28, మే 2015, గురువారం

prasannabhaaskaram




 ప్రసిద్ధ కవీ,అధ్యాపకుడు,పండితుడూ ఐన శ్రీ మానాప్రగడ శేషశాయిగారి 'ప్రసన్నభాస్కరం 'ఈ మధ్యనే నాకు లభించింది.ఆయనకు చూపు మందగించినప్పుడు రచించినట్లు తెలుస్తోంది.మొత్తం 223 పద్యాలున్నవి.అందులో రెండు మాత్రం ఉదహరిస్తాను.    
    చం'; హరితమణి చ్చటా చకిత హారి తురంగమ సప్తకాప్రభా
           పరిణతమద్భుత ప్రణమితామరమౌళి గుళుచ్చ కాంతిభా
           సురము,జగత్త్రయీ సదనసుందర కాంచన తోరణమ్ము, భా
           స్కర నవరత్న  మండలము,చయ్యన మాకు బ్రసన్నమయ్యెడున్

   మత్తే';  నిను సేవింప రవీ !మయూరుడనుగానే,లేక శ్రీనాథుడై
             నను గానే ,దరినుండు చాయనైనన్ గానే,ఉషహ్కాంతినై
             నను గానే,ప్రియపద్మినీరమణి నైనంగానె త్రైలోక్యపా
             వనముల్ నీఅరుణారుణ ప్రభలెటుల్ వర్ణింపగా జాలుదున్?
   అన్ని పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి.సంస్కృతంలోని మయూరశతకంకి సాటి వస్తుందని ధీమాగా  చెప్పగలను.

23, ఏప్రిల్ 2015, గురువారం

invitation to discussion




 ఇప్పుడు మన దేశంలో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తిస్తున్న అంశం;ఆధునికీకరణ,పారిశ్రామికీకరణ అందుకు వ్యతిరేకంగా రైతుల వద్ద భూసేకరణకు నిరాకరణ,పర్యావరణరక్షణ..(modernization,industrialization  vs.refusal by farmers ,protection of environment.) రెండు వైపుల వాదం బలంగానే వుంది.మనం చైనాలాగ  ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే   మొదటిది తప్పదంటుంది ప్రభుత్వం.ఇంకొక వర్గంవారు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.నేను నిపుణిణ్ణి కాదు.అందువల్ల ఈ విషయాలు బాగా తెలిసిన వారు చర్చలో తమ అభిప్రాయాలు  తెలియ జేయ కోరుతున్నాను.  

invitation to discussion




 ఇప్పుడు మన దేశంలో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తిస్తున్న అంశం;ఆధునికీకరణ,పారిశ్రామికీకరణ అందుకు వ్యతిరేకంగా రైతుల వద్ద భూసేకరణకు నిరాకరణ,పర్యావరణరక్షణ..(modernization,industrialization  vs.refusal by farmers ,protection of environment.) రెండు వైపుల వాదం బలంగానే వుంది.మనం చైనాలాగ  ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే   మొదటిది తప్పదంటుంది ప్రభుత్వం.ఇంకొక వర్గంవారు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.నేను నిపుణిణ్ణి కాదు.అందువల్ల ఈ విషయాలు బాగా తెలిసిన వారు చర్చలో తమ అభిప్రాయాలు  తెలియ జేయ కోరుతున్నాను.  

16, ఏప్రిల్ 2015, గురువారం

AL BERUNI




 ఘజనీ మహమ్మద్ 17సార్లు మనదేశంపై దండెత్తి అనేక దేవాలయాల్ని ధ్వంసం చేసి ,సంపదకొల్లగొట్టి దోచుకొనిపోయినట్లే మనకు తెలుసు.కాని ,అతడు తన ఆస్థానంలో పండితుల్ని.కవుల్ని,శాస్త్రజ్ఞుల్నీ పోషించినట్లు చాలామందికి తెలియదు/.అందులో ఒకడు అల్ బెరుని. గొప్పవిద్వాంసుడు.శాస్త్రజ్ఞుడు.అతడు మన దేశంలో 13 సంవత్సరాలు నివసించి మన గ్రంథాలు సేకరించి,పండితులనుంచి సమాచారం సేకరించి ,పరిశోధనలు చేసి మనదేశం పైన ఒక పెద్దగ్రంథం వ్రాసాడు.అందులో హిందువుల ఆచారవ్యవహారాలు,దేశ  పరిస్థితులు,ఇక్కడి శాస్త్రగ్రంథాలు,మతము,పురాణాలు,పంచాంగం ఒకటేమిటి చాలా విస్తారంగా రచించాడు.కొన్ని చోట్ల విమర్శలు కూడా నిశితంగా చేసాడు.తప్పక  చదవ వలసిన పుస్తకం        INDIA by AL BERUNI.edited byDr.Edward C. Sachau ;RUPA PUBLICATIONS NEW DELHI.         

7, ఏప్రిల్ 2015, మంగళవారం

rudramadevi




  ఉద్రమదేవి సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది కాబట్టి,వీలయితే అడవి బాపిరాజుగారు  రచించిన 'గోన గన్నారెడ్డి 'అనే నవలను చదివితే మంచిది.చాలాకాలం క్రిందటే బాపిరాజుగారు  చాలా పరిశోధించి ఈ నవల వ్రాసారు.చిన్నప్పటినుండి రుద్రమదేవిని మగపిల్లవాడిగా పెంచడం.చాలాకొద్దిమందికే ఈ విషయం తెలియడం,తర్వాత  ముమ్మడమ్మను ఆమెకు వివాహం చేయడం,మగవేషంలోనే ఆమె రాజ్యంచెయ్యడం వంటి అనేక వింత విషయాలు ఇందులో ఉన్నాయి. సినిమాను తీసినవాళ్ళు ఈనవలను చదివి ఉంటారనుకొంటాను.గోనగన్నారెడ్డి అనేకులదృష్టిలో గజదొంగ, కాని అతడు రుద్రమదేవికి యుద్ధాల్లో సహాయం చేస్తాడు.వీలయితే చదవ వలసిన నవల. 

18, మార్చి 2015, బుధవారం

pattiseema project




 హటాత్తుగా ఈ పట్టిసీమ ప్రాజెక్టుని చంద్రబాబునాయుడి బుర్ర లో ప్రవేశించడానికి కారణమేమిటి?పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసి  దివాలాకోరుతనంతో  దీన్ని ప్రొమోట్ చేస్తున్నాడు.పట్టిసీమకి అయే 1500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు కొంతవరకైనా పనిజరుగుతుంగి కదా.B.J.P.,T.D.P. కుమ్మక్కై  ఆంధ్రులని ముంచేసారు.ఎంత మోసగాళ్ళు ?సరే కాంగ్రెస్ వాళ్ళు ముందే తీరని ద్రోహం చేసారు.చివరి దాకా  ఆంధ్రులు ఈ దొంగ రాజకీ యాలతో బాధపడవలసిందేనా?

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

mahabharatam




 ఇదండీ భారతం 'గురించి రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ టీ.వీ. 9 లో చదివాను.ఆవిడ ,ఆమె మిత్రులు ఈ మధ్యనే భారతాన్ని చదివినట్లుంది.ఆవిడ చెప్పిందానిలో  నాకు కొత్త ఏమీ కనిపించలేదు.ఇప్పటికే ఎందరో పరిశోధకులు ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి  రాసారు.ప్రపంచ  క్లాసిక్స్ లో ఒక ముఖ్యమైన  గ్రంథంగా పండితులు పరిగణించేదానిలో ఆవిడకు మెరిటేమీ కనిపించకపోవడం విచిత్రమే. మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి.1.దాదాపు 4000 సం; క్రితం రాజ్యం  కోసం  జరిగిన పెద్ద యుద్ధం  ఇందులో మూలకథ.వ్యాసుడి interpretation లో పక్షపాతం ఉండవచ్చును కాని కథాంశాలు,పాత్రల చిత్రీకరణలో ఏదీ దాచలేదు.2.అప్పటి వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ.రాజులు,రాజ్యాల కోసం యుద్ధాలు మామూలే.వర్ణ వ్యవస్థ కూడవాస్తవమే.మనం ఆపరిధిలోనే ఆలోచించాలి.3.రంగనాయకమ్మగారు బోధించే  మార్క్సిజం ఏమైంది?అన్నిచోట్లా విఫలమైంది కదా?4.నాకు మహాభారతంలోనచ్చిన విషయాలు;ధర్మాధర్మాల గురించి,యుద్ధము,శాంతి గురించి వాదోపవాదాలు,చర్చలు.అవి ఈ రోజుల్లో కూడా అన్వయిస్తాయి కదా.అలాగే ఆసక్తి కరమైన  పెద్ద కథ,వివిధ మనస్తత్వాల చిత్రణ కూడా ఆకర్షిస్తుంది.