క్విన్ లేక చిన్ సామ్రాజ్యపు చక్రవర్తి తన తర్వాత తన రాజ్యం శాశ్వతంగా ఉంటుందనుకొన్నాడు.కాని అతని మనమడి కాలంలోనే అంతరించింది.కొంతకాలం ఆధిపత్యపు పోరు ,అంతర్యుద్ధాలు ,తిరుగుబాట్ల తర్వాత ,క్రీ.పూ.210 నుండిక్రీ.పూ.140 వరకు ,మళ్ళీ క్రీ.శ.25 నుండి క్ర్హినాలో ఈ.శ.210 వరకు హాన్ వంశీయులు పాలించారు.మధ్య కాలంలో అనగా క్రీ.పూ.140 నుండి క్రీ.శ.25 వరకు వేరే వంశీయులు పాలించారు.మొత్తం మీద ఈ నాలుగు వందల సం; కాలంలో దాదాపు చైనా అంతా ఒక పరిపాలనలోకి వచ్చింది.ఈకాలంలో మన దేశంలో ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం వర్ధిల్లినది.( క్రీ.పూ.200-క్రీ.శ.200)వరకు.వీరి కాలం లోనే బౌద్ధమతం మధ్య ఆసియా నుంచి చైనాలో ప్రవేసించి ప్రజాదరణ పొందినది.కాని,కంఫుసస్ ,తావో బోధల ప్రభావం కూడా బాగా ఉండినది చివరి రాజులు బలహీనులు ,చిన్నపిల్లలు అగుట రాజమాతలు సలహాదారులు,రాజ్య పాలన సాగించే వారు.అంతహ్ పుర కుట్రలు ,తిరుగుబాట్లచేసామ్రాజ్యం పతనమై 4 రాజ్యాలు ఏర్పడి కలహించుకొంటూఉండేవి.సరిహద్దుల్లో హూణులనే జాతివారు తరచు దాడి చేసేవారు.
ఐనా ఈ400సం;లోను చైనా సంపన్నమై,ప్రశాంతంగా వర్తక వ్యాపారాలతో వర్ధిల్లినదని చెప్పవచ్చును.
హాన్ సామ్రాజ్య పతనం తర్వాత 400 సం;చిన్న రాజ్యాలు ఏర్పడి అస్థిరం గా ఉండేద్ .
హాన్ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం కి సమకాలికమైందే.కాని 4వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనమైనాక యూరప్లో మళ్ళీ సామ్రాజ్యం ఏర్పడలేదు.కాని చినాలో ఒక సామ్రాజ్యం పడిపోయాక ,కొన్నాళ్ళు పోయాక మరొక సామ్రాజ్యం ఏర్పడేది.
తరవాత చరిత్ర మరొకసారి చెప్పుకొందాము.