విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆరాధించేవారు ఉన్నారు.తీవ్రంగా వ్యతిరేకించేవారు ఉన్నారు.ఆయన భావజాలమే ideologyయే దీనికి కారణం .కాని ఆయన ప్రతిభ,పాండిత్యం,కవితాప్రావీణ్యం, బహుముఖప్రజ్ఞల గురించి మాత్రం అందరూ ఏకీభవిస్తారు.ఐతే ప్రస్తుతం వీటి గురించి వ్రాయడం లేదు.వేయిపడగలు నవలలోని అంశాలగురించి వ్రాయదలిచాను.50 సం; లో సుబ్బన్నపేట అనే వూళ్ళో వచ్చిన మార్పులు (అంటే ఆంధ్రదేశపు పల్లెలు,పట్నాలలో వచ్చిన మార్పులకు ప్రతీకగా ) చక్కగా చిత్రించారు.విచిత్రమేమంటే అభ్యుదయనిరోధకుడు అని నిరసించిన వారే అవే అభిప్రాయాలని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా వామపక్షీయులు, పర్యావరణవాదులు,మానవహక్కులసంఘాలు.
1.ఆయన ఆ నవలలో వరిపంట విస్తరించడాన్ని వ్యతిరేకించారు.ముతకధాన్యాలు,మెట్టపంటల్నిప్రోత్సహించాడు.అవే బలవర్ధకాలన్నారు
2.జానపదకళలని వర్ణించారు.వాటి క్షీణతని గురించి బాధపడ్డారు.
3.ముఖ్యంగా చేతి పనులు ,వృత్తుల విధ్వంసాన్ని నిరసించారు.
4.పర్యావరణం ఎలా పాడయిపోతున్నదో వివరించారు.
5.గ్రామాలు రాజకీయాలతో ఎలా కలుషితం అవుతున్నవో బాగా చిత్రించారు.6.మానవ,కుటుంబ సంబంధాలు ఎలా విచ్చిన్నమౌతున్నవో వర్ణించాడు.
ఈ రోజుల్లో ఇంచుమించు ఇదే భావాలతో ,అంశాలతో ఆధునికులు కథలు రాస్తున్నారు. విశ్వనాథవారు ఇవన్నీ ఊహించి ముందుగానే prophetic గా రాయడం గమనించవలసిన విషయం. అందుకే మనం ఆయనతో కొన్ని చాందసభావాల గురించి విభేదించినా ' వేయి పడగలు ' తెలుగులో గొప్ప నవలలలో ఒకటి అని అంగీకరించాలి.
6 కామెంట్లు:
' వేయి పడగలు ' తెలుగులో గొప్ప నవలలలో ఒకటి అని అంగీకరించాలి.
:)
?!
ఒక గొప్ప నవలే కాని కాస్త అర్థం చేసుకోవడం కష్టం అని నా అభిప్రాయమండి.
నేను ఓ..పదేళ్ళ నుండి ..ఆ నవలని అప్పుడప్పుడూ..చదువుతూ ఉంటాను.
చదువుతున్న కొద్ది.. చాలా విషయాలు.. అనుభవలోకి వస్తాయి.
ఆ నవల ని చదవడం అలవాటు చేసుకోవడమే కష్టం.
ఇప్పటి తరం వారికి ఆ నవల ని ఇస్తే.. బాబోయి ఇదేని తెలుగు..అని చప్పున మూసి వేస్తారు.
మంచి విషయాలు ని చక్కగా చెప్పారు. ధన్యవాదములు.
వనజగారూ,వేయిపడగలు మొదటిసారి వర్ణనలు ,చర్చలు,వదలిపెట్టి కథమాత్రం చదవాలి.రెండోసారి ఆ చర్చలు,వర్ణనలు, అర్థం చేసుకుంటూ చదవాలి.ప్రాచీనకావ్యాలు చదివిన వాళ్ళకి ఆ నవలలోని గ్రాంథిక భాష అర్థంచేసుకొడం కష్టం కాదు.ఆయన భావాలతో మనం ఏకీభవించకపోయినా నేను ఇంతకు ముందే రాసిన కారణాలవలన ఆనవల గొప్పతనం గుర్తించాలని నా అభిప్రాయం. -అభినందనలతో -కమనీయం.
మాస్టారూ...
ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వేయిపడగలు మహా గొప్ప నవల. ఒక్క విషయంలో మీతో విభేదిస్తున్నాను. దానిలోని భాష గ్రాంథికం కాదు, అచ్చమైన జాను తెనుగు. ఇప్పటి అపభ్రంశపు తెలుగు ముక్కలుముక్కలుగా మాట్లాడడం తప్ప అసలు తెలుగు తెలీని వారికి అది గ్రాంథికంలా అనిపిస్తే అనిపించవచ్చునేమో కానీ... మీకు కూడానా?
విశ్వనాథ గొప్ప దార్శనికుడు.దేశం పట్టనంత ప్రతిభావంతుడు. వేయి పడగలు బృహన్నవల గురించి మీరు రాసిన దానితో ఎవరయినా ఏకీభవించక తప్పదు.
మంచి విషయాలు చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు.
మీ వీుని బట్టి వారి ఏకవీర, బాణామతి, ఆరు నదులు
దిండు క్రింది పోక చెక్క మొదలయిన ఇతర నవలికల గురించి కూడా తెలియ జేయండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి