప్పుడు తెలిసింది.ఇందులో ప్రసిద్ధచిత్రకారుడు కంపోజ్ చేసిన స్వప్నదృశ్యం ఒక ప్రత్యేకత.నొటొరియస్( notorious )లో మళ్ళీ ఆ హీరో హీరోయిన్లతోనే 2వ ప్రపంచయుద్ధ నేపథ్యంలో గూఢ చర్యల గురించి తీసినది.
  రోప్ (rope) ఇందులో ఒక హాల్ లోనే కథ అంతా జరుగుతుంది.ఇద్దరు స్నేహితులు మూడవ వాణ్ణి చంపి ఒక పెద్ద భోషాణంలో శవాన్ని దాచేస్తారు.చాలమంది అతిథులు వస్తూపోతూ ఉంటారు .చివరికి డిటెక్టివ్ జేంస్ స్టీవార్ట్ రహస్యం కనిపెడతాడు.
   
   strangers on a train ;దీనిగురించి గతసారి వివరంగా రాసాను.క్లైమాక్స్ సీను చాలా బాగుంటుంది.
 Dial M for murder  భర్త తనమీద అనుమానం రాకుండా భార్యను కిరాయి హంతకునితో చంపించడానికి ప్లాను నడిపిస్తాడు.కాని అది బెడిసి కొట్టి తిరిగి అతని దోషం బయలుపడుతుంది.కిరాయిహంతకుడితో  ఆత్మరక్షణకోసం చెసిన పోరాటంలో భార్య వాడినే చంపివేస్తుంది.అంతా సస్పెన్స్ తో నడుస్తుంది.ఇది ఒక నాటకం ఆధారంగా తీసినది.తెలుగులో ప్రఖ్య శ్రీ రామ్మూర్తి గారు నాటకం గా అనువదించేరు.
   (మిగతా మరొక సారి.)

3, సెప్టెంబర్ 2012, సోమవారం


birthdays


 

 మా చిన్నప్పుడు 10,12 ఏళ్ళ దాకా మాత్రమే పుట్టిన రోజులు జరిపేవారు.పొద్దుటే తలంటిస్నానం తప్పదు.కొత్తబట్టలిచ్చి కట్టుకోమనేవారు.పూజచేసి దీవించవాళ్ళు.ఏదో ఒక పిండివంటతో భోజనం పెట్టేవారు.అంతా ఇంటిలోనే జరిగిది.ఎవరినీ పిలవడం అదీ ఉండేదికాదు.పెద్దయాక ,పుట్టినరోజు జరుపుకొనేవాళ్ళుకాదు.
  కాలక్రమాన అనేకమార్పులు వచ్చాయి.గ్రీటింగ్స్ పంపడం.పదిమందినీ పిలిచి పార్టీ ఇవ్వడం .బహుమతులు,కేక్ కట్చెయ్యడం ఇవన్నీ వచ్చాయి.ఇంకా సంపన్నులైతే ,ఏ 5 స్టార్ హొటల్ లో నో రిసెప్షన్ .పాటలు,డాన్సులు ,ఖరెదైన విందు,gifts ఇలా ఘనంగా చేస్తున్నారు.సరే,ఎవరి ఇష్టంప్రకారం,తాహతు బట్టి వాళ్ళు చేసుకొవచ్చును.ఆ హక్కు,స్వేచ్చ వారికి ఉన్నాయి.
  కాని ఒక్క సంగతి.గరికపాటి అవధాని గారు చెప్పినట్లు కొవ్వొత్తులు వెలిగించి ,ఉఫ్ మని ఆర్పేయడం మంచిదికాదు.అశుభం.దాని బదులు జ్యోతి ( లు ) వెలిగించి ఆర్పకుండా ఉంచడం  సంప్రదాయకంగ,శుభకరంగా ఉంటుంది.మిగతా కార్యక్రమాలన్నీ,వారి ఇష్టప్రకారం. జరుపుకోవచ్చును.