30, మే 2012, బుధవారం

Diet



 చాలా మందికి తెలిసే వుంటుంది.ఐనా కావలసిన వారు నోట్ చేసుకోవచ్చును.ఈ ఆహారం 1200 కేలరీల శక్తిని ఇస్తుంది.ఇది దాదాపుగా గుండెజబ్బు,రక్తపోటు,మధుమేహం ఉన్నవారికి అందరికి పనికి వస్తుంది.ఐతే స్థూలకాయం కూడా ఉంటే మరి కొంచెం తగ్గించి 1000 కేలరీల ఆహ్హారం తీసుకోవాలి.
   ఉదయం 7-30=8గం. 2,3 వెల్లుల్లి రేకలు.6-8 నానపెట్టిన మెంతులు మంచినీళ్ళతో.అరకప్పు నీళ్ళలో పావుకప్పు కాకరకాయ రసం.
   8-30=9 గం.-అల్పాహారం (breakfast) 2ఇడ్లీలు చట్నీతో.|లేక 1పరాటా కూరతో.అరకప్పు పాలు,లేక పాలతో కలిపి టీ లేక కాఫీ. పాలలో కొవ్వు ఉండకూడదు. చక్కెర వేసుకో కూడదు.  
   10-30=11గం.-1చిన్న కమలా లేక నారింజ పండు.
  12-30=1-30-భోజనం (lunch) -2 పుల్కాలు|లేక జొన్నరొట్టెలు ; చిన్న గిన్నెలో అన్నము ,ఉడకబెట్టిన కూరతో.;చిన్న గిన్నెలో పప్పు ,\లేక సాంబారు.
  4-6గం.మధ్య- - కొవ్వులేని అరగ్లాసు పాలు లేక పాలతో టీ లేక కాఫీ తాగవచ్చును.చక్కెర వేసుకోకూడదు.
  చిన్నగిన్నెలో సగం వేయించిన శనగలు,|లేక మొలకెత్తిన శనగలు,
  8-30==9గం.రాత్రి-భోజనం.(dinner) 2పుల్కాలు|లేక జొన్న రొట్టెలు ;1గిన్నె ఉడికించిన కూరగాయలు .1గ్లాసు కొవ్వులేని మజ్జిగ.
  10-11గం.మధ్యరాత్రి =1చిన్నగ్లాసుతో కొవ్వుతీసిన పాలు.
   Note;- పాలు,టీ, కాఫీలలో చక్కెర బదులు sugar free  మాత్రలు  1 లేక 2 వాడ వచ్చును.
 సాధారణ సూత్రములు.(general principles) 1.నెయ్యి,వెన్న ,కొబ్బరి,వాటితో వండిన పదార్థాలను వాడకూడదు.2.మిఠాయిలు ,మైదా,కేకులు ,తినకూడదు.పనస,మామిడి ,సీతాఫలం,వంటి గ్లూకోజ్ ఎక్కువగా వుండే పండ్లను తినకూడదు.టిన్స్ లోని ఆహారాన్ని వర్జించాలి.(tinned foods) .మాంసాహారం బాగ తగ్గించాలి.వదలి వేయడం మంచిది.చేపలు తినవచ్చును.బరువు పెరగకుండా చూసుకోవాలి.వయసుని బట్టి వ్యాయామం చెయ్యాలి.ఆహారంలో ఉప్పు తగ్గించాలి.చక్కెర వేసుకోకూడదు.మద్యం,పొగాకు ,వాడకూడదు.
   

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

చాలా మందికి ఉపకరించే మంచి ఉపయుక్తమైన విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.