తెలంగాణ: తరతరాలుగా అణచివేతకు అలవాటుపడి ఒదిగిపోయే తత్వంతో బ్రతుకీడుస్తూ తామెంత అల్పసంతోషులమో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుని నోరు విప్పి మాట్లాడటం నేర్చుకుంటూ న్యాయం కోసం ఇంకో తరంకూడా ఆగే అమాయక ప్రజలు.
రాయలసీమ: రాచరికం నీడలో తరాలుగా అణిగిమణిగి పడుండటం అలవాటుగా ఇప్పటి స్వార్థపు నాయకుల కోసం త్యాగాలుచేస్తూ తమకంటూ కలలుకనే సుఖమైన బ్రతుకొకటి ఎప్పటికి రానివ్వరని తెలియని స్థితిలో నిద్రపోతున్న అమాయక సింహాలు ఈ ప్రాంత ప్రజలు.
కోస్తాంధ్ర: గమ్యం లేని బలుపును కండగా భావించే తెలివైన కొంతమంది స్వార్థ నాయకుల భ్రమలో జరుగుతున్న మోసాన్ని మరియు స్వంత బీదరికాన్ని మరచిపోయి తమకూ అలాంటి కరిగిపోయే కండలే కావాలని త్రిశంకు స్వర్గంలో దారితెన్నులు లేక అతిగా పరుగులు పెడుతున్న అత్యధక ప్రజలు.
మనకి నిరాశా వాదం ఎక్కువ. మనష్ట్రానికి రాష్త్రానికి అభివ్రిద్ధి చెందిన వాటిలో ఒకటిగా పేరుంది. మనమంతా కలసి క్రిషి చేస్తే ఇంకా బాగుపడతాము. మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు వుంది. వూరికే రాజకీయనాయకులను తిట్టుతూవద్దు.కూర్చొ వద్దు. రమణారావు.
"మనష్ట్రానికి రాష్త్రానికి అభివ్రిద్ధి చెందిన వాటిలో ఒకటిగా పేరుంది." - ఏ ఆశావాది చెబితే నమ్మేసారు మీరు?
ఒక ప్రఖ్యాత ఉత్తరభారత నాయకుడు నిండు సభలో నుంచుని 'ఏ ఆంధ్రప్రదేశ్ నామ్కో అంధేరాప్రదేశ్ బదల్దేనా ఉచిత్ హోగా' అన్నప్పుడు ఏమైంది ఈ అభివృద్ది.
మనమంతా కలసి చేసిన కృషి ఫలితమే ఈ అనైఖ్యత - ఇంకా బాగుపడతామో లేదో తెలియదు కాని కలిసుంటే కొన్ని జాతుల మూలాలే నశించుట ఖాయం - అసలు సిసలైన తెలుగు పూర్తిగా ఖూనీ చేయబడి మొత్తంగా ఆంగ్ల భాషగా మార్చుట ఖాయం.
అధిష్టానం మెడలు వంచడం చేతకాక కేంద్రంలో అత్యల్పంగా పదవులు పొంది ఏమాత్రం ఆధిపత్యం సాధించలేక తమ చెత్త ప్రవర్తనతో అందరూకలిసి మొత్తం రాష్ట్రానికే తలవంపులు తెచ్చారు. అత్యధికంగా లోకసభ సభ్యులనందించి కేంద్ర సర్కారుకు తోడ్పడ్డామని కాలరెగిరేసి తిరిగే సమైఖ్యరాష్ట్రవాదులు, అభివృద్ది చెందినదని వాదించే వారేమంటారో మరి.
మన రాష్ట్రం కంటే ఎంతో చిన్న రాష్ట్రాలనుండి ఎన్నికై వచ్చిన వారికి అధిష్టానంలో దొరికిన ప్రాతినిధ్యంతో పోలిస్తే మనవారికి అసలేమి లేదనే అనొచ్చు.
ఇదేనా సమైఖ్య రాష్ట్రంతో సాధించింది?
రాష్ట్రంలో నాయకత్వ లక్షణాలే కరువయ్యాయా లేక నిజమైన నాయకులను పైకి రానీయకుండా తొక్కిపేట్టే కుళ్ళుబోతు ప్రవర్తన కారణమా… తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గం చూస్తే రెడ్డి రాజుల కాలం గుర్తుతెచ్చుకోవచ్చు. ఈ కులవర్గాల గజ్జి ఎక్కడివరకు పాకిపోతోందో ఊహించడం కష్టం.
ఓ మహత్మ ఈసారి మరో స్వాతంత్ర్యోద్యమం చేయడానికి నువ్వు తెలుగువాడిగా మళ్ళి పుట్టాలి…
మంచిమాటలు చెప్పారు మాస్టారు, పోగాలం దాపురించినోళ్ళకి హితవచనాలు చెవికెక్కవు. దీప నిర్వాణ గంధము ఆఘ్రాణించలేరు, అరుంధతి/అభివృద్ధి కనిపించదు. నిజాం, రజాకార్లు చేసిందే అభివృద్ధి మరి! నగ్న బతుకమ్మ ఆడటానికి ఎగసి, మిడిసి పడుతున్నారు. ------ /ఏ ఆశావాది చెబితే నమ్మేసారు మీరు? 'ఏ ఆంధ్రప్రదేశ్ నామ్కో అంధేరాప్రదేశ్ బదల్దేనా ఉచిత్ హోగా' అన్నప్పుడు ఏమైంది ఈ అభివృద్ది. / ఉత్తరాది నాయకుడు చెబితే మీరు నమ్మేశారా లేదా? మరి బదలుదామని ఎందుకు ఉద్యమించట్లేదు?
/అసలు సిసలైన తెలుగు పూర్తిగా ఖూనీ చేయబడి మొత్తంగా ఆంగ్ల భాషగా మార్చుట ఖాయం. / పోనీ ఉర్దూలో పరేషాన్, హైదరాబాదు, నౌబత్ పహాడ్, లాల్ ధ్ర్వాజ, గల్లీ, మెహబూబాబాదు, బరబాదు అని మార్చుకుందామంటారా? :)
/ఓ మహత్మ ఈసారి మరో స్వాతంత్ర్యోద్యమం చేయడానికి నువ్వు తెలుగువాడిగా మళ్ళి పుట్టాలి…/
పుట్టాడుగా ముక్కోడు! ముసలం పుట్టినట్టే, ఇక అంతా బరాబాదే.
ఇది చాలా సున్నితమైన విషయం. పరస్పర దూషణ మంచిది కాదు. నేను అన్ని ప్రాంతాలలో పని చేశాను. అన్ని జిల్లాలు తిరిగాను.అన్నిటిలో కొన్ని ప్రాంతాలు కొంచెం వేనుకపడ్డాయి.ఎక్కువ తేడా లేదు.అందరూ కలసి కృషి చేస్తే సమగ్ర అభివృద్ధి సాధించుకో వచ్చును .కాని ఐకమత్యం ముఖ్యం. అన్నివిషయాల్లో ఇప్పటికే మన రాష్ట్రం టాప్‌టెన్ లో వున్నది.ప్రస్తుత మంత్రివర్గం ఇష్టం లేకపోతె మార్చ వచ్చును..సమైక్య ఆంద్ర రాష్ట్రంలో తెలుగుప్రజలు సర్వతో ముఖ వైభవం పొందాలిని నా ఆకాంక్ష .అందరికి అభినందనలతో.రమణీయం.
రమణీయం గారు, బహూశా మీకు మరియు మీలా అలోచించేవారికి మాత్రమే ఈ సమస్య సున్నితంగా అగుపించవచ్చు. అందులో తప్పులేదు - ఆ కోణంలో చూడడానికి మీరు పెరిగిన సమాజం ఒక కారణం. కాని అలా మీ దృష్టిలో కనబడే అతిసున్నిత విషయాలు కూడా వేరొకరి సాంగత్యంలో రాటుదేలిన మొఱటు సమస్య అయివుండొచ్చు కదా...!
వ్యక్తిగత ధూషణ నా కామెంట్లలో ఉండదు - ఇకపోతే నేను ధీటుగా సమాధానం ఇవ్వగలిగినా Snkr వంటివారి అపరిపక్వపు వ్యాఖలను వారి విజ్ఞతకే వదిలివేయడం సబబు.
నేనుకూడా ఆంధ్రాప్రాంతంలో రెండు సంవత్సరాలు పనిచేసాను... విజయవాడ, కాకినాడ, గుంటూరులలో నివసించాను. ఇక్కడివారి అలోచనా పద్దతి వేరు - అంత పరిణతితో అలోచించే స్థోమత వేరే ప్రాంతపు తెలుగువారిలో లేదు... కష్టపడి పైకి రావాలన్న ఉత్సుకత చాలా హర్షించతగ్గది. అయితే అత్యధిక జనాలవి గమ్యంలేని పరుగులే. నేను వారి మద్య ఇమడలేక పోయాను - వంకరగా మరియు తెలివిగా మాట్లాలేకపోవడం నాలోని లోపం. అలాగే నెల్లూరు, తిరుపతిలలో కూడా ఒక సంవత్సరం పనిచేసాను... వీరి తీరు తెన్నులు అలోచనా సరళి కూడా విభిన్నం.
అయ్యా, నేను పుట్టింది పెరిగింది మొత్తంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం... ఆదిలాబాదు, మంచిర్యాల్, నిజామాబాద్. ఇక్కడి ప్రజలు కోస్తా మరియు ఆంధ్ర ప్రాంత ప్రజలతో పోటీపడలేరు - వాక్ఛాతుర్యం లేదు - తుర్కులపాలనలో తరతరాలుగా బ్రష్టుపడిన బతుకులు. ఇలాంటివారికి కావలసింది ఇతర ప్రాంత తెలుగుప్రజల సహకారం. ప్రతి విషయంలో చేదోడువాదోడుగా ఉంటారనే ఆనాడు కలిసినప్పుడు ఆశపడ్డారు. ఆ ఆశలు అడియాసలయ్యాయి - ఆ ముసుగులో స్వంతనాయకుల అండదండలతో జరిగింది నిలువు దోపిడి.
మీలా ఆరోగ్యంగా ఆలోచించి ఇక్కడివారి అవసరాలకొఱకు పోరాడే వాళ్ళు కరువయ్యారు. కెసిఆర్ లాంటివారు తెలంగాణ గాంధీలుగా మారిపోయే పరిస్థుతులు కల్పించారు అందెలమెక్కిన నాయకులు. నాక్కూడా కెసిఆర్ లాంటివారు అంటే ఇష్టంలేదు - కాని ఏంచేయాలి... ఆయన విపరీతమైన మద్దత్తు సంపాదించుకున్నాడు.
'ప్రస్తుత మంత్రివర్గం ఇష్టం లేకపోతె మార్చ వచ్చును...' వినటానికి చాలా బాగుంది. ఇప్పుడున్న మంత్రివర్గం తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు - మరి ఎలా మార్పించుకోవాలో సలహాలివ్వండి.
'ఇప్పటికే మన రాష్ట్రం టాప్‌టెన్ లో వున్నది'... ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నంబర్ వన్ గా ఉండేది... ఇనాడు కూడా తెలంగాణ మళ్ళీ నంబర్ వన్ అయ్యే స్థోమత ఉంది. వేరుపడ్డాక కూడా ఆంధ్ర రాష్ట్రం టాప్‌టెన్ లోనే ఉంటుంది. బెంగ లేదు.
తెలుగుప్రజలు సర్వతో ముఖ వైభవం పొందడానికి... మరియు సమైఖ్యంగా ఉండడానికి అసలు పొంతనే లేదు. దేశంలో ఆనాడు హింది ప్రజలు ఏడు రాష్ట్రాలలో ఉండేవారు - ఈనాడు 14 రాష్ట్రాలుగా విడిపోయారు. హింది మరుగుపడిందా? అలాగే బెంగాలి భాష మాట్లాడే రాష్ట్రాలు ఇప్పుడు మూడున్నాయి. బాంగ్లా ప్రజలకు వచ్చిన చేటు ఏమీ లేదు. అలాగే తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండో లేక మూడో అయితే సర్వతో ముఖ వైభవం పొందడానికి అడ్డేమీ కాదు. సెలవు.
తెలంగాణావిడిపోవాలిసిన బలమైన కారణాలు లేవనుకొంటున్నాను.ఐనా తప్పనిసరి ఐతే ముందు హైద్రాబాదు సంగతి పరిష్కరించాలి .దీనికి రెండు మార్గాలు .1.రాఎజధానిని కొల్పొయినందుకు మిగతా ప్రాంతానికి అధికంగా నష్ట పరిహారం తెలంగాణా చెల్లించాలి.లేదా,ఆ ప్రాంతాలు కొత్త రాజధాని నిర్మించుకొని అభివ్రుద్ధి చెందే వరకు .అనగా,దాదాపు 10 సంవత్సరాలు హైదెరాబాదు సమ్యుక్త రాజధానిగా వుండాలి.ఇది నా అభిప్రాయము.
8 కామెంట్లు:
తెలంగాణ:
తరతరాలుగా అణచివేతకు అలవాటుపడి ఒదిగిపోయే తత్వంతో బ్రతుకీడుస్తూ తామెంత అల్పసంతోషులమో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుని నోరు విప్పి మాట్లాడటం నేర్చుకుంటూ న్యాయం కోసం ఇంకో తరంకూడా ఆగే అమాయక ప్రజలు.
రాయలసీమ:
రాచరికం నీడలో తరాలుగా అణిగిమణిగి పడుండటం అలవాటుగా ఇప్పటి స్వార్థపు నాయకుల కోసం త్యాగాలుచేస్తూ తమకంటూ కలలుకనే సుఖమైన బ్రతుకొకటి ఎప్పటికి రానివ్వరని తెలియని స్థితిలో నిద్రపోతున్న అమాయక సింహాలు ఈ ప్రాంత ప్రజలు.
కోస్తాంధ్ర:
గమ్యం లేని బలుపును కండగా భావించే తెలివైన కొంతమంది స్వార్థ నాయకుల భ్రమలో జరుగుతున్న మోసాన్ని మరియు స్వంత బీదరికాన్ని మరచిపోయి తమకూ అలాంటి కరిగిపోయే కండలే కావాలని త్రిశంకు స్వర్గంలో దారితెన్నులు లేక అతిగా పరుగులు పెడుతున్న అత్యధక ప్రజలు.
ఇదీ సార్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అంటే...!
మనకి నిరాశా వాదం ఎక్కువ. మనష్ట్రానికి రాష్త్రానికి అభివ్రిద్ధి చెందిన వాటిలో ఒకటిగా పేరుంది. మనమంతా కలసి క్రిషి చేస్తే ఇంకా బాగుపడతాము. మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు వుంది. వూరికే రాజకీయనాయకులను తిట్టుతూవద్దు.కూర్చొ వద్దు. రమణారావు.
"మనష్ట్రానికి రాష్త్రానికి అభివ్రిద్ధి చెందిన వాటిలో ఒకటిగా పేరుంది." - ఏ ఆశావాది చెబితే నమ్మేసారు మీరు?
ఒక ప్రఖ్యాత ఉత్తరభారత నాయకుడు నిండు సభలో నుంచుని 'ఏ ఆంధ్రప్రదేశ్ నామ్కో అంధేరాప్రదేశ్ బదల్దేనా ఉచిత్ హోగా' అన్నప్పుడు ఏమైంది ఈ అభివృద్ది.
మనమంతా కలసి చేసిన కృషి ఫలితమే ఈ అనైఖ్యత - ఇంకా బాగుపడతామో లేదో తెలియదు కాని కలిసుంటే కొన్ని జాతుల మూలాలే నశించుట ఖాయం - అసలు సిసలైన తెలుగు పూర్తిగా ఖూనీ చేయబడి మొత్తంగా ఆంగ్ల భాషగా మార్చుట ఖాయం.
అధిష్టానం మెడలు వంచడం చేతకాక కేంద్రంలో అత్యల్పంగా పదవులు పొంది ఏమాత్రం ఆధిపత్యం సాధించలేక తమ చెత్త ప్రవర్తనతో అందరూకలిసి మొత్తం రాష్ట్రానికే తలవంపులు తెచ్చారు. అత్యధికంగా లోకసభ సభ్యులనందించి కేంద్ర సర్కారుకు తోడ్పడ్డామని కాలరెగిరేసి తిరిగే సమైఖ్యరాష్ట్రవాదులు, అభివృద్ది చెందినదని వాదించే వారేమంటారో మరి.
మన రాష్ట్రం కంటే ఎంతో చిన్న రాష్ట్రాలనుండి ఎన్నికై వచ్చిన వారికి అధిష్టానంలో దొరికిన ప్రాతినిధ్యంతో పోలిస్తే మనవారికి అసలేమి లేదనే అనొచ్చు.
ఇదేనా సమైఖ్య రాష్ట్రంతో సాధించింది?
రాష్ట్రంలో నాయకత్వ లక్షణాలే కరువయ్యాయా లేక నిజమైన నాయకులను పైకి రానీయకుండా తొక్కిపేట్టే కుళ్ళుబోతు ప్రవర్తన కారణమా… తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గం చూస్తే రెడ్డి రాజుల కాలం గుర్తుతెచ్చుకోవచ్చు. ఈ కులవర్గాల గజ్జి ఎక్కడివరకు పాకిపోతోందో ఊహించడం కష్టం.
ఓ మహత్మ ఈసారి మరో స్వాతంత్ర్యోద్యమం చేయడానికి నువ్వు తెలుగువాడిగా మళ్ళి పుట్టాలి…
మంచిమాటలు చెప్పారు మాస్టారు, పోగాలం దాపురించినోళ్ళకి హితవచనాలు చెవికెక్కవు. దీప నిర్వాణ గంధము ఆఘ్రాణించలేరు, అరుంధతి/అభివృద్ధి కనిపించదు. నిజాం, రజాకార్లు చేసిందే అభివృద్ధి మరి! నగ్న బతుకమ్మ ఆడటానికి ఎగసి, మిడిసి పడుతున్నారు.
------
/ఏ ఆశావాది చెబితే నమ్మేసారు మీరు?
'ఏ ఆంధ్రప్రదేశ్ నామ్కో అంధేరాప్రదేశ్ బదల్దేనా ఉచిత్ హోగా' అన్నప్పుడు ఏమైంది ఈ అభివృద్ది. /
ఉత్తరాది నాయకుడు చెబితే మీరు నమ్మేశారా లేదా? మరి బదలుదామని ఎందుకు ఉద్యమించట్లేదు?
/అసలు సిసలైన తెలుగు పూర్తిగా ఖూనీ చేయబడి మొత్తంగా ఆంగ్ల భాషగా మార్చుట ఖాయం. /
పోనీ ఉర్దూలో పరేషాన్, హైదరాబాదు, నౌబత్ పహాడ్, లాల్ ధ్ర్వాజ, గల్లీ, మెహబూబాబాదు, బరబాదు అని మార్చుకుందామంటారా? :)
/ఓ మహత్మ ఈసారి మరో స్వాతంత్ర్యోద్యమం చేయడానికి నువ్వు తెలుగువాడిగా మళ్ళి పుట్టాలి…/
పుట్టాడుగా ముక్కోడు! ముసలం పుట్టినట్టే, ఇక అంతా బరాబాదే.
ఇది చాలా సున్నితమైన విషయం. పరస్పర దూషణ మంచిది కాదు. నేను అన్ని ప్రాంతాలలో పని చేశాను. అన్ని జిల్లాలు తిరిగాను.అన్నిటిలో కొన్ని ప్రాంతాలు కొంచెం వేనుకపడ్డాయి.ఎక్కువ తేడా లేదు.అందరూ కలసి కృషి చేస్తే సమగ్ర అభివృద్ధి సాధించుకో వచ్చును .కాని ఐకమత్యం ముఖ్యం. అన్నివిషయాల్లో ఇప్పటికే మన రాష్ట్రం టాప్‌టెన్ లో వున్నది.ప్రస్తుత మంత్రివర్గం ఇష్టం లేకపోతె మార్చ వచ్చును..సమైక్య ఆంద్ర రాష్ట్రంలో తెలుగుప్రజలు సర్వతో ముఖ వైభవం పొందాలిని నా ఆకాంక్ష .అందరికి అభినందనలతో.రమణీయం.
రమణీయం గారు,
బహూశా మీకు మరియు మీలా అలోచించేవారికి మాత్రమే ఈ సమస్య సున్నితంగా అగుపించవచ్చు. అందులో తప్పులేదు - ఆ కోణంలో చూడడానికి మీరు పెరిగిన సమాజం ఒక కారణం. కాని అలా మీ దృష్టిలో కనబడే అతిసున్నిత విషయాలు కూడా వేరొకరి సాంగత్యంలో రాటుదేలిన మొఱటు సమస్య అయివుండొచ్చు కదా...!
వ్యక్తిగత ధూషణ నా కామెంట్లలో ఉండదు - ఇకపోతే నేను ధీటుగా సమాధానం ఇవ్వగలిగినా Snkr వంటివారి అపరిపక్వపు వ్యాఖలను వారి విజ్ఞతకే వదిలివేయడం సబబు.
నేనుకూడా ఆంధ్రాప్రాంతంలో రెండు సంవత్సరాలు పనిచేసాను... విజయవాడ, కాకినాడ, గుంటూరులలో నివసించాను. ఇక్కడివారి అలోచనా పద్దతి వేరు - అంత పరిణతితో అలోచించే స్థోమత వేరే ప్రాంతపు తెలుగువారిలో లేదు... కష్టపడి పైకి రావాలన్న ఉత్సుకత చాలా హర్షించతగ్గది. అయితే అత్యధిక జనాలవి గమ్యంలేని పరుగులే. నేను వారి మద్య ఇమడలేక పోయాను - వంకరగా మరియు తెలివిగా మాట్లాలేకపోవడం నాలోని లోపం. అలాగే నెల్లూరు, తిరుపతిలలో కూడా ఒక సంవత్సరం పనిచేసాను... వీరి తీరు తెన్నులు అలోచనా సరళి కూడా విభిన్నం.
అయ్యా, నేను పుట్టింది పెరిగింది మొత్తంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం... ఆదిలాబాదు, మంచిర్యాల్, నిజామాబాద్. ఇక్కడి ప్రజలు కోస్తా మరియు ఆంధ్ర ప్రాంత ప్రజలతో పోటీపడలేరు - వాక్ఛాతుర్యం లేదు - తుర్కులపాలనలో తరతరాలుగా బ్రష్టుపడిన బతుకులు. ఇలాంటివారికి కావలసింది ఇతర ప్రాంత తెలుగుప్రజల సహకారం. ప్రతి విషయంలో చేదోడువాదోడుగా ఉంటారనే ఆనాడు కలిసినప్పుడు ఆశపడ్డారు. ఆ ఆశలు అడియాసలయ్యాయి - ఆ ముసుగులో స్వంతనాయకుల అండదండలతో జరిగింది నిలువు దోపిడి.
మీలా ఆరోగ్యంగా ఆలోచించి ఇక్కడివారి అవసరాలకొఱకు పోరాడే వాళ్ళు కరువయ్యారు. కెసిఆర్ లాంటివారు తెలంగాణ గాంధీలుగా మారిపోయే పరిస్థుతులు కల్పించారు అందెలమెక్కిన నాయకులు. నాక్కూడా కెసిఆర్ లాంటివారు అంటే ఇష్టంలేదు - కాని ఏంచేయాలి... ఆయన విపరీతమైన మద్దత్తు సంపాదించుకున్నాడు.
'ప్రస్తుత మంత్రివర్గం ఇష్టం లేకపోతె మార్చ వచ్చును...' వినటానికి చాలా బాగుంది. ఇప్పుడున్న మంత్రివర్గం తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు - మరి ఎలా మార్పించుకోవాలో సలహాలివ్వండి.
'ఇప్పటికే మన రాష్ట్రం టాప్‌టెన్ లో వున్నది'... ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నంబర్ వన్ గా ఉండేది... ఇనాడు కూడా తెలంగాణ మళ్ళీ నంబర్ వన్ అయ్యే స్థోమత ఉంది. వేరుపడ్డాక కూడా ఆంధ్ర రాష్ట్రం టాప్‌టెన్ లోనే ఉంటుంది. బెంగ లేదు.
తెలుగుప్రజలు సర్వతో ముఖ వైభవం పొందడానికి... మరియు సమైఖ్యంగా ఉండడానికి అసలు పొంతనే లేదు. దేశంలో ఆనాడు హింది ప్రజలు ఏడు రాష్ట్రాలలో ఉండేవారు - ఈనాడు 14 రాష్ట్రాలుగా విడిపోయారు. హింది మరుగుపడిందా? అలాగే బెంగాలి భాష మాట్లాడే రాష్ట్రాలు ఇప్పుడు మూడున్నాయి. బాంగ్లా ప్రజలకు వచ్చిన చేటు ఏమీ లేదు. అలాగే తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండో లేక మూడో అయితే సర్వతో ముఖ వైభవం పొందడానికి అడ్డేమీ కాదు. సెలవు.
తెలంగాణావిడిపోవాలిసిన బలమైన కారణాలు లేవనుకొంటున్నాను.ఐనా తప్పనిసరి ఐతే ముందు హైద్రాబాదు సంగతి పరిష్కరించాలి .దీనికి రెండు మార్గాలు .1.రాఎజధానిని కొల్పొయినందుకు మిగతా ప్రాంతానికి అధికంగా నష్ట పరిహారం తెలంగాణా చెల్లించాలి.లేదా,ఆ ప్రాంతాలు కొత్త రాజధాని నిర్మించుకొని అభివ్రుద్ధి చెందే వరకు .అనగా,దాదాపు 10 సంవత్సరాలు హైదెరాబాదు సమ్యుక్త రాజధానిగా వుండాలి.ఇది నా అభిప్రాయము.
కామెంట్‌ను పోస్ట్ చేయండి