వంశధార,నాగావళి,వడివడిగా వస్తున్నవి
పరుగులిడుచు వస్తున్నవి.
తరుగుల్మలతాదుల తడిమి తడిపి వస్తున్నవి
దరుల దరసి ఒరసుకొని పరవళ్ళు త్రొక్కుచును
గిరుల కాంతారముల దాటి క్రింది క్రిందికి దుమికి
రమ్యభూముల రాజనాల పంటచేలను ప్రోదిచేయుచు
వడివడిగా వస్తున్నవి వయ్యారంగా వస్తున్నవి
కళింగసీమకు కటిసూత్రములై -కనకరుచిదీప్తులెగయ
బౌద్ధవిద్యా నిలయములకు -భవ్య పుణ్యక్షేత్రములకు
పేరు గాంచిన సీమను పెన్నిధిగా బ్రోచు తల్లులు
నదీమతల్లులు
వంశధార ,నాగావళి, వడివడిగా వస్తున్నవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి