While writing about environment,I mentioned about the compound of my house.Some friends asked me to attach photos to illustrate.so,I have attached 3 photos of the same.
27, ఆగస్టు 2012, సోమవారం
26, ఆగస్టు 2012, ఆదివారం
20, ఆగస్టు 2012, సోమవారం
Environment stories
కన్నడభాషలో 'పరిసరదె కతగళు 'అనే పుస్తకాన్ని శ్రీ శాఖమూరు రామగోపాల్ గారు 'పర్యావరణ కథలు ',అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసారు.కు.వెం.పు.(ప్రసిద్ధరచయిత,ప్రొఫెసర్,జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ) గారి కుమారుడు పూర్ణ చంద్రతేజస్వి కన్నడంలో రాసినవి.ఆయన స్వచ్చందంగా ,నగరాలకు దూరంగా పడమటి కనుమల దట్టమైన అడవుల్లో,శృంగేరికి దగ్గరలో పొలంకొని వ్యవసాయం చేస్తూ అక్కడే ఉండిపోయారు.అక్కడ తన అనుభవాలను,యదార్థ సంఘటనలనే చిన్న కథలుగామలచి రచించారు.ఆ ప్రాంతపు వాతావరణం,అడవులు,వన్యప్రాణులు,పల్లెప్రజలు,వాళ్ళ అలవాట్లు, నమ్మకాలు,చెట్టుచేమలు,జీవజాలం (flora and fauna )సమస్తం మనం తెలుసుకోవచ్చు.ఇందులో ఆయన నవ్వుపుట్టించే ( misadventures ) ఘటనలు కూడా ఉన్నాయి.క్రమంగా అంతరిస్తున్న వన్యప్రాణులు,తరిగిపోతున్న అటవీ సంపద ,మాసిపోతున్న పాత వృత్తులు,కులాలు,జీవన శైలులు గురించి రచయిత ఆవేదన స్పష్టమౌతుంది. వ్యవసాయదారుల పరిస్థితిని తెలిపే ఈ వాక్యాలు చూడండి. '' మైసూరు నుంచి వ్యవస్థను చావనీకుండా వ్యవసాయవృత్తిని చేపట్టిన నాకు అతను వ్యవసాయాన్ని బాల్ బాయ్ ఉద్యోగంకన్న తక్కువ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం సహించలేదు నామనస్సుకు.అయితే నా ముందు జీవితం దిగులయ్యేట్లుగా ,అతను భవ్యభారతదేశంలో అందరిచే తిరస్కరించబడిన రైతువర్గం లోని దారుణ స్థితిగతుల సత్యమ్ను తెలుపుతున్నోడి లాగ నాకు అంపించింది. ''
రామగొపాల్ గారు రాయచూరు జిల్లాలో కొన్నాళ్ళు వ్యవసాయం చేయడంవలన,కన్నడభాష,దాని నుడికారం తెలుసుకొనడం వలన తేజస్విగారి యీ కన్నడ పుస్తకాన్ని చక్కగా అనువదించగలిగారు.వన్యప్రాణి ప్రేమికులూ,అడవులు,పర్యవరణ ప్రియులూ తప్పక చదవవలసిన కథలపుస్తకం ఇది.దీనిని తెలుగువారికి అందించిన శ్రీ శాఖమూరు రామగొపాల్ గారిని అభినందిస్తున్నాను.
15, ఆగస్టు 2012, బుధవారం
INDEPENDENT INDIA-a summary
అందరికీ స్వాతంత్ర్య దినశుభాకాంక్షలు.
60 ఏళ్ళ నుంచి ,బ్రిటిష్ పరిపాలనాకాలం నుంచి చూస్తున్నానుకాబట్టి,ప్రజలు,ప్రభుత్వం సాధించిన అభివృద్ధి,విజయాలు,పొందిన అపజయాలు ,ఇంకా సాధించవలసినవి ,ఏపార్టీ కోణం లోనుగాక,సామాన్యపౌరుడిగా రాస్తున్నాను.
1,1947-1960 'నెహ్రూగారి హయాం.కులమతభేదంలేని రాజ్యాంగం అమలులొకితేవడం.పంచాయతీరజ్ అమలు.హిందుకోడ్ సవరణ ,స్త్రీలకు హక్కులుకల్పించదం,స్వేచ్చాయుత ప్రజాస్వామికం,ఎన్నికలు,; ప్రైమరీ ఆరోగ్యకేంద్రాలు,I.I.T.,A.I.I.M.S.వంటి విద్యాసంస్థలస్థాపన,ప్రభుత్వరంగంలో చాలా భారీ పరుశ్రమల స్థాపన,ముందుచూపుతో అణు పరిశోధన,అంతరిక్షపరిశోధనా కేంద్రాల ఏర్పాటు.భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థాపన.
అపజయాలు తీవ్ర విమర్శలు; శాంతికాముకత్వంతో రక్షణావసరాలు అశ్రద్ధచేయడం.చైనాతో యుద్ధంలో ఓటమి.కాశ్మీర్ ని సంపూర్ణంగా విలీనం చేయకపోవడం. లైసెన్స్- పర్మిట్రాజ్యంగా మారడం.
2.1960-1980 ఈకాలంలో ఆర్థికాభివృద్ధి మందగించింది.నెహ్రూ,లాల్బహదూర్శాస్త్రిల మరణం.సిండికేట్తో ఇందిరాగాంధి తగవు.ఎమర్జెన్సీ విధింపు.నక్సలిజం,ఖలీస్తాన్ ఉద్యమాలతో హింస, కరువుకాటకాలు. అశాంతి.
పాజిటివ్గా ; పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ని విడగొట్టడం. ఆటంబాంబుని పేల్చడం ,సైనికంగా దేశం బలపడటం.ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడం.హరితవిప్లవాన్నిసాధించి (greenrevolution)కరువుకాటకాలనుంచి బయటపడటం.
1980-1990 ;అబివృద్ధికి మొదటవేసిన బీజాలు క్రమంగాఫలించడం.communication revolution ,టీ.వీ. టెలిఫోన్ల విస్తరణ ,పట్టణీకరణ ప్రారంభం.
1990-2000;నరసిమ్హారావుగారి ఆర్థికసంస్కరణలు సరళీకరణ ( liberalization) వలన ఆర్థికపెరుగుదలరేటు ఎక్కువై సత్వర పారిశ్రామికీకరణ జరగడం.రోడ్లు,నౌకా విమానాశ్రయాల అభివృద్ధి .తర్వాత వచ్చిన వాజ్పాయిగారి ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధిరేటు 8-9 % కొనసాగింది.
2000 నుంచి-అభివృద్ధికొనసాగినా పేదరికం ఇంకా అధికంగానే ఉంది.రాష్ట్రాలలో వ్యత్యాసం ఉంది.దేశంలో సంపద,ఆదాయాలుపెర్గి వాటితోబాటు భూమి,అస్తులు,వస్తువుల ధరలూ బాగా పెరిగాయి.ఇటీవల పలుప్రపంచదేశాల్లో మాంద్యంవలన ఆ ప్రభావం మనమీద కూడా పడింది.H.D.I.(HUMAN DEVELOPMENTINDEX )లో ఇంకా వెనకబదేఉన్నాము.
2020నాతికైనా మనం ఈ కిందివి సాధిస్తే 'అభివృద్ధి చెందుతున్న దేశం'గాకాక ' 'అభివృద్ధి చెందినదేశంగా ' పేరుపడతాము.
1.ప్రతి గ్రామానికి,పేటకు,రోడ్డు,మంచినీరు,విద్యుత్ సప్లై ఇవ్వాలి.2.శిశు మరణాలుబాగా తగ్గించాలి.3.సగటు ఆయుర్దాయం కనీసం70సం.కి పెరగాలి.4. .అక్షరాస్యత కనీసం 90శాతానికి పెరగాలి. 5.ఆహారభద్రత,విద్య,వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి.6.infrastructure రోడ్లు,విద్యుత్ మొ;ప్రపంచప్రమాణాలతో సరితూగేలా అభివృద్ధి సాధించాలి.7.వ్యవసాయం,నీట్పారుదలప్రాజెఖ్తులపై ఎక్కువశ్రద్ధ చూపించాలి.
అందువలన మనం నిరాశ చెందనక్కర లేదు. కలిసికట్టుగా,తెలివిగా ప్రభుత్వమూ,ప్రజలూ పనిచెస్తే ,మరొక 20లేక 30 సం;;లలో అగ్రరాజ్యాలలోమనదేశం స్థానం సంపాదించుకొంటుంది అని ధైర్యంగా చెప్పవచ్చును.
జై హింద్.
12, ఆగస్టు 2012, ఆదివారం
mullapoodi-2volume
ఈ మధ్య ముళ్ళపూడి వెంకట్రమణగారు రాసిన కోతికొమ్మచ్చి2వభాగం చదవడం తటస్థించింది.ఇంకా కొందరు చదివే వుంటారు.మొదటి భాగంలో ఆయన చిన్నతనపువిశేషాలు,పేదరికం,పత్రికల్లో ఉద్యోగం.ఫ్రీలాన్స్ జర్నలిజం ,సినిమాల్లో కథలు,దైలాగులరచన గురించిఉన్నాయి.రెండోభాగంలో సినిమాల్లో కథ,స్క్రిప్టు రాయడం ,జ్యోతి పత్రికలో ఉద్యోగం- వీటితో విసిగి బాపూగారితో కలిసి నిర్మాతగామారి సాక్షిచిత్రంతో మొదలుపెట్టి సంపూర్ణరామాయణం వరకు స్వంత సినిమాలు తీసి లాభనష్టాలు,నిందలు,ప్రశంసలు పొందడం -ఇవన్నీఉన్నాయి. ఐతే ఒక కాలక్రమంలేకుండా ,ముందువి వెనక,వెనకవి ముందు రాస్తూ జంప్ చేయడంవలన కోతికొమ్మచ్చి అనేపేరు పెట్టారు.దీనినిండా,సినిమావాళ్ళ కబుర్లూ,జోకులూ ముళ్ళపూడివారి,ఆయన టిపికల్ శైలి లో ఉంటాయి.స్వయంగా చదువుతేనే enjoy చెయ్యగలం.మచ్చుకు -క్రూ 'రంగారావు ' ,చంద్రబాబునాయుడుగారిలాగ,' ముందుకు పోతాం ' మాలతీచందూర్గారిలాగ ' ముందే తరిగి వుంచుకున్న కూరముక్కలులాగ ' వంటి ప్రయోగాలు కొల్లలు.హాస్యబ్రహ్మ ముళ్ళపూడివారి కోతికొమ్మచ్చిని తప్పకచదవమని నా సలహా.
8, ఆగస్టు 2012, బుధవారం
our house
మాది 8గదుల పెద్ద ఇల్లు.కంపౌండ్లో ఫలపుష్ప జాతుల చెట్లు,మొక్కలు కూడాఉన్నాయి.ఇది ఎందుకు రాస్తున్నానంటే,ఇంత పెద్దవికాకపోయినా ,ఈ వూళ్ళోను,మనకోస్తాజిల్లాల పట్టణాల్లో చాలా ఇళ్ళకి ముందు జాగాలేకపోయినా పెరళ్ళు ,అందులో చిన్న తోటలు ఉంటాయి.కాని,ఇప్పుడు అలాంటి ఇళ్ళు,క్రమంగా అదృశ్యం అవుతున్నవి.అపార్ట్ మెంట్ కల్చర్ ఎక్కువవుతున్నది.దీన్ని ఆపలేము ఏమో.అటువంటి సమయంలో కనీసం రోడ్లపక్కన చెట్ల పెంపకం ,ప్రతీపేటలోను కాలనీలోను పార్కులు ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందించాలి.
4, ఆగస్టు 2012, శనివారం
DR.PINAAKAPAANI
డా.శ్రీపాద పినాకపాణిగారి గురించి ,ఆయన శతవత్సర వేడుకల గురించి పత్రికల్లో చదివిఉంటారు.100 ఏళ్ళు జీవించినవారు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చును.ఆయన గత కొన్ని సం.నుండి మంచంపట్టినా స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారట.
మేము 1950-1955 మధ్య వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజిలో చదువుతున్నప్పుడు మెడికల్ ప్రొఫెసర్గా ఉండే వారు.అప్పటి పద్ధతి ప్రకారం ఫుల్సూట్లో వచ్చేవారు.అప్పటికే బట్టతల బాగా ఉండేది.'తరనన 'అంటూ మెల్లిగా పాడుకుంటూ ,తల ఊపుతూ,రౌండ్స్ చేస్తుంటే మేము నవ్వుకొనేవాళ్ళం.అలాగని ఆయన తన డ్యూటీని,టీచింగుని అశ్రద్ధ చేసేవారుకాదు.తర్వాత కర్నూలు మెడికల్ కాలేజికి ప్రొఫెసర్ ప్రిన్సిపల్గా బదిలీఅయి అక్కడే రెటైరయి సెటిలయ్యారు.నేదునూరి,నూకల,శ్రీరంగం వంటి మహామహులు ఆయన శిష్యులు.
పద్మభూషణ్ పినాకపాణీ గారి సంగీతజీవితం గురించి రాసే తాహతు నాకు లేదు.ఆయన గొప్ప theoritician .చాలా మార్గదర్శకమైన సంగీత గ్రంథాలు రచించినట్లు తెలుసును.కాని ,ఆయన కంఠస్వరం,కచెరీ అంత ప్రజారంజకం గా ఉండేవికావు.
ఆయన మెడికల్ప్రాక్టీసు ద్వారా గొప్పగా సంపాదించినట్లులేదు.అప్పట్లో మా ప్రొఫెసర్లు చాలామంది అలాగే ఉండేవారు.ప్రాక్టీసుకన్నా టీచింగు మీద ఎక్కువ ఆసక్తి చూపేవారు.కాని strict గాను ,కోపిష్టులుగాను ఉండేవారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)